News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

చంద్రబాబు మంచితనమే కాపాడుతుంది, లోకేష్ కు రామక్రిష్ణ పరామర్శ- నేడు అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. చంద్రబాబు మంచి తనమే ఆయన్ని కాపాడుతుందన్నారు.

FOLLOW US: 
Share:

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. చంద్రబాబు మంచి తనమే ఆయన్ని కాపాడుతుందన్నారు. పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావుతో కలిసి లోకేష్ ను పరామర్శించారు రామక్రిష్ణ. చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. మనో ధైర్యంతో ఉండాలని లోకేష్ కు సూచించారు. రాష్ట్రంలో ఒక నియంత పాలన నడుస్తోంది...ప్రతిపక్షాలు, ప్రజలు నియంతతో పోరాటం చేస్తున్నారని తెలిపారు. జగన్ ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తరపున పోరాడుతున్న వారి గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు.  

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబునాయుడు ఏనాడు వీధి రాజకీయాలు  చేయలేదని గుర్తు చేశారు. ప్రజలు అన్నీ  గమనిస్తున్నారన్న ఆయన... వచ్చే ఎన్నికల్లో జగన్ కు గుణపాఠం చెప్తారని అన్నారు. రామకృష్ణ, నాగేశ్వరావు, సుబ్బారావుకు లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు పట్ల సీఐడీ వ్యవహరించిన తీరు దుర్మార్గమన్న రామక్రిష్ణ, ధైర్యాన్ని కోల్పోవద్దని, మనోధైర్యంతో ఉండాలని ధైర్యం లోకేష్ కు ధైర్యం చెప్పారు. చంద్రబాబు విషయంలో సీపీఐ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. విపక్ష నేతలపై పోలీసులు దుందుడుకు వైఖరిపై విజయవాడలో అఖిలపక్షాలు, ప్రజా సంఘాలతో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. 

Published at : 12 Sep 2023 08:13 AM (IST) Tags: Ramakrishna CPI lokesh . Lokesh Chandrababu Arrest

ఇవి కూడా చూడండి

ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Undavalli Arunkumar: స్కిల్‌ స్కామ్‌లో ఉండవల్లి పిల్‌ వేరే బెంచ్‌కు - ‘నాట్‌ బిఫోర్‌ మి’ అన్న న్యాయమూర్తి

Undavalli Arunkumar: స్కిల్‌ స్కామ్‌లో ఉండవల్లి పిల్‌ వేరే బెంచ్‌కు - ‘నాట్‌ బిఫోర్‌ మి’ అన్న న్యాయమూర్తి

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు

Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు

టాప్ స్టోరీస్

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత