Nara Lokesh Love Story: నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్, బ్రాహ్మణితో లవ్ స్టోరీపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Nara Lokesh About his Love Story with Brahmani: తన లవ్ స్టోరీపై నారా లోకేష్ స్పందించి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణితో తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని తెలిపారు.
Nara Lokesh About his Love Story with Brahmani:
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ముందుకుసాగుతున్నారు. ప్రస్తుతం తన సొంత నియోజకవర్గంలో మంగళగిరిలో బుధవారం లోకేష్ పర్యటించారు. తన లవ్ స్టోరీపై నారా లోకేష్ స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణితో తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని తెలిపారు. అయితే మావయ్య ముందు అంత సాహసం చేసేవాడ్ని కాదన్నారు.
మంగళగిరిలో విద్యార్థులు, యువతతో నిర్వహించిన ముఖాముఖిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ యువతి మాట్లాడుతూ.. బ్రాహ్మణితో పెళ్లి విషయంపై మెదటగా ప్రతిపాద ఎవరు తీసుకొచ్చారని అడిగింది. పెళ్లి ప్రస్తావన సమయంలో మీరు ఎలా స్పందించారని లోకేష్ ను ఓ యువతి అడిగారు. తన భార్య బ్రాహ్మణితో తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని తెలిపారు. కానీ ముద్దుల మామయ్య (నందమూరి బాలకృష్ణ) ముందు అంత సాహసం చేసేవాడ్ని కాదంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇంట్లో అమ్మానాన్నతో ఓ వెకేషన్ కు వెళ్తే మేం ఇలా అనుకుంటున్నాం.. అని అడిగితే నా అభిప్రాయం మీకు తెలిసిందే కదా. బ్రాహ్మణి కూడా ఒప్పుకుందని, ఆ తరువాత పెళ్లి జరగడం ఇవన్నీ మీకు తెలిసిందే కదా అన్నారు. లోకేష్ ఈ విషయాలు షేర్ చేసుకునేటప్పుడు యువత అరుపులతో ఆ ప్రాంగణమంతా మార్మోగిపోయింది.
లోకేష్ ఫస్ట్ క్రష్ ఎవరు.. జవాబు ఊహించి ఉండరు!
హలో లోకేష్ ప్రోగ్రామ్ లో మరో విద్యార్థిని మీ ఫస్ట్ క్రష్ ఎవరు? అని నారా లోకేష్ ను అడిగారు. అయితే స్కూలులో, కాలేజీలో చేయాల్సిన వెధవ పనులన్నీ చేశా అన్నారు. అందరిలాగే తనకు కూడా చాలా క్రష్ లు ఉన్నాయని చెప్పారు. కానీ ఆ పేర్లు చెబితే ఐదు రూపాయల పేటీఎం బ్యాచ్ లు ఈ విషయాలను అనవసరంగా ట్రోల్ చేస్తుందన్నారు. ఒక్క విషయం మాత్రం చెబుతానంటూ.. తనది కాలేజీ లైఫ్ అయితే జగన్ ది జైల్ లైఫ్ అంటూ లోకేష్ సెటైర్లు వేశారు. యువత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి, వారిలో ఒకడిగా కలిసిపోయి ఉత్సాహాన్ని నింపారు.
ఐటీ పరిశ్రమలు తీసుకొస్తామని యువతకు భరోసా..
చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తాయని, మొదటి వందరోజుల్లోనే విశాఖకు ఐటి పరిశ్రమలు తెస్తామని లోకేష్ పేర్కొన్నారు. 186వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా మంగళగిరి సమీపంలోని యర్రబాలెంలో నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమంలో పాల్గొని తమ భవిష్యత్తుపై యువత వ్యక్తంచేసిన సందేహాలకు సమాధానాలిచ్చారు. లోకేష్ మాట్లాడుతూ... రాష్ట్రానికి పరిశ్రమలు రాబట్టేందుకు తమ వద్ద చంద్రబాబు అనే బ్రాండ్ ఉందని, ఆ బ్రాండ్ తోనే గతంలో కియా, టిసిఎల్, ఫ్యాక్స్ కాన్, సెల్ కాన్ వంటి ప్రఖ్యాత పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రజారాజధాని అమరావతిని పూర్తిచేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో ఉద్యోగాల్లేక తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న యువత గళాన్ని సైకో ప్రభుత్వానికి విన్పించేందుకే యువగళం పాదయాత్ర ప్రారంభించానని అన్నారు. తప్పుచేయలేదు కాబట్టే ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్నా. గత నాలుగేళ్లుగా యూనివర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యాన్ని తొలగించి, విద్యాప్రమాణాల పెంపుదలకు కృషి చేస్తామని లోకేష్ అన్నారు