Nara Lokesh As Mechanic: చిన్నప్పుడే కారు తయారుచేశాను, అది ఇప్పటికీ మా ఇంట్లో ఉంది: లోకేష్
Nara Lokesh As Mechanic: మెకానిక్ లతో చిట్ చాట్ లో లోకేష్ ఓ ఆసక్తికర విషయం తెలిపారు. చిన్నప్పుడు తాను చిన్న కారు తయారు చేశానని చెప్పారు.
Nara Lokesh As Mechanic: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం 165వ రోజుకు చేరుకుంది. లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం బాపట్ల జిల్లాలో కొనసాగుతోంది. చీమకుర్తి మీదుగా సంతనూతనపాడులో లోకేష్ ఎంట్రీ ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు నేతలు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు.
మంగళవారం సాయంత్ర సంతనూతనపాడులో బైక్ మెకానిక్స్‌ను యువనేత లోకేష్ కలిశారు. ఈ సందర్భంగా వారితో చిట్‌చాట్ చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వారి సమస్యలు తీరుస్తానని భరోసా కల్పించారు. మెకానిక్ లతో చిట్ చాట్ లో లోకేష్ ఓ ఆసక్తికర విషయం తెలిపారు. చిన్నప్పుడు తాను చిన్న కారు తయారు చేశానని చెప్పారు. 1997- 1998 సమయంలో జూబ్లీహిల్స్ లో తనకు మెకానిక్ ఫ్రెండ్ ఉన్నారని చెప్పారు. బైక్ ఇంజిన్ సహాయంతో కారు తయారు చేసినట్లు తెలిపారు. ఇంటర్ పూర్తయ్యాక మూడు నాలుగు నెలల సమయం శ్రమించి కారు తయారు చేశానన్నారు.
మెకానిక్ ల సమస్యలు చర్చిస్తున్న సందర్భంగా, ఫ్రెండ్ సాయంతో తాను టీనేజ్ లో
— Telugu Desam Party (@JaiTDP) July 25, 2023
తయారు చేసిన కారు గురించి వివరించారు నారా లోకేష్. ఇటీవల మంగళగిరిలో బుల్లెట్ కూడా నడిపానని తెలిపారు.#YuvaGalamPadayatra #AndhraPradesh #YuvaGalamLokesh #YuvaGalam #LokeshPadayatra #NaraLokesh… pic.twitter.com/IhqkuQKgwX
కార్లు, బైక్ రిపేర్ గురించి, ఇంజిన్ ఎలా ఉంటుంది అని అప్పుడే తెలుసుకున్నానని చెప్పారు లోకేష్. ఇప్పటికీ ఆ కారు తన ఇంట్లోనే ఉందని ఆసక్తికర విషయాలు తెలిపారు. మా అబ్బాయి దేవాన్ష్ ఆ కారులో తిరగాలని తనకు చిన్న కోరిక ఉందన్నారు. ఇప్పుడు పోలీసులు చాలా కఠినంగా ఉన్నారని, గతంలో అలాంటి పరిస్థితి లేదని కొంచెం ఈజీగా ఉండేదన్నారు. ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే అప్పుట్లో కారులో తిరిగేవాళ్లమని, ఇప్పుడు చాలా కష్టమని చెప్పారు. మెకానిక్ ఫ్రెండ్స్ ఉండటంతో మీ సమస్యలు నాకు అప్పటినుంచే తెలుసునన్నారు. తాను బైక్ ఎక్కి చాలా రోజులైందని చెప్పారు లోకేష్. చివరిసారి అంటే టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు మంగళగిరిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో బుల్లెట్ బైక్ నడిపానని గుర్తు చేసుకున్నారు లోకేష్.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బైక్ మెకానిక్స్ ని గుర్తిస్తాం. బైక్ మెకానిక్స్ కి ప్రభుత్వ గుర్తింపు కార్డు లు అందజేస్తాం. వైద్య సాయం, చంద్రన్న భీమా బైక్ మెకానిక్స్ కి అమలు చేస్తాం. #YuvaGalamPadayatra #YuvaGalamLokesh #YuvaGalam #LokeshPadayatra #NaraLokesh… pic.twitter.com/oWiQksywzc
— Telugu Desam Party (@JaiTDP) July 25, 2023
మెకానిక్ లు 50 ఏళ్లు వచ్చేసరికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, తమకు ఏ విధంగా న్యాయం చేస్తారని, పింఛన్ ఇవ్వాలని నారా లోకేష్ ను మెకానిక్స్ అడిగారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ.. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బైక్ మెకానిక్స్ ని గుర్తిస్తాం అన్నారు. బైక్ మెకానిక్స్ కి ప్రభుత్వ గుర్తింపు కార్డు లు అందజేసి.. వైద్య సాయం, చంద్రన్న భీమా బైక్ మెకానిక్స్ కి అమలు చేస్తాం అని భరోసా కల్పించారు. గుర్తింపు కార్డు ద్వారా పనిముట్లు కూడా ఇప్పిస్తామన్నారు. కానీ చంద్రబాబు హయాంలో చంద్రన్న బీమా ఉండేదని, జగన్ సీఎం అయ్యాక దాన్ని తీసేసి వైఎస్సార్ బీమాగా మార్చారు. తాను అనారోగ్యం బారిన పడితే ప్రైవేట్ ఆస్పత్రి దగ్గరున్నా కూడా, నిమ్స్ కు పరిగెత్తేవాడనని, అక్కడే ట్రీట్మెంట్ తీసుకునేవాడ్నని చెప్పారు. జగన్ హయాంలో ప్రభుత్వ హాస్పిటల్స్ మరుగున పడుతున్నాయని, టీడీపీ అధికారంలోకి వచ్చాక గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial