Andhra News : గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది ? - వెదుక్కుంటున్న టీడీపీ, జనసేన !
TDP and Jana Sena : ఏపీలో రోడ్ల దుస్థితిపై టీడీపీ, జనసేన ఉమ్మడి ఆందోళన ప్రారంభించాయి. ప్రభుత్వం రోడ్లు బాగు చేయకపోవడాన్ని రెండు పార్టీల నేతలు ఖండించారు.
Andhra News : ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ.. కలిసి కార్యాచరణ రూపొందించుకున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం ప్రారంభించాయి. అందులో భాగంగా టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి పోరాట కార్యాచరణలో భాగంగా శని, ఆదివారం రోడ్ల పరిస్థితిపై క్షేత్ర స్థాయిలో ఆందోళనలు ప్రారంభించారు. రెండ్రోజులపాటు ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి.. ఇందులో భాగంగా ధ్వంసమైన రోడ్ల వద్దకు వెళ్లి నిరసనలు తెలపడం, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించడం, అధికారులకు రోడ్ల దుస్థితిపై వినతి పత్రాలు అందించడం చేస్తున్నాయి.
రహదారుల దుస్థితిపై గడ్డమణుగు నుండి జి.కొండూరు వరకు టీడీపీ, జనసేన సంయుక్తంగా ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’ పేరుతో నిరసన పాదయాత్ర
— Devineni Uma (@DevineniUma) November 18, 2023
స్వయంగా పార పట్టి గ్రావెల్ తో గుంతలు పూడ్చుతూ జనసేన ఇంఛార్జి అక్కల గాంధీతో కలిసి నిరసన
కనీసం రహదారుల్లో గోతులను కూడా పూడ్చలేని దుస్థితిలో ఈ చేతకాని… pic.twitter.com/7YfkQQUpmy
పలు చోట్ల టీడీపీ , జనేసన నేతలు కలిసి ఆందోళనలు చేశారు. ప్రజా సమస్యలపై ఉమ్మడిగా కదిలితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని ఈ ఆలోచన చేశామని, వరుస క్రమంలో వివిధ సమస్యలపై ఆందోళనలు చేపడతామని ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి. గుంతలు పడ్డ రోడ్లు.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజలు పడుతోన్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా చేయాలని నిర్ణయించారు.. #GunthalaRajyamAP, #WhyAPHatesJagan హ్యాష్ ట్యాగులతో సోషల్ మీడియా వేదికగా టీడీపీ – జనసేన ప్రచారం చేస్తున్నారు.
రోడ్డు మీద గుంత ఉండటం కాదు, గుంతల మధ్య రోడ్డు ఆనవాళ్లు మిగల్చడం జగన్ రెడ్డి ప్రత్యేకం. ఏపీకి గుంతల ఆంధ్రప్రదేశ్ అన్న పేరు తెచ్చిన జగన్ కి మళ్ళీ ఓటేయడం అంటే, కోరి గోతిలోపడ్డట్టే.#GunthalaRajyamAP #WhyAPHatesJagan pic.twitter.com/5QIJIpKwjE
— Telugu Desam Party (@JaiTDP) November 18, 2023
రెండు పార్టీల శ్రేణులు ఐకమత్యంతో కలిసి పనిచేసేలా ఉమ్మడి ఆందోళనలకు నాయకత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. . కాగా, ఇప్పటికే రాష్ట్రస్థాయి ఉమ్మడి సమావేశాలతో పాటు.. నియోజకవర్గాల స్థాయిలోనూ టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడి సమావేశాలు నిర్వహించి ప్రజాపోరాటాలపై నిర్ణయం తీసుకుంది.
ఇది రోడ్డే...కాకపోతే గోతులు, గుంతల రోడ్డు ఉంటుంది. గుంటూరు నుంచి నందివెలుగు వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి ఇది. కొలకలూరు గ్రామం దగ్గర రోడ్డు మధ్యన పెద్ద గొయ్యి ఉంది. ఎవరూ పడిపోకుండా జనమే రాళ్ళు, చెట్టు కొమ్మలు పెట్టుకున్నారు !! #GunthalaRajyamAP #WhyAPHatesJagan pic.twitter.com/v5991wSC88
— Manohar Nadendla (@mnadendla) November 18, 2023
ఇప్పటికే నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడిగా సమన్వయ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కలిసి పని చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓట్ల బదిలీ పర్ ఫెక్ట్ గా జరగాలంటే.. అన్ని స్థాయిలో సమన్వయం ఉండాలని భావిస్తున్నారు.