అన్వేషించండి

Chandrababu Comments: 'నేను వెళ్తున్నాననే జగన్ హడావుడి' - సీఎంపై చంద్రబాబు విమర్శలు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

Chandrababu News: 'మిగ్ జాం' తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Chandrababu Visited Michaung Affected Areas in Guntur: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) శుక్రవారం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు (Guntur) జిల్లా తెనాలి (Tenali), వేమూరు (Vemuru), బాపట్ల నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగుతోంది. ఈ సందర్భంగా తెనాలి వెళ్తూ మార్గమధ్యంలో రేవేంద్రపాడు వద్ద రైతులతో మాట్లాడారు. 'మిగ్ జాం' ప్రభావంతో తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం ఇంత వరకూ పంట నష్టం అంచనాకు రాలేదని బాధిత రైతులు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడిన అనంతరం ఆయన నందివెలుగు వద్ద దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

'హడావుడి తప్ప ఏం చేయలేదు'

తుపాను సాయం విషయంలో సీఎం జగన్ హడావుడి తప్ప ఏం లేదని చంద్రబాబు విమర్శించారు. తాను పర్యటనకు వెళ్తున్నానని తెలిసి, సీఎం హడావుడిగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతుల కష్టాలను దగ్గరుండి తెలుసుకోవాల్సిన మంత్రులు ఎక్కడ అని ప్రశ్నించారు. 'ప్రజల కష్టాలు ఇంకా 3 నెలలే. నేను పంట నష్ట పరిహారం పెంచుకుంటూ వెళ్తుంటే జగన్ తగ్గించుకుంటూ వస్తున్నారు. కనీసం పంట బీమా కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. రైతులు ధైర్యంగా ఉండాలి.' అని అన్నారు. 

2 రోజుల పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల పాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అమృతలూరు, నగరం, కర్లపాలెం మండలాల్లో పర్యటన అనంతరం, రాత్రి బాపట్లలోనే బస చేయనున్న చంద్రబాబు శనివారం పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. అనంతరం అక్కడి రైతులతో నేరుగా మాట్లాడనున్నారు.

చాలా విరామం తర్వాత

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కంటికి శస్త్రచికిత్స అనంతరం వారం రోజులు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల, బెజవాడ దుర్గమ్మ ఆలయం పుణ్యక్షేత్రాలను సందర్శించారు. దాదాపు 2 నెలల అనంతరం పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

ప్రధాన డిమాండ్స్ ఇవే

తుపాను కారణంగా బాధితులకు అందించే సాయంపై ప్రధానంగా కొన్ని డిమాండ్స్ ను చంద్రబాబు ప్రభుత్వం ముందుంచారు. వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.30,000, ఆక్వా రైతులకు రూ.50,000, అరటికి రూ.40,000, చెరకు పంటకు రూ.30,000, పత్తి, వేరుశనగకు రూ.25,000, జొన్న, మొక్కజొన్న, అపరాలు, పొద్దు తిరుగుడుకు రూ.15 వేలు, జీడి పంటకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీడీపీ వర్గాలు వివరాలు వెల్లడించాయి.  

Also Read: Andhra News: 'వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికీ రూ.2,500' - తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget