![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sajjala Ramakrishna Reddy: స్కామ్‌లలో చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి చంద్రబాబు - సజ్జల
AP Latest News in Telugu: చంద్రబాబు అనే వ్యక్తి దోపిడీకి గుడిలో లింగాన్ని కూడా మింగేస్తారని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపణలు చేశారు.
![Sajjala Ramakrishna Reddy: స్కామ్‌లలో చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి చంద్రబాబు - సజ్జల Sajjala Ramakrishna Reddy slams on chandrababu over High Court verdict Sajjala Ramakrishna Reddy: స్కామ్‌లలో చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి చంద్రబాబు - సజ్జల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/6f149f2ace3e2f5d59eb7e6fd57310f31709904308833234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
YSRCP News: నిన్న తెలంగాణ హైకోర్ట్ చంద్రబాబు చేసిన మహా దోపిడీ గురించి తీర్పు వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. కేవలం నాలుగు రోజుల్లో అనేక నిర్ణయాలను దారుణంగా తీసుకున్నారని.. వాటిని రద్దు చేయాలనీ హైకోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి దోపిడీకి గుడిలో లింగాన్ని కూడా మింగేస్తారని ఆరోపణలు చేశారు. 2004 వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి మీద విచారణకు కమిటీ వేశారని సజ్జల గుర్తు చేశారు.
20 ఏళ్ల క్రితం కుంభకోణం - సజ్జల
స్పోర్ట్స్ ఆథారిటీ పేరుతొ 2003 లో ఒక కంపెనీ స్టార్ట్ అయిందని.. 2004 లో ఎంవోయూ జరిగిందని సజ్జల చెప్పారు. ‘‘20 ఏళ్ళ తర్వాత చంద్రబాబు చేసిన కుంభకోణంపై తెలంగాణ హైకోర్ట్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. 2004 ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో 400 ఎకరాలు ఎకరం 50 వేలకే సేల్ డీడ్ క్యాబినెట్ లో పెట్టకుండా చంద్రబాబు ఇచ్చారు. 400 ఎకరాలు విలువ అప్పట్లో రూ.వెయ్యి కోట్లు. ఇప్పుడు వాటి విలువ రూ.లక్ష కోట్లు దాకా ఉంటుంది. తల తోక లేని కంపెనీకి ఇచ్చి 20 ఏళ్ళ క్రితమే చంద్రబాబు స్కెచ్ వేసారు.
చరిత్రలో స్కామ్ లలో నిలిచిపోయే వ్యక్తి చంద్రబాబు. 2014 నుంచి 19 మధ్యలో అమరావతి స్టారప్ ఏరియాకి 1500 ఎకరాలు ధారాదత్తంగా ఇచ్చారు. సేమ్ 2003 లో చేసిన భూస్కామ్ లాంటిదే. హైదరాబాద్ లో రాష్ట్ర భూములు కాజేశాడు. 2014 నుంచి 19 మధ్యలో అమరావతి రైతుల భూములపై స్కామ్ చేస్తున్నాడు. కొట్టేసిన భూములను అమ్మడానికి రకరకాల క్రియేషన్ చంద్రబాబు చేస్తాడు. ఇది అమరావతి కాదు భ్రమరావతి. సిమెన్స్ పేరుతో 350 కోట్లు కుంభకోణం చేశాడు. అది కూడా బోగస్ కంపెనీ. బయట వ్యక్తులని తీసుకువచ్చి టీడీపీ ప్రభుత్వంలో పదవులు ఇచ్చాడు.
టీడీపీ ప్రభుత్వంలో ఆధారాలు లేని స్కామ్ లు చంద్రబాబు చాలా చేసాడు. చంద్రబాబు హయాంలో క్యాబినెట్ లో జరిగేది ఒకటి..బయటికి వచ్చే జీవోలు మరొకటి. పెద్ద కంపెనీల పేరు మీద హడావిడి చేసి స్కామ్ లు చేయడం చంద్రబాబుకి బాగా తెలుసు. ప్రజలు మర్చిపోతారని మళ్ళీ దోచుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడు. వైఎస్సార్ హయాంలో చంద్రబాబు చేసిన స్కామ్ లు జగన్ హయాంలో బయటికి వస్తున్నాయి.
2024లో ఏదో ఒక రకంగా అధికారంలో రావాలి అని చూస్తున్నాడు. అలా వస్తే చాప చుట్టినట్టు రాష్టాన్ని చుట్టేసి రాష్టాన్ని అమ్మేస్తాడు. అవసరం అయితే కేజీ బంగారం కారు కూడా ఇస్తా అని అబద్దపు హామీలు ఇస్తాడు. చంద్రబాబు ఎప్పుడు ఒక్కడే రాడు.. ఏదో ఒకటి కలుపుకొని వస్తాడు. ఈ సారి బీజేపీ కాంగ్రెస్ కూడా కలుపుకొని వస్తున్నాడు. చంద్రబాబు కనికట్టు మాటలను షర్మిల మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు చుసిన అవే మాటలు షర్మిల అంటున్నారు రాబోయే రోజుల్లో ఇంకా దిగజారుడు మాటలు కూడా వస్తాయి.
వైసీపీ నుండి పోయిన నాయకులకి టెక్కెట్ ఇవ్వడంపై చంద్రబాబు మాట్లాడాలి. చంద్రబాబు జనసేనకి అన్ని తక్కువ సీట్ల ఇవ్వడం మీద వాళ్ల పార్టీ వాళ్ళకే నచ్చడం లేదు. అలాగే బీజేపీ పార్టీ కూడా అనుకున్న అన్ని సీట్లు చంద్రబాబు ఇవ్వడు. మా పార్టీ ఎన్నికలకి సిద్ధంగా ఉంది,సీట్ల సర్దుబటు గొడవలు టీడీపీ, జనసేనలో ఉన్నాయి. మేము బలంగా ఉన్నాము కాబట్టి అన్ని పార్టీలు ఏకం అవుతున్నాయి అంటే వాళ్ళ బలహీనత అలా ఉంది. 50 శాతానికి పైగా ఓట్లు ప్రతి నియోజకవర్గంలో మా పార్టీకి ఉంది. ఒక జీరో పక్కన ఇంకో జీరో వచ్చినా దానికి విలువ లేదు’’ అని సజ్జల రామక్రిష్ణా రెడ్డి అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)