Palnadu News: పల్నాడులో మళ్లీ ఉద్రిక్తతలు! మాజీ ఎమ్మెల్యేపై దాడులు, కారు అద్దాలు ధ్వంసం!
AP News: కర్రలతో టీడీపీ నేతలు వైఎస్ఆర్ సీపీ నేతల కార్లపై దాడికి దిగిన ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. ఆ దాడుల్లో ఓ కారు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి.
TDP Vs YSRCP: పల్నాడు జిల్లాలో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల వేళ ఈ జిల్లా ఎంత సమస్యాత్మకంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. తాజాగా టీడీపీ - వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలపై టీడీపీ శ్రేణులు దాడికి దిగినట్లుగా చెబుతున్నారు. కర్రలతో వైఎస్ఆర్ సీపీ నేతల కార్లపై దాడికి దిగారు. ఆ దాడుల్లో ఓ కారు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. 14వ మైలు దగ్గర ఈ ఘటన జరిగింది. ముంపు గ్రామాల పరిశీలనకు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు బయల్దేరగా.. టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు తెలిసింది.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన గుంటూరుకు వెళ్లిపోవాల్సి వచ్చింది. కాగా టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరద ముంపు గ్రామాల పరిశీలనకు వెళ్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావును టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతోనే ఈ ఘర్షణ చెలరేగినట్లుగా చెబుతున్నారు.
పల్నాడులో వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేపై దాడికి @JaiTDP గూండాలు కుట్ర
— YSR Congress Party (@YSRCParty) September 10, 2024
భారీ వర్షాలతో పెదకూరపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి.. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు
శంకర్రావు కోసం వేచి ఉన్న వైయస్… pic.twitter.com/QyT3uF2XPk
పల్నాడు జిల్లాలోనే ఇటీవల వినుకొండ చెక్‌పోస్టు సమీపంలో ఓ దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఓ యువకుడు మరో యువకుడిని దారుణంగా నరికగా.. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. వినుకొండ వైసీపీ యువజన విభాగ నాయకుడు రషీద్‌పై షేక్ జిలానీ అనే యువకుడు కత్తితో దారుణంగా దాడి చేసి హతమార్చాడు. రషీద్ రెండు చేతులు తెగిపోగా.. ఒళ్లంతా తీవ్ర గాయాలై రక్తపుమడుగులో కూలిపోయి రషీద్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన అధికార విపక్షాల మధ్య తీవ్రమైన వాగ్యుద్ధానికి దారి తీసిన సంగతి తెలిసిందే.