అన్వేషించండి

Andhra Pradesh Deputy CM పవన్ కళ్యాణ్ టార్గెట్ ఇదే, జనసేన మంత్రులు ఏం చేయబోతున్నారో కీలక ప్రకటన

Andhra Pradesh Deputy CM Pawan Kalyan: జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లకు కేటాయించిన మంత్రి పదవుల వెనుక ఉన్న సీక్రెట్ ను, తమ వ్యూహాన్ని వెల్లడించారు.

AP Minister Pawan Kalayn News in Telugu | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని, మంత్రివర్గంలో తన బాధ్యతలపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ మంత్రివర్గంలో జనసేన తీసుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలు ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవి మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవి అని పంచాయతీరాజ్- గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న తాను తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించినట్లు చెప్పారు. ప్రజల సమస్యల అవగాహన, మౌలిక సదుపాయాల కల్పనపై అధ్యయనం కోసమే 2019 ఎన్నికలకు ముందు ప్రజా పోరాట యాత్ర చేపట్టినట్లు చెప్పారు. వాటిపై అధ్యయనం చేయగా.. రాష్ట్రంలోని ప్రతీ ప్రాంత సమస్యలపై అవగాహన వచ్చిందన్నారు. 

గ్రామాల్లో సమస్యలు కళ్లారా చూసిన పవన్ కళ్యాణ్
‘విశాఖ మన్యంలో పర్యటిస్తున్నపుడు కురిడి అనే గిరిజన గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామ ఆడపడుచులు గుక్కెడు నీళ్ళ కోసం తమ అవస్థలను చెబుతూ, అక్కడి బావిలో కలుషితమైన నీటిని చూపించారు. సమీపంలోని తోటవలస గ్రామానికి వెళ్లగా.. వారి సమస్యలను ఆ ఊరివాళ్ళు వివరించారు. గోదావరి జిల్లాలకు వెళ్లినప్పుడు పలు మత్యకార గ్రామాలవాసులు తాగునీటి కోసం పడుతున్న కష్టాలను చెప్పారు. గ్రామీణ అభివృద్ధి - దేశాభివృద్ధి అనే నినాదం నామమాత్రంగా మిగిలిపోవడం గమనించాను. గుక్కెడు మంచి నీరు కోసం మైళ్ళ దూరం వెళ్లి ప్రయాసతో బిందెడు నీరు తెచ్చుకుంటున్న మహిళల కష్టాలు చూశాను.

గతేడాది జనసేన కేంద్ర కార్యాలయంలో గ్రామ సర్పంచులతో చర్చాగోష్టి నిర్వహించాం. పార్టీలకు అతీతంగా సర్పంచులు పాల్గొన్నారు. నాటి వైసీపీ ప్రభుత్వం పంచాయతీల నిధులను ఏ విధంగా మళ్లించిందో వివరిస్తూ తాము నిధులు, అధికారాలు లేక ఏ విధంగా కష్టపడ్డారో చెప్పారు. స్థానిక సంస్థల చట్టాలు, విధులు, నిధుల వినియోగంపై సాధికారత కలిగిన చెల్లప్ప, డా.ఈడిగ వెంకటేష్ లాంటి మేధావులు, ఆచార్యులతో కూడా ఆ రోజు చర్చించాం. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాల్సి ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లెలకు రక్షిత తాగు నీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తానన్నారు’ పవన్ కళ్యాణ్.

పర్యావరణం జనసేన సిద్ధాంతాల్లో భాగం 
‘పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం’ జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. ఓవైపు పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగుతూ.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందాలి. కానీ ఆ అభివృద్ధి పర్యావరణానికి హితంగా జరగాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ మేళవించిన సురక్షితమైన పారిశ్రామిక అభివృద్ధి మనకు అవసరం. విశాఖ ఎల్.జి. పాలిమర్స్ ప్రమాదాన్ని ఎవరం మరచిపోలేం. ప్రజల ఆరోగ్యాలకు చేటు చేయకుండా, పరిశ్రమలు ఆధునిక సాంకేతికను వాడుకునేలా పరిశ్రమలు ముందుకు వెళ్ళడానికి సహకరిస్తామన్నారు. భూ తాపాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలకు సహకరిస్తామని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తామని తెలిపారు.

అటవీ సంపదను కాపాడుకుంటాం
వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తి నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఒక్క వృక్షాన్ని రక్షించుకుంటేనే మానవ కోటికి ఎంతో మేలు కలిగితే, మరి లక్షలాది వృక్షాలు ఉన్న అడవి తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటే ఎంతో మేలు కలుగుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అడవుల విధ్వంసమే కరువు కాటకాలకు హేతువు అని.. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతాము అని స్పష్టం చేశారు. అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా జైలుకు పంపుతాం. తీర ప్రాంతాల్లో మడ అడవుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెడతామని.. శాస్త్ర, సాంకేతిక విభాగాలు మనకు అత్యంత అవశ్యకం అన్నారు.

ప్రజా పంపిణీ, ఆహార భద్రతపై స్పెషల్ ఫోకస్
జనసేన నుంచి మంత్రులుగా ఉన్న నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లకు ప్రజా ప్రయోజనం కలిగేలా, అభివృద్ధి సంబంధిత శాఖలు వచ్చాయన్నారు. పౌరసరఫరాలు, టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. నాదెండ్ల మనోహర్ చేపట్టిన ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు రేషన్ కార్డుదార్లకు నిత్యావసరాలు పంపిణీపై స్పెషల్ ఫోకస్ చేస్తామన్నారు. రైతుల నుంచి పంటల కొనుగోలు విధానం, అన్నదాతలకు డబ్బులు చెల్లించడంలో మెరుగైన విధానం పాటిస్తాం. రాష్ట్రంలో వరి రైతులకు పంట కొనుగోలు డబ్బులు అందించడంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య విధానాలు, రైతుల వేదన స్వయంగా చూశాం కనుక ఆ పరిస్థితులు రానీయం అన్నారు.

పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు
ఏపీలో పర్యాటకం (AP Tourism) అభివృద్ధి జరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఓవైపు పర్యాటకంతోపాటు, ధార్మిక, భక్తి పర్యాటకం అభివృద్ధిపై ఫోకస్ చేస్తాం. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలలో మెరుగైన వసతులతో పాటు ఏపీకి ఒక బ్రాండ్ కల్పించడంపై దృష్టిపెట్టాలన్నారు. సినిమా రంగానికి ఏపీలో ప్రోత్సాహకర, స్నేహపూరిత వాతావరణం తెస్తామన్నారు. షూటింగ్ ప్రాంతాలలో సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, ఈ రంగంలో యువతకు ఉపాధి దక్కేలా చూస్తామన్నారు. జనసేన పార్టీకి కేటాయించిన శాఖల ద్వారా చిత్తశుద్ధితో సేవ చేస్తాం. మేం నిర్వహించే శాఖలపై మరింత లోతైన అధ్యయనం జరిపి, ప్రజలకు మరింత మేలు చేసేందుకు సిద్ధమని ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కోసం సహకారంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ప్రజలతో నేరుగా సంబంధ ఉండేలా మంత్రిత్వ శాఖలు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget