News
News
వీడియోలు ఆటలు
X

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలతో పొత్తులు పక్కా, మళ్లీ ఓడిపోడానికి రెడీగా లేను - అది తర్వాత సంగతి: పవన్ కల్యాణ్

జనసేన పార్టీ మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగించారు.

FOLLOW US: 
Share:

జనసేన పార్టీ త్రిముఖ పోటీలో బలి కావడానికి సిద్ధంగా లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇంకోసారి తాను ఓడిపోవడానికి కూడా రెడీగా లేనని అన్నారు. కచ్చితంగా పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. అంతా గౌరవంగా ఉండి, అన్ని పద్ధతులు బావుంటే కచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అవుతామా లేదా అనేది ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చాక సంగతి అని అన్నారు. అంత బలమైన మెజారిటీ ఇచ్చి, మనం పోటీ చేసిన స్థానాల్లో అత్యధిక ఓట్లు వస్తే మనం మాట్లాడేందుకు హక్కు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ప్రత్యర్థిని దించడమే తన ప్రైమరీ టార్గెట్ అని అన్నారు. జనసేన పార్టీ మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగించారు.

పొత్తు పెట్టుకోవడం అనేది పార్టీ ఎదుగుదలకు తోడ్పడుతుందని, దాన్ని తక్కువ అంచనా వేయవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాను ఎమ్మెల్యేలను ఇవ్వలేనప్పుడు సీఎం పదవి అడగలేనని అన్నారు. పొత్తులో ముఖ్యమంత్రి పదవి అనేది ఫలితాల తర్వాత బలాబలాలు, సమీక్షలు చేసి అప్పుడు నిర్ణయించేదని అన్నారు. ప్రస్తుతం ముందున్న లక్ష్యం వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి, కూటమిని గద్దె ఎక్కించడం అని చెప్పారు. 

జూన్ నుంచి తిరుగుతా

డిసెంబరులో ఎన్నికలు వస్తాయని, ఇకపై తాను జూన్ నుంచి పూర్తిగా ఎన్నికలు లక్ష్యంగానే తిరుగుతానని చెప్పారు. పవన్ కల్యాణ్ సీఎం కావాలని కలల్లో ఉండొద్దని కోరారు. గాల్లో మేడలు కట్టవద్దని చెప్పారు. జనసేన ప్రభుత్వం ఏర్పడాలని తాను కలలు కన్నానని, అందరికీ ఒక అవకాశం ఇచ్చానని అన్నారు. తనను చంద్రబాబు నాయుడు మోసం చేస్తారని అంటున్నారని, ఏ వ్యూహాలు లేకుండా ఇంత దూరం వచ్చేస్తామా అని అన్నారు. కాపులను వైఎస్ఆర్ సీపీ నాయకులు తిట్టినప్పుడు కాపులు వారికి ఎందుకు ఓట్లు వేశారని ప్రశ్నించారు. ఏపీకి ఇప్పుడు కావాల్సింది మంచి నాయకులు కాదని, ప్రజల్లోనే పరివర్తన రావాలని పిలుపు ఇచ్చారు.

" సర్వస్వం వదులుకున్నా. అవసరం లేదు నాకు, వీళ్లు నడక రాని నా బిడ్డల్ని కూడా తిడతారు. ఇవన్నీ ఎందుకు పడాలి నేను. షూటింగ్ చేసుకుంటే రోజుకు రెండు మూడు కోట్లు సంపాదన నాది. అయినా ఈ రంగంలోకి ఎందుకొచ్చాను.. సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభ్ భాయ్, గాంధీజీ, పొట్టి శ్రీరాములు లాంటివారిని చూసి వచ్చాను. ఏపీలో మారాల్సింది నాయకులు కాదు.. ప్రజల్లో పరివర్తన రావాలి. "
-పవన్ కల్యాణ్

వైఎస్ఆర్ సీపీనే ప్రత్యర్థి

‘‘రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వ్యక్తి అధికారంలో ఉంటే అతణ్ని తీసేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. అతను అడ్డగోలుగా సంపాదించి ఆ డబ్బులతో గూండాలను, అధికారులను కొనేసిన వ్యక్తి. ఇంకోసారి అతను సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ జీవితంలో కోలుకోలేదు. ఇతను హెలికాప్టర్‌లో వెళ్తుంటే పచ్చని చెట్లను కొట్టించే వ్యక్తి. ఏ కులానికి మంచి చేశాడో చెప్పండి? నాకు ఏ వ్యక్తి మీదా, ఏ పార్టీ మీదా ద్వేషం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ సీపీపైన కూడా లేదు. ఆ ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేస్తుంది కాబట్టి, ప్రత్యర్థి వైఎస్ఆర్ సీపీనే. అందుకే మా ముందున్న కర్తవ్యం వైఎస్ఆర్ సీపీని దింపేయడమే’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

" ముఖ్యమంత్రి పదవి నాకు రావాలంటే మీరు నాకు సముచిత స్థానం ఇవ్వాలి. అప్పుడే సీఎం పదవి గురించి మాట్లాడండి. భావోద్వేగాలతో రాజకీయం చేయొద్దు. ఆలోచనతోనే రాజకీయం చేయాలి. నేను పొత్తుకు రెడీ అనేది ప్రకటించాను తప్ప, విధివిధానాలు ఇంకా చర్చించుకోలేదు. మా పార్టీలు ఏం మాట్లాడుకున్నా, ప్రజల మధ్యలోనే మీడియా ముందు అన్నీ ప్రకటిస్తాం. మీరు ప్రతిమాటకు ఊగిపోవద్దు. "
-పవన్ కల్యాణ్

Published at : 12 May 2023 05:05 PM (IST) Tags: YSRCP Janasena Pawan kalyan mangalagiri Pawan kalyan comments

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: సైకిల్ ఎక్కబోతున్న ఆ ముగ్గురు, సరూర్‌నగర్‌ హత్య కేసులో సాయికృష్ణ హాంగామా

Top 10 Headlines Today: సైకిల్ ఎక్కబోతున్న ఆ ముగ్గురు, సరూర్‌నగర్‌ హత్య కేసులో సాయికృష్ణ హాంగామా

జగన్‌ను చూసి నేర్చుకో- చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు

జగన్‌ను చూసి నేర్చుకో- చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు

Top 10 Headlines Today: లోకేష్‌కు గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పేందుకు నెల్లూరు లీడర్లు రెడీ, తెలంగాణలో నేడు సుపరిపాలన వేడుక

Top 10 Headlines Today: లోకేష్‌కు గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పేందుకు నెల్లూరు లీడర్లు రెడీ, తెలంగాణలో నేడు సుపరిపాలన వేడుక

Top 10 Headlines Today: మంత్రులపై బాబు పంచ్‌లు, జగన్‌పై పేర్ని నాని ప్రశంసలు- సింగరేణిపై కేసీఆర్ కీలక ప్రకటన

Top 10 Headlines Today: మంత్రులపై బాబు పంచ్‌లు, జగన్‌పై పేర్ని నాని ప్రశంసలు- సింగరేణిపై కేసీఆర్ కీలక ప్రకటన

Perni Nani: ఆ విషయంలో జగన్ సక్సెస్ అయ్యారు - పొగడ్తలతో ముంచెత్తిన పేర్ని నాని

Perni Nani: ఆ విషయంలో జగన్ సక్సెస్ అయ్యారు - పొగడ్తలతో ముంచెత్తిన పేర్ని నాని

టాప్ స్టోరీస్

Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Telangana News :  కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Tirupati News : శ్రీవారి సేవలో బీజేపీ అగ్రనేతలు - కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

Tirupati News :  శ్రీవారి  సేవలో బీజేపీ అగ్రనేతలు -  కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

Pawan Kalyan At Varun Tej Lavanya : అబ్బాయ్ ఎంగేజ్‌మెంట్‌లో బాబాయ్ పవర్‌ఫుల్ ఎంట్రీ - పవన్, చరణ్ ఫోటోలు చూశారా?

Pawan Kalyan At Varun Tej Lavanya : అబ్బాయ్ ఎంగేజ్‌మెంట్‌లో బాబాయ్ పవర్‌ఫుల్ ఎంట్రీ - పవన్, చరణ్ ఫోటోలు చూశారా?