AP Assemlby Chevireddy : ఏ బెంచ్‌కు వెళ్తే ఎలాంటి తీర్పు వస్తుందో చెప్పే పరిస్థితి వచ్చింది: అసెంబ్లీలో చెవిరెడ్డి
ఏ బెంచ్‌కు వెళ్తే ఎలాంటి తీర్పు వస్తుందో చెప్పే పరిస్థితి వచ్చిందని అసెంబ్లీలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మూడు రాజధానులపై చర్చలో న్యాయవ్యవస్థపై చెవిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కోర్టుల్లో ఏ బెంచ్‌పైకి వెళ్తే ఎలాంటి తీర్పు వస్తుందో చెప్పే పరిస్థితి వచ్చిందని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. కోర్టులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. తాను రెండు వ్యవస్థలను క్షణ్ణంగా పరిశీలించానన్నారు. వ్యవస్థలపై పైచేయి సాధించాలనుకోవడం సరికాదని చెవిరెడ్డి న్యాయవ్యవస్థను ఉద్దేశించి అన్నారు. మిగతా రెండు వ్యవస్థలపై పెత్తనంతో బలప్రదర్శన చేయాలనుకోవడం సరికాదన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రజలు ఎన్నుకుంటారన్నారు. బాగా పనిచేస్తే తిరిగి ఎన్నిక అవుతారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారి అని చెవిరెడ్డి పేర్కొన్నారు.
న్యాయమూర్తులు ఎవరికి జవాబుదారి అని చెవిరెడ్డి ప్రశ్నించారు. వారికి నైపుణ్యాలు ఉన్నాయో లేదో నిర్దారించేదెవరు...? అని చెవిరెడ్డి ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలు తాను అడం లేదని.. రెండో పరిపాలన సంస్కరణ కమిటీ అడిగిన ప్రశ్నలు అని చెవిరెడ్డి స్పష్టం చేసారు. సుప్రీంకోర్టు నుంచి కింది కోర్టు వరకు అన్నింటికి కోడ్ ఆఫ్ కాండాక్ట్ ఉండాలని చెప్పారు. మోదీ ప్రబుత్వం కూడా 2018లో న్యాయవ్యవస్థ జవాబదారీతనం కోసం చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేసిందన్నారు.
కార్యనిర్వాహక ఎంపిక చాలా కఠినంగా ఉంటుంది. అలాంటప్పుడు న్యాయవ్యవస్థను పరిరక్షించే జడ్జిల ఎంపిక మరింత కఠినంగా ఉండాలన్నారు. యూపీఎస్‌సీ తరహాలోనే జడ్జిల నియామకం ఉండాలి. ఇష్టం ఉన్న వారిని నియమించుకోనే కొలిజియం వ్యవస్థ ప్రజాస్వామ్యమబద్దమైనా అని ఆలోచించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆలంటి విధానాలు కొనసాగడం ఎంత వరకు సహేతుకమని ప్రశఅనించారు. న్యాయమూర్తులు న్యాయంగా ఉండటంతోపాటు న్యాయంగా కనిపంచాలని సలహా ఇచ్చారు.
ఎన్నికలకు ముందు ప్రజలకు ఏం చేస్తామో మేనిఫెస్టో ఇస్తాం. ఎన్నికల కమిషన్‌కు ఇచ్చాం. ప్రజలకు ఆ పథకాలు అమలు చేయాలంటే రాజ్యాంగం కల్పించే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉండాలన్నారు. వ్యవస్థల మేనేజ్‌మెంట్ ద్వారా అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తుంటే.. ప్రజల మనసులు గెలుచుకొని అధికారంలోకి రావాలన్న నిబద్దత తమదన్నారు. కోర్టుల భుజాలపై తుపాకులు పెట్టి మమ్మల్ని కాల్చాలనే సంస్కృతి ప్రతిపక్షానిదని విమర్శించారు. కోర్టులు ఆ వాస్తవాలు గమనించాలన్నారు. జస్టిస్ చంద్రు ఇచ్చిన తీర్పులు 90 శాతం బాధితుల పక్షాన ఉన్నాయని. అలాంటి చంద్రు కూడా అన్న మాటలు గుర్తు చేసుకోవాలని న్యాయవ్యవస్థకు అసెంబ్లీ వేదికగా చెవిరెడ్డి సలహా ఇచ్చారు.
కోర్టులు పాలనలో జోక్యం చేసుకుంటే ప్రభుత్వాలు చేసేది ఏంటని చెవిరెడ్డి ప్రశఅనిచారు. కోర్టులు తాము తీసుకున్న నిర్ణయాలకు ఎవరికి జవాబుదారి అని.. ఎప్పుడైనా ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయం కాగలవా అని ప్రశఅనించారు. డిక్రీల ద్వారానే పాలిస్తామంటే పాలన గతి తప్పుతుందన్నారు. దేశానికి ప్రజాభిప్రాయమే సుప్రీం. మూడు వ్యవస్థలు ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది. ఈ మూడు వ్యవస్థల మధ్య సమస్య రాకుండా ఉండాలంటే ముందడుగు వేయాలని కేంద్రానికి చెవిరెడ్డి విజ్ఞప్తి చేశారు.