అన్వేషించండి

AP Elections 2024: ఓట్ల లెక్కింపుపై సీఈవో ముఖేష్ మీనా రివ్యూ, సత్వర ఫలితాల వెల్లడికి కీలక సూచనలు

Telugu Latest News: ఏపీ సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో మే 23న ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు.

Mukesh Kumar Meena Review: ఏపీలో వచ్చే నెల 4న జరగనున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ కచ్చితమైన ఫలితాలను త్వరగా ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికా బద్ధంగా చేసుకోవాలని సూచించారు. ఏపీ సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో గురువారం (మే 23) ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. 

ఈ సందర్బంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ చెదురుమదురు సంఘటనలు తప్ప అందరి సమష్ఠి కృషితో ఈ నెల 13 న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. అదే స్పూర్తితో  వచ్చే నెల 4న జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేసుకుని విజయవంతంగా నిర్వహించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆయన కోరారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలని అన్నారు. ఓట్ల లెక్కింపులో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా సంబంధిత వివరాలను అంటే ఏ రోజున, ఎన్ని గంటలకు, ఎన్ని టేబుళ్లపై ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరుగుతున్నది అనే వివరాలను రాతపూర్వకంగా సంబంధిత అభ్యర్థులకు, ఎన్నికల ఏజంట్లకు ముందుగానే తెలియజేయాలన్నారు. పాత్రికేయులకు ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. 

స్ర్టాంగ్‌ రూమ్‌ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్‌ యంత్రాలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి బారికేడ్లతో పాటు సూచికల బోర్డ్ లను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. లెక్కింపు కేంద్రంలో  పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజక వర్గాలకు వేరు వేరుగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లును ఏర్పాటు చేయాలన్నారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు చేపట్టాలని, ఆ తదుపరే ఈవీఎంల వారీగా పోల్ అయిన ఓట్లను లెక్కించాలన్నారు. 

ఓట్ల లెక్కింపుకు సుశిక్షితులైన సిబ్బందిని నియమించుకోవాలని, వారికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ముందుగానే నిర్వహించాలన్నారు. అదే విధంగా హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్స్ ను  కౌటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్కోర్ లో ఎప్పటికప్పుడు డాటా ఎంట్రీకి సుశిక్షితులై సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని, కౌంటింగ్ అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్స్ డిపాజిట్ కు ప్రత్యేకంగా కౌంటర్లను  కూడా  ముందుగానే ఏర్పాటు చేసుకోవాలన్నారు. గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను, అనధికార వ్యక్తులను, ఇతరుల వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో  ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంగణాల్లోకి అనుమతికుంచకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలన్నారు. 

ఈవీఎంలను భద్రపర్చిన  స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన మూడు అంచెల భద్రత కొనసాగుతున్నదని, అయితే స్ర్టాంగ్‌ రూమ్‌లకు సీలు వేసిన తలుపులు, సెక్యూరిటీ కారిడార్లను కవర్‌ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరును నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తుండాలన్నారు.  భద్రత పర్యవేక్షణపై పోలీసు అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదనపు సీఈవోలు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ తో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు వారి జిల్లాల నుండి ఈ వీడియో కాన్పరెన్స్‌ లో పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
SearchGPT: గూగుల్, మైక్రోసాఫ్ట్ షేర్ ధరలు పడేసిన ఛాట్‌జీపీటీ - ఒక్క నిర్ణయంతో అల్లకల్లోలం!
గూగుల్, మైక్రోసాఫ్ట్ షేర్ ధరలు పడేసిన ఛాట్‌జీపీటీ - ఒక్క నిర్ణయంతో అల్లకల్లోలం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
SearchGPT: గూగుల్, మైక్రోసాఫ్ట్ షేర్ ధరలు పడేసిన ఛాట్‌జీపీటీ - ఒక్క నిర్ణయంతో అల్లకల్లోలం!
గూగుల్, మైక్రోసాఫ్ట్ షేర్ ధరలు పడేసిన ఛాట్‌జీపీటీ - ఒక్క నిర్ణయంతో అల్లకల్లోలం!
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Royal Enfield Records: అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మరో బైక్ లాంచ్‌కు రెడీ!
అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మరో బైక్ లాంచ్‌కు రెడీ!
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
AP TET Results 2024: అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
Embed widget