Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Samineni Udayabhanu: తన రాజకీయ జీవితంలో తనతో పాటుగా కలిసి ప్రయాణం చేసిన వారిని జనసేనలోకి ఆహ్వానిస్తున్నానని సామినేని ఉదయభాను అన్నారు.
Samineni Udayabhanu: జగన్ విధానాలు నచ్చక పార్టీని వీడుతున్నట్లుగా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రకటించారు. ఈ మేరకు వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాక, తన రాజకీయ జీవితంలో తనతో పాటుగా కలిసి ప్రయాణం చేసిన వారిని జనసేనలోకి ఆహ్వానిస్తున్నానని అన్నారు. కాబట్టి, తనతో ప్రయాణం చేసే వాళ్ళని అందర్నీ జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. జనసేన పార్టీలో తాను చేరుతున్నానని.. పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కూటమికి తగ్గట్టు వివాదాలకు తావు లేకుండా నడుచుకుంటానని చెప్పారు. ఈనెల 22న జనసేనలో జాయిన్ అవుతున్నానని, రేపు పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉందని సామినేని ఉదయ భాను చెప్పారు.
సామినేని ఉదయభాను గతంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మూడు సార్లు గెలిచారు. రెండు సార్లు ప్రభుత్వ చీఫ్ విప్‌గా కూడా పని చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన సామినేని ఉదయభాను.. 1999, 2004 సమయంలో జగ్గయ్యపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009, 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. మళ్లీ 2019లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగి గెలిచారు.