అన్వేషించండి
Advertisement
Andhra Pradesh: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బదిలీలపై నిషేధం ఎత్తివేత
Andhra Pradesh Govt Employees | ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తేశారు. ఆగస్టు 31 వరకు ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తి చేసి, మళ్లీ నిషేధం విధించనుంది కూటమి సర్కార్.
AP Govt lifted ban on transfer of employees | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై విధించిన నిషేధం ఎత్తివేశారు. ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం మంగళవారం (ఆగస్టు 13న) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు, వివిధ విభాగాల్లోని ఇంజినీరింగ్ సిబ్బంది బదిలీలకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆగస్టు 31వ తేదీ లోపు బదిలీలు పూర్తి చేసి, మళ్లీ నిషేధాన్ని అమలు చేయనుంది కూటమి ప్రభుత్వం. అయితే ప్రతి ఏడాది మే నెలలో బదిలీలు జరగాల్సి ఉంది. ఈ ఏడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఉద్యోగుల బదిలీ వాయిదా పడింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement