AP Assembly Pardhasaradhi: మూడు రాజధానులు కులాల సమస్య కాదు - ప్రాంతాల మధ్య సమతుల్యత : పార్థసారధి
మూడు రాజధానులు ప్రాంతాల మధ్య సమతుల్యత కోసమని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీలో ప్రసంగించారు. దోచుకోవడానికే చంద్రబాబు అమరావతిని రాజధానిగా చేశారన్నారు.
![AP Assembly Pardhasaradhi: మూడు రాజధానులు కులాల సమస్య కాదు - ప్రాంతాల మధ్య సమతుల్యత : పార్థసారధి YSRCP MLA Parthasarathy addressed the assembly calling for balance between the three capitals regions. AP Assembly Pardhasaradhi: మూడు రాజధానులు కులాల సమస్య కాదు - ప్రాంతాల మధ్య సమతుల్యత : పార్థసారధి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/24/39822b2dffb8a003a9eb7a4c66915ccb_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మూడు రాజధానుల అంశాన్ని కులాల సమస్యగా చూస్తున్నారే తప్ప రాష్ట్రాభివృద్ధిగా చూడటం లేదని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సమస్య ఎలా వచ్చిందనే అంశాన్ని ఓ సారి పరిశీలించాలన్నారు. రాష్ట్రానికి రాజధాని లేదనే అంశాన్ని చంద్రబాబు క్యాష్ చేసుకున్నారని ఆరోపించారు. విజయవాడో, గుంటూరో రాజధానిగా ప్రకటించి ఉంటే కచ్చితంగా ఈపాటికే అభివృద్ధి జరిగేదన్నారు. ఆయనకు రాజధాని నిర్మించాలనే లక్ష్యం కంటే దోచుకవాలనే ఆరాటం ఎక్కువగా ఉండేదని విమర్శించారు.
అమరావతిని దోచుకునేందుకు చాలా అందంగా డిజైన్ చేశారని విమర్శించారు. ముందుగానే అమరావతిని రాజధానిగాప్రకటిస్తే అందరూ వచ్చి భూములు కొనెస్తారని అనుమానించి కొన్ని రోజులు నూజివీడు అని మరికొన్ని రోజులు అగిరిపల్లిలో పెడుతున్నామని మీడియాకు లీకులు ఇచ్చారన్నారు. ఆ ట్రాప్‌లో పడిన చాలా మంది అమాయకులు బలైపోయారు. ఇవాల్టి కూడా అనేక ఆర్థిక సమస్యలు అక్కడ కొనసాగుతున్నాయి. 2014మే నుంచి అమరావతి ప్రకటించే వరకు నూజివీడు, అగిరపల్లిలో రిజిస్ట్రేషన్లు చూస్తే ఎంతమంది అమాయకులు బలైపోయారో తెలుస్తుందన్నారు. ఆయన మాత్రం తన అనుయాయులతో అమరావతిలో భూములు కొనిపించి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. విజయవాడ గుంటూరును వదిలేశారు. అమరావతిని ఒక గేటెడ్ కమ్యూనిటీగా మార్చాలనుకున్నారని పార్థసారధి విమర్శించారు. అన్ని సామాజిక వర్గాలకు అనుకూలంగా ఏర్పాటు చేయలేదన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇంబేలెన్స్ అని చంద్రబాబు చెప్పారన్నారు. అమరావతిని అన్ని వర్గాలు కలిసి ఉండేలా ఏర్పాటు చేయాలనుకోలేదన్నారు. దానిపై కోర్టుకు కూడా వెళ్లారు. ఇలా కోర్టుకు వెళ్లడం వల్ల ఇల్ల స్థలాలు ఇవ్వడం ఏడాది ఆలస్యమైందన్నారు. ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు బాధపడుతున్నారన్నాు.
రాష్ట్రప్రభుత్వం నిధులు కేటాయించి నిర్మాణాలు పూర్తి చేయడానిక ఏడిమిది ఏళ్లు పడుతుందన్నారు. అందుకే ఇది సాధ్యమా అని అలోచించుకోవాలని పార్థసారధి సూచించారు. రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ప్రతి అంశంపై కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన అంశాలపై కేంద్రంపై ఎందుకు కోర్టుకు వెళ్లలేకపోయారు. వెనుకబడిన ప్రాంతాలు అంటే రాయలసీమ, ఉత్తారంధ్ర. ఇవాళ చేసినట్టుగానే కర్నూలు వాసులు అప్పుడు గానీ చేసి ఉంటే రాజధాని హైదరాబాద్ కు వెళ్లేదా అని ప్రశ్నించారు పార్థసారథి. ఈ వెనుకబడిన ప్రాంతాల నుంచి వెళ్లిన లక్షల మంది ప్రజలు కూలీలుగా పని చేస్తున్నారు. అలాంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే కర్నూలులో హైకోర్టు, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తే తప్పేంటన్నారు. అలా చేసి ఉంటే ఇప్పటికే అమరావతి అభివృద్ధి చెందేదన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కోర్టులు చేస్తున్న కామెంట్స్‌పై ప్రజలు ఆలోచిస్తున్నారు. తీర్పులు చూస్తుంటే మిస్ యూజ్ అవుతున్నారనే అనుమానం కలుగుతోంది. శాసనసభకు చట్టాలు చేసే అధికారం లేదని చెప్పడం ఎంత వరకు సమంజసం. చట్టాన్ని విత్‌డ్రా చేసుకుంటే కోర్టులో కేసు లేనట్టేగా.. కానీ లేని చట్టంపై జడ్జిమెంట్ ఇచ్చారంటే అర్థమేంటి. అమలులో లేని చట్టంపై కామెంట్స్ చేయడం రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. మూడు రాజధానుల అభివృద్ధితో అమరావతి ప్రగతి సాధ్యం. అమరావతిని రాజధానిగా మాత్రమే కాకుండా ఐటీ హబ్‌గా, ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుంది. అమరావతి అభివృద్ధికి కట్టుబడి ప్రభుత్వం ఉంది. ఎంవోయూలో చేసినదాని కంటే ఎక్కువ రైతులకు మేలు చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనిపై అపోహలు అవసరం లేదు. మూడు ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ది చేస్తుందని భావిస్తున్నానని ప్రసంగాన్ని ముగించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)