CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన
CM Jagan : సీఎం జగన్ రేపు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అచ్యుతాపురం ఏపీ సెజ్ లో పలు పరిశ్రమలకు సీఎం భూమిపూజ చేయనున్నారు.
CM Jagan : సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు(మంగళవారం) అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీ సెజ్‌లో పలు కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ఫేజ్ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ పాల్గొనున్నారు. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూప్‌నకు చెందిన ఏటీసీ టైర్ల తయారీ కంపెనీ ఉత్పత్తికి సిద్ధమైంది. మొత్తం రెండు దశల్లో రూ. 2,200 కోట్ల పెట్టుబడితో దాదాపు రెండు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ కంపెనీ 6 ఖండాల్లో 120 దేశాలలో విస్తరించి ఉంది. దేశంలో ఇప్పటికే తమిళనాడులోని తిరునల్వేలి, గుజరాత్‌లోని దహేజ్‌లో ఏటీసీ టైర్ల మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను నెలకొల్పింది. అచ్యుతాపురం యూనిట్ మూడోది.
ఏపీ సెజ్ లో పరిశ్రమలకు భూమి పూజ
ఏపీ సెజ్ ప్రాంగణంలో సీఎం జగన్ పలు నూతన యూనిట్లకు భూమి పూజ చేయనున్నారు. ఇందులో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, ఈ పరిశ్రమ రూ.816 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. నేరుగా 800 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. 100 టీపీడీ కెపాసిటి కాగా మెస్సర్స్ పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఈ పరిశ్రమ ద్వారా రూ. 202 కోట్ల పెట్టుబడి, 380 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వాటర్ ప్రూఫింగ్ ఉత్పత్తుల తయారీ, కోటింగ్, సీలెంట్స్ తదితర ఉత్పత్తుల తయారీ యూనిట్ విస్తరణకు సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. మేఘ ఫ్రూట్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, కార్బొనేటెడ్ ప్రూట్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, ప్రూట్ జ్యూస్‌ల టెట్రా ప్యాకింగ్, పెట్ బాటిల్స్ తదితర ఉత్పత్తుల బెవరేజెస్ యూనిట్‌ను సెజ్ లో నెలకొల్పనున్నారు. ఇప్పటికే మంగుళూరు, సంగారెడ్డిలలో యూనిట్లు ఉన్న ఈ కంపెనీ అచ్యుతాపురం సెజ్‌లో రూ. 185.25 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందులో దాదాపు 700 మందికి ఉద్యోగాలను కల్పించనున్నారు.
పలు పరిశ్రమలు
మెస్సర్స్ ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ ప్రెవేట్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ గ్యాసెస్ తయారీలో పేరుగాంచిన ఈ సంస్థ దేశంలో ఇప్పటికే 38 మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను నెలకొల్పింది. రూ. 145 కోట్ల పెట్టుబడితో లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆర్గాన్ తదితర ఉత్పత్తులను ఇక్కడ తయారుచేయనున్నారు. మెస్సర్స్ ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇప్పటికే హైదరాబాద్, పరవాడలలో మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటుచేసిన ఈ సంస్థ ఇక్కడ రూ. 125 కోట్ల పెట్టుబడితో మరో యూనిట్‌ను ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. విన్ విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ లిమిటెడ్ ,అత్యాధునిక సాంకేతికతతో కూడిన వోల్టేజ్ సిరామిక్ ఇన్సులేటర్స్, పాలిమెరిక్ ఇన్సులేటర్ల తయారీలో పేరుగాంచిన ఈ కంపెనీ దాదాపు రూ. 107.70 కోట్ల పెట్టుబడితో ఇక్కడ యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది.
సీఎం జగన్ శంకుస్థాపన
సైనాప్టిక్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ,బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియట్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ దాదాపు రూ. 81.75 కోట్ల పెట్టుబడితో ఇక్కడ మరో యూనిట్ ఏర్పాటుకు సిద్దమైంది. స్టైరాక్స్ లైఫ్‌సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ , బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియట్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది. ఈ సంస్థ దాదాపు రూ. 87.77 కోట్ల పెట్టుబడితో ఇక్కడ మరో యూనిట్ ఏర్పాటుకు సిద్దమైంది. ఇషా రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, కోక్ కోల్ స్క్రీనింగ్ కోసం రూ. 68.06 కోట్ల పెట్టుబడితో సెజ్ లో యూనిట్‌ను నెలకొల్పనుంది. విశాఖపట్నం పెదగంట్యాడలో ఇప్పటికే కోక్, కోల్ స్క్రీనింగ్, గ్రేడింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. వీటికి జగన్ స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు.
Also Read : ఏపీ రాజకీయ వేదికపై ఇంత వరకు చూడని సీన్ ఇవాళ మీరు చూడబోతున్నారు!