Electricity Bill: తప్పు తెలుసుకున్న విద్యుత్ డిస్కంలు- పేమెంట్ యాప్స్ ద్వారా బిల్లుల చెల్లింపు విధానం పునరుద్ధరణ
UPI Payments: అనుభవంలోకి వస్తే తప్ప తత్వం బోధపడలేదన్నట్టు.. తెలుగు రాష్ట్రాల్లోని విద్యుత్ డిస్కంలకు ఇప్పుడు అసలు విషయం తెలిసి వచ్చింది. పాత బిల్లు చెల్లింపు విధానం పునరుద్ధరించాయి.
AP And Telangana Electricity Bill Payment System: తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. రెండు నెలలుగా పడుతున్న సమస్యకు పరిష్కారం లభించింది. చేసిన తప్పును తెలుసుకున్న డిస్కంలు దారిలోకి వచ్చాయి. ఎప్పటి మాదిరిగానే డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా చెల్లించవచ్చని సెలవిచ్చాయి.
డిజిటల్ పేమెంట్ యాప్స్ వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు చెల్లించడం చాలా సులభమైపోయింది. అంతకు ముందు ఈ బిల్లు చెల్లించేందుకు పెద్ద యుద్ధాలే జరిగేవి. అయితే ఈ మధ్య కాలంలో డిస్కంలు తీసుకున్న నిర్ణయం చాలా వివాదాస్పదమైంది. డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా బిల్లులు చెల్లించడానికి వీల్లేదని చెప్పడంతో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఇబ్బంది పడ్డారు.
రెండు నెలల క్రితం కరెంటు బిల్లులు డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా కాకుండా నేరుగా గానీ లేదా అధికారిక వెబ్‌సైట్స్ ద్వారా అయినా చెల్లించాలని APCPDCL, TGSPDCL కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే కొందరు ఇప్పటికీ కొత్త విధానానికి టర్న్ అవ్వలేదు. మరికొందరు నేరుగా వెళ్లి చెల్లిస్తున్నారు. ఇంకొందరు డిస్కమ్‌లు సూచించిన వెబ్‌సైట్, యాప్ ద్వారా చెల్లిస్తున్నారు.
దీని వల్ల కరెంటుబిల్లు చెల్లింపులపై తీవ్ర ప్రభావం చూపించింది. చాలా వరకు బకాయిలు పేరుకుపోయాయి. డిస్కంలు సూచించిన యాప్స్, వెబ్‌సైట్ సరిగా పనిచేయడం లేదన్న ఫిర్యాదులు ఎక్కువ అయ్యాయి. ఇలా అన్ని విధాలుగా ఇబ్బందు ఎదురుకావడంతో డిస్కంలు పునరాలోచించుకున్నాయి. వినియోగదారులు అలవాటు పడిన విధానంలో కాకుండా మార్పులు చేసి తప్పు చేశామని భావించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి.
Also Read: సరికొత్త రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేటు - మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు పాత విధానంలోనే కరెంటు బిల్లులు చెల్లించుకోవచ్చని సెలవిచ్చాయి. ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్ పే, పేటీఎం ఇలా వివిధ డిజిటల్ పేమెంట్స్ ద్వారా బిల్లులు చెల్లించ వచ్చని పేర్కొన్నాయి. చేసిన తప్పు గ్రహించిన ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవడంతో అటు వినియోగదారులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
విషయాన్ని అందరికీ తెలిసేలా విద్యుత్ శాఖాధికారులు చర్యలు తీసుకున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటనలు పెట్టారు. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు.
Also Read: భారీగా పతనమైన చమురు రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవి