AP News: పథకాలకు కేంద్రం లోగోలు, ప్రధాని మోదీ ఫొటోలు ఎందుకు లేవు - కేంద్ర మంత్రి సీరియస్
కేంద్ర పథకాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలు, కేంద్ర ప్రభుత్వ లోగోలు లేకపోవటం ఏంటని కేంద్ర సహయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ అధికారులను నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులపై కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ మరో సీరియస్ అయ్యారు. కేంద్ర పథకాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలు, కేంద్ర ప్రభుత్వ లోగోలు లేకపోవటం ఏంటని ఆమె అధికారులను నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర సహయ మంత్రి పర్యటన...
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన లోగోను ప్రదర్శించకపోవడంపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ లోగోనుగానీ, ప్రధాని మోదీ ఫొటోలను ప్రదర్శించకపోవడం ఏంటని ప్రశ్నించారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ నుంచి అధికారుల బృందం వచ్చి విచారణ చేస్తారు అని అదేవిధంగా షోకాస్ నోటీసు కూడా జారీ చేస్తామని హెచ్చరించారు. భవానీపురంలోని ఆయుష్మాన్ భారత్ హెల్త్ విల్ నెస్ సెంటర్ ని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ సందర్శించారు.
ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ ఏర్పాట్లు, సహా వివిధ అంశాలపై నోడల్ ఆఫీసర్ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ముఖద్వారం దగ్గర కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ లోగోను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోలు ఎందుకు లేవని ఆమె నిలదీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను వినియోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వము వాటికి సంబంధించిన వివరాలు లేకపోవడం పైచర్యలు తప్పకుండా ఉంటాం అన్నారు. ప్రతిచోట ఇదే విధానమైన వాకిలి దర్శనమిస్తున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ నుంచి అధికారుల బృందం వచ్చి విచారణ చేస్తారు అని అదేవిధంగా షోకాస్ నోటీసు కూడా జారీ చేస్తామన్నారు. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖ అధికారుల అధికారుల సమక్షంలోనే ఈ తంతు జరగటం విశేషం.
కేంద్ర మంత్రిని కలిసిన రాజధాని రైతులు...
కేంద్ర సహయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ను రాజధాని రైతులు కలిశారు. ఏపీ రాజధాని అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాలని రైతులు ఆమెకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర సంస్థలకు ఇచ్చిన భూముల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పవార్‌కు అమరావతి రైతులు వినతిప్రతం అందజేశారు. ఈ విషయంపై కేంద్రంలోని అదికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పరివార్ రాజదాని రైతులకు హామి ఇచ్చారు.
నరసింహుని సేవలో కేంద్ర మంత్రి పరివార్..
గుంటూరు జిల్లా మంగళగిరిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవర్ దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు, పాలకమండలి ప్రతినిధులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. మంగళగిరి పట్టణంలో బిజెపి పార్టీ ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆమె ముందుగా ఎగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ మంగళాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.