News
News
వీడియోలు ఆటలు
X

AP Rain Alert: బంగాళాఖాతంలో ఆవర్తనం, 3 రోజులపాటు అక్కడ వర్షాలు - కంట్రోల్ రూం నెంబర్లు ఇవీ

ఆదివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.

FOLLOW US: 
Share:

ఐఎండీ అంచనా ప్రకారం రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఆదివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
రేపటి నుండి సోమవారం వరకు అలర్ట్..
రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడనుండటంతో వాతావరణ శాఖ అలర్ట్ కావాలని సూచిస్తోంది. దీని ప్రభావంతో సోమవారం నాటికి వాయుగుండంగా మారి ఆ తర్వాత ఉత్తరదిశగా మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని  విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడించారు. ప్రస్తుత సమాచారం మేరకు ఈ తుఫాన్‌ బంగ్లాదేశ్‌, మయన్మార్‌ తీరాల దిశగా వెళ్లే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చని వెల్లడించారు. అల్పపీడనం ఏర్పడిన తదుపరి ఐఎండి సమాచారం మేరకు ఇతర వివరాలు తెలియజేస్తామన్నారు. అల్పపీడనం ఏర్పడనున్న కారణంగా జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఆదివారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, వేటకు వెళ్ళిన మత్స్యకారులు రేపటిలోగా తిరిగి రావాలని  కోరారు.
కంట్రోల్ రూం నెంబర్లు ఇవే...
అత్యవసర సహయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలని  విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల క్రింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు.
కర్ణాటక; తమిళనాడు మీదుగా ద్రోణి...
దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆనుకుని ఉన్న తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు  విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.ఈ మేరకు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వివరించారు.
రానున్న మూడు రోజుల వాతావరణ వివరాలు:
శనివారం:- 
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
ఆదివారం:- 
కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 
అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
సోమవారం :- 
చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.  విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని  విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ స్పష్టం చేశారు.

Published at : 05 May 2023 06:36 PM (IST) Tags: ap weather Heavy Rains In AP AP Rains Rains AP Weather News

సంబంధిత కథనాలు

ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ఏపీ మంత్రుల సమావేశం, కీలక అంశాలపై చర్చ

ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ఏపీ మంత్రుల సమావేశం, కీలక అంశాలపై చర్చ

Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!

Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్