Nara Lokesh Letter: నా రక్తం మరిగిపోతోంది, నాన్నలాగ నేనూ పోరాటయోధుడ్ని: ఏపీ ప్రజలకు లోకేష్ లేఖ
Nara Lokesh writes letter to ap people : తల్లితండ్రుల వివాహ వార్షికోత్సం సైతం కావడంతో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు విధించడంపై నారా లోకేష్ భావోద్వేగానికి లోనయ్యారు. ఏపీ ప్రజలకు ఓ లేఖ రాశారు.
Nara Lokesh writes letter to ap people :
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఊహించని విధంగా ఏసీబీ కోర్టులో తీర్పు వచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రెండు వారాల పాటు (సెప్టెంబర్ 22 వరకు) జ్యుడీషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. టీడీపీ శ్రేణులు ఈ తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారు. నేడు తన తల్లితండ్రుల వివాహ వార్షికోత్సం సైతం కావడంతో.. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై నారా లోకేష్ భావోద్వేగానికి లోనయ్యారు. ఏపీ ప్రజలకు ఓ లేఖ రాశారు.
లోకేష్ ఏం ప్రస్తావించారంటే..
‘బాధతో బరువెక్కిన హృదయంతో, కన్నీళ్లతో తడిసిన కళ్లతో ఏపీ ప్రజలకు ఇలా రాస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న ఎంతగానో పాటుపడ్డారు. లక్షలాది మంది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నా.. ఏరోజు కూడా మీకు విశ్రాంతి అంటే తెలియదు. ఆయన రాజకీయాలు ఎల్లప్పుడూ గౌరవం, నిజాయితీతో ఉంటాయి. ఆయన సేవల్ని అందుకుని ప్రేరణ పొందిన వారిని చూస్తూ పెరిగాను. సాయం అందుకున్న వారి హృదయపూర్వక కృతజ్ఞతలతో మీ మనసు ఆనందంతో నిండిపోయింది.
నేను కూడా నాన్న గొప్ప మార్గం, విధానాల నుంచి ప్రేరణ పొందాను. అదే విధంగా అమెరికాలో విలాసవంతమైన ఉద్యోగాన్ని వదిలి మీ అడుగుజాడల్లో నడిచేందుకు వదిలి భారతదేశానికి తిరిగి వచ్చాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం, కానీ మన దేశం, రాజ్యాంగం, విధానాలు, సూత్రాలపై చాలా నమ్మకం ఉంది.
కానీ నేడు మా నాన్న తాను చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్‌కు వెళ్లడం చూస్తుంటే, నా కోపం వస్తోంది. నా రక్తం మరిగిపోతోంది. రాజకీయ పగను తీర్చుకునేందుకు ఏ హద్దులు, లోతులు లేవా? రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఎంతో చేసిన మా నాన్న లాంటి వ్యక్తి ఇంత అన్యాయాన్ని ఎందుకు భరించాలి?. రాజకీయ పగ, విధ్వేష రాజకీయాలకు దిగకపోవడమే ఆయన చేసిన తప్పిదమా. మీరు ప్రజల అభివృద్ధి, సంక్షేమం, ఎదిగేందుకు అవకాశాలపై ఆలోచినందుకు ఇలా జరిగిందా?
I write to you today with a heart heavy with pain and eyes moistened with tears. I've grown up watching my father pour his heart and soul into the betterment of Andhra Pradesh and the Telugu people. He never knew a day of rest, tirelessly striving to transform millions of lives.… pic.twitter.com/dF5cBYgsvG
— Lokesh Nara (@naralokesh) September 10, 2023
నేటి పరిస్థితిని చూస్తే ద్రోహంగా కనిపిస్తుంది. కానీ మా నాన్న పోరాటయోధుడు, నేనూ కూడా అంతే. ఆంధ్రప్రదేశ్, తెలుగు ప్రజల కోసం కోసం తిరుగులేని దృఢ సంకల్పంతో పోరాడుతా. ఆ పోరాటంలో మీరు నాతో చేతులు కలపండి’ అంటూ తండ్రి చంద్రబాబు పరిస్థితిపై ఏపీ ప్రజలకు నారా లోకేష్ ఈ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.