Camp Office Furniture Issue: ఆ కోళ్ల ఫారం కొంపలో నీతిమాలిన వ్యక్తి ఎవరో - క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్‌పై టీడీపీ సంచలన పోస్ట్
AP Latest News: అధికార టీడీపీ, ప్రత్యర్థి వైసీపీ మధ్య మాజీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ లో వాడిన ఫర్నిచర్ విషయంలో ట్వీట్ల వార్ కొనసాగుతోంది. తాజాగా టీడీపీ మరో పోస్ట్ చేసింది.
YS Jagan Latest News: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ సొమ్ముతో తన సొంత ఇంట్లో సకల సౌకర్యాలు కల్పించుకున్నారనే ఆరోపణల విషయంలో అధికార, ప్రత్యర్థి పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా పోస్టుల పర్వం కొనసాగుతోంది. జగన్ ఇంట్లో ఉన్న ప్రభుత్వ సొమ్ముతో చేయించిన ఫర్నీచర్ ను.. ఆయన పదవి కోల్పోయాక తిరిగి ప్రభుత్వానికి సరెండర్ చేయకుండా వాడుకుంటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అసలు ప్రజల డబ్బులతో ఇంటికి సౌకర్యాలు పొందడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
దీనిపై వైఎస్ఆర్ సీపీ వివరణ ఇచ్చింది. ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఓ లేఖ విడుదల చేశారు. ప్రభుత్వానికి చెందిన ప్రతి వస్తువుకు డబ్బులు కడతామని తెలిపారు. ప్రభుత్వ జీవోల ప్రకారం ఈ వస్తువులకు ఉన్న రేట్లను అనుసరించి ఖరీదు కట్టాలని అధికారులను జగన్ క్యాంప్ ఆఫీస్.. ప్రభుత్వ అధికారులను కోరారని తెలిపారు. ఆ ఫైలు ప్రక్రియలో ఉందని.. ఇంతలోనే ఎంపీలతో వైయస్ జగన్ సమావేశం ఫొటోలను పట్టుకుని టీడీపీ వికృత పోస్టింగులు పెడుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు.
నిస్సిగ్గుగా, నీతిమాలిన రాజకీయం చేస్తున్న @JaiTDP తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
— YSR Congress Party (@YSRCParty) June 15, 2024
మంచి సేవలు అందించే అవకాశాన్ని కూటమికి ప్రజలు అప్పగిస్తే, అధికారం చేపట్టాక వారి ప్రవర్తన, వ్యవహరిస్తున్న తీరు రోజురోజుకీ దిగజారుతోంది. వైయస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్… pic.twitter.com/yB0v4WkWYz
టీడీపీ కౌంటర్
దీనిపై తాజాగా టీడీపీ మరో కౌంటర్ ఇచ్చింది. ‘‘తప్పుడు ప్రచారాలు పుట్టేదే ఆ కోళ్ల ఫారం కొంపలో.. వ్యక్తిత్వం లేని నీతిమాలిన వ్యక్తి ఎవరో, సొంత తల్లి, సొంత చెల్లి చెప్పారులే కానీ, ముందు ఇంట్లో పెట్టుకున్న ఫర్నీచర్ ప్రభుత్వానికి ఇవ్వు. మరీ కక్కుర్తి కాకపోతే, నువ్వు ఇంట్లో పడుకునే మంచం, కూర్చునే కుర్చీ కూడా ప్రభుత్వ డబ్బుతో తీసుకోవాలా ? ఛీ ఛీ..’’ అని టీడీపీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
తప్పుడు ప్రచారాలు పుట్టేదే ఆ కోళ్ల ఫారం కొంపలో.. వ్యక్తిత్వం లేని నీతిమాలిన వ్యక్తి ఎవరో, సొంత తల్లి, సొంత చెల్లి చెప్పారులే కానీ, ముందు ఇంట్లో పెట్టుకున్న ఫర్నీచర్ ప్రభుత్వానికి ఇవ్వు. మరీ కక్కుర్తి కాకపోతే, నువ్వు ఇంట్లో పడుకునే మంచం, కూర్చునే కుర్చీ కూడా ప్రభుత్వ డబ్బుతో… https://t.co/N8txAZmcmw
— Telugu Desam Party (@JaiTDP) June 15, 2024