అన్వేషించండి

AP Cabinet: బాలినేని బాధ్యతలు పెద్దిరెడ్డికి - తానేటి వనితకు హోం, ఆ ఇద్దరి శాఖలు ఎక్స్చేంజ్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం కొలువు దీరింది. పాత మంత్రివర్గంలోని పదకొండు మందికి రెండోసారి అవకాశం ఇచ్చారు సీఎం జగన్.చాలా మందికి పాత శాఖలే వచ్చాయి.

కొత్తగా వచ్చిన మంత్రివర్గంలో శాఖ కేటాయింపులో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. కొత్త కేబినెట్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన ఆ పదకొండు మంది శాఖల్లో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఆ పదకొండు మందిలో ఆరుగురికి సుమారు పాత శాఖలే వచ్చాయి. మరికొందరికి పాతశాఖతోపాటు అనదపు శాఖను కూడా కేటాయించారు. అలాంట వారిలో చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మొదటి ప్లేస్‌లో ఉన్నారు. ఈయన గత కేబినెట్‌లో బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా పని చేశారు. ఇప్పుడు బీసీ వెల్ఫేర్‌తోపాటు ఆయనకు అదనంగా సినిమాటోగ్రఫి, సమాచారా ప్రసార శాఖను కట్టబెట్టారు. గతంలో ఈ రెండు శాఖలను పేర్ని నాని చేతిలో ఉండేవి. ఆయన్ని ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోలేదు. 

నారాయణ స్వామి గత మంత్రివర్గంలో ఉన్న శాఖనే జగన్ మళ్లీ ఆయనకు కేటాయించారు. అప్పడు ఎక్సైజ్ శాఖ చేసిన నారాయణ స్వామి ఈసారి కూడా అదే శాఖ ఇచ్చారు. జగన్ టీంలో రెండోసారి మంత్రి అయిన అంజాద్‌ బాషాకు పాత శాఖనే మళ్లీ కేటాయించారు. ఆయన మైనారిటీ వెల్ఫేర్ మంత్రిగా మళ్లీ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. వీళ్లతోపాటు గుమ్మనూరి జయరాం, సీదిరి అప్పల రాజు, బుగ్గన రాజేంద్రనాథ్‌ తమతమ శాఖలనే మళ్లీ ఛార్జ్ తీసుకోనున్నారు. గుమ్మనూరి జయరాం కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా చూడబోతున్నారు. సీదిరి అప్పలరాజు పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారు. బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి మరోసారి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రిగా సేవలు అందించనున్నారు. 

జగన్‌ టీంలో  రెండోసారి మంత్రిగా పదవీ ప్రమాణం చేసిన పెద్దిరికి అదనంగా విద్యుత్ శాఖను అప్పగించారు. గతంలో ఆయన 
పంచాయతీరాజ్‌, అటవీ, గనులు శాఖ మంత్రిగా పని చేశారు. ఈసారి ఆయనకు విద్యుత్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అటవీ, గనుల శాకను కట్టబెట్టారు. ఆయన గతంలో పనిన చేసిన పంచాయతీరాజ్‌ను ముత్యాలనాయుడికి కట్టబెట్టారు. బాలినేని శ్రీనివాసుల రెడ్డి చేపట్టిన విద్యుత్ శాఖను ఇప్పుడు ఈయనకు ఇచ్చారు. 

మున్సిపల్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ బాధ్యతలు చేపట్టి పలుమార్లు పలు ఆరోపలు ఎదుర్కొన్న బొత్స సత్యనారాయణకు ఈసారి విద్యాశాఖ వరించింది. గతంలో ఈ శాఖ ఆదిమూలపు సురేష్‌ చేపట్టారు. బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌ శాఖలు ఒకరివి ఇంకొకరికి మారాయి. 

మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖ హోంశాఖ ఇప్పుడు ఇది మరోసారి మహిళనే వరించింది. అప్పట్లో రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఈ శాఖను తొలిసారిగా మహిళకు కేటాయించారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా హోంమినిస్టర్‌గా సబితా ఇంద్రారెడ్డి పని చేశారు. ఇప్పుడు వైఎస్‌ కుమారుడు జగన్‌ కూడా అదే స్టైల్‌లో హోంమినిస్టర్ పదవి మహిళకు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 2019లో మేకతోటి సుచరితకు ఇచ్చారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో భాగంగా హోంమంత్రి పదవిని తానేటి వనితకు ఇచ్చారు. గతంలో ఈమె స్త్రీ శిశుసంక్షేమ శాఖ బాధ్యత నిర్వహించారు. ఇప్పుడు ఆ శాఖ బాధ్యతలను ఉషా శ్రీ చరణ్‌కు అప్పగించారు. 

జగన్ టీంలో రెండోసారి ఛాన్స్‌ దక్కించుకున్న పినిపె విశ్వరూప్ శాఖ కూడా మారింది. గతంలో ఆయన సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు ఆయనకు రవాణా శాఖ అప్పగించారు. గతంలో ఈ శాఖను పేర్ని నాని నిర్వహించారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Embed widget