News
News
X

Ambati Rambabu: టీడీపీకి దమ్ముంటే పోలవరంపై చర్చకు రావాలి - అంబటి రాంబాబు

Minister Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిన్న ధూళిపాళ్ల సీఎంపై కామెంట్లు చేయగా.. నేడు మంత్రి అంబటి రాంబాబు చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. 

FOLLOW US: 

Minister Ambati Rambabu: పోల‌వ‌రంపై టీడీపీకి ద‌మ్ముంటే అసెంబ్లి సాక్షిగా చ‌ర్చ‌కు రావాల‌ంటూ మంత్రి అంబ‌టి రాంబాబు స‌వాల్ విసిరారు. 14 సంవ‌త్స‌రాల పాటు సీఎంగా ఉండి రాష్ట్రానికి చంద్ర‌బాబు ఏం చేశార‌ని నిల‌దీశారు. చంద్ర‌బాబు రాజ‌కీయ అక్కుప‌క్షి అంటూ అంబ‌టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స‌చివాల‌యంలో మంత్రి అంబ‌టి పోల‌వ‌రం ప్రాజెక్ట్ పై టీడీపీ చేస్తున్న ప్రచారాల‌ను ఉద్దేశించి మాట్లాడారు.

వైఎస్ఆర్ శంకుస్థాపన చేస్తే.. జగన్ పూర్తి చేశారు!

సీఎం జగన్ రెడ్డి చేతుల మీదుగా నెల్లూరు జిల్లాలో రెండు అతి కీలకమైన బ్యారేజీలను జాతికి అంకితం చేసినట్లు అంబటి రాంబాబు తెలిపారు. దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన ప్రాజెక్టులు అవి అని వివరించారు. పెన్నానది మీద రెండు బ్యారేజీలు కొత్తగా నిర్మించడం జరిగిందన్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్‌ కాలంలో బ్యారేజీల స్థానంలో ఆనకట్టలు మాత్రమే ఉండేవని... కాలానుగుణంగా ఆ ఆనకట్టల స్థానంలో పటిష్టమైన బ్యారేజీలు నిర్మించి మరింత భూమిని సాగులోకి తీసుకురావాలనేది ప్రజల చిరకాల కోరిక అని స్పష్టం చేశారు. చాలా ఏళ్లుగా ఆ చిరకాల కోరిక అలాగే మిగిలిపోయిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. సీఎం అయ్యాక వాటి మీద దృష్టి పెట్టి ఆ రెండు బ్యారేజీలకు శంకుస్థాపన చేశారని అంబటి రాంబాబు అన్నారు.

సంగం బ్యారేజీ 2006లోనూ, నెల్లూరు బ్యారేజీకు 2008లోనూ,  డాక్టర్ వైఎస్సార్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సుమారు 16 ఏళ్ల పాటు పనులు జరుగుతున్నాయని అంబరటి వివరించారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రెండు బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో, ఒకవైపు కొవిడ్, మరోవైపు వరదలు వచ్చినా యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించి వాటిని జాతికి అంకితం చేశారని చెప్పారు. ఇదే వాస్తవ పరిస్థితి అని చెప్పుకొచ్చారు.

బాబు రెక్కల కష్టం అని చెప్పడం ఏంటో?

రెండు బ్యారేజీలను సీఎం జగన్ ప్రారంభించిన తర్వాత.. అవి చంద్రబాబు రెక్కల కష్టంతో పూర్తి చేస్తే, జగన్‌గారు వెళ్లి రిబ్బన్‌ కట్ చేశారంటూ టీడీపీ నాయకులు కొంతమంది మాట్లాడారని అన్నారు. అబద్ధం చెప్పినా అతికేలా ఉండాలని, వాస్తవానికి దగ్గరగా ఉండాలంటూ అంబటి రాంబాబు కామెంట్లు చేశారు. అంతేకానీ పచ్చి అబద్దాలు, అవాస్తవాలను తమ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకోవడం ఏంటంటూ ప్రశ్నించారు. బ్యారేజీ పనులన్నీ చంద్రబాబు హయాంలో జరిగాయనడానికి, జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదనే మాటలు మాట్లాడే ముందు ఆలోచించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నానని... ప్రజలతో పాటు టీడీపీ నాయకులు కూడా వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రి అంబటి అన్నారు. మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ నిర్మాణానికి సవరించిన అంచనా ప్రకారం మొత్తం విలువ రూ.335.8 కోట్లు అని దానిలో రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలో ఉన్నప్పుడు రూ. 30.85 కోట్లు, టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ. 86.01 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. అదే వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రూ.131 కోట్లు ఖర్చు పెట్టారని స్పష్టం చేసారు. మరి ఇది ఎవరి రెక్కల కష్టం. దీనిని ఎవరు ప్రారంభించారన్నది తెలుసుకుంటే మంచిదన్నారు. 

చంద్రబాబు ఒక అక్కుపక్షి : అంబటి రాంబాబు

చంద్రబాబుకు అసలు ఏ రెక్కలున్నాయా, ఆయన కష్టపడటానికి అంటూ కామెంట్లు చేశారు. చంద్రబాబు రెక్కలు ఉన్న ఒక అక్కుపక్షి అంటూ ఆరోపించారు. నెల్లూరు బ్యారేజీకి సవరించిన అంచనాల ప్రకారం మొత్తం విలువ రూ.274.83 కోట్లు... రాష్ట్ర విభజనకు ముందు రూ. 86.62 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో, ఐదేళ్లలో రూ. 71.54 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, మూడేళ్ల కాలంలో రూ. 77.37 కోట్లు ఖర్చు పెట్టి బ్యారేజీని పూర్తి చేసి, ప్రారంభిస్తే ఇది ఎవరి రెక్కల కష్టం అంటారని అన్నారు. రాజకీయంగా ఎదిగేందుకు చంద్రబాబుకు ఎవరో ఒకరు రెక్కలు కావాలాని.. సీపీఎం, బీజీపే, పవన్ కల్యాణ్ రెక్కలు కావాలంటూ ఎద్దేవా చేశారు.  ఆయన రెక్కల కష్టంతో ఇవన్నీ జరిగాయని అభూత కల్పనలు, అసత్యాలు ప్రచారం చేసుకుని బతకాలనుకోవడం దురదృష్ట కరమ‌ని అంబ‌టి ద్వ‌జ‌మెత్తారు.

అసెంబ్లీలో చర్చిద్దాం, రా.. చంద్ర బాబూ!

పోలవరం ప్రాజెక్టు గురించి తాను అఢిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. సమాధఆనం చెప్పే వరకు మళ్లీ మళ్లీ టీడీపీని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. దమ్ముంటే, చేతనైతే.. అసెంబ్లీలో చర్చిద్దాం రా.. చంద్రబాబూ అని  అంబటి రాంబాబు స‌వాల్ విసిరారు. అయితే నిన్ననే వైసీపీ నేతలపై, సీఎం జగన్ పై ధూళిఫాళ్ల నరేంద్ర కుమార్ కామెంట్లు చేశారు. 

Published at : 08 Sep 2022 12:22 PM (IST) Tags: ambati rambabu polavaram project news AP Politics Minister Ambati Challenge YCP Worses TDP

సంబంధిత కథనాలు

KCR Bandhu Scheme Politics :

KCR Bandhu Scheme Politics : "బంధు" పథకాలు ఓట్ల పంట పండిస్తాయా ? మెజార్టీ వర్గాలను వ్యతిరేకం చేస్తున్నాయా ?

Ambati Rambabu: మళ్ళీ అంటాను, అది వొళ్ళుబలిసినోళ్ల పాదయాత్ర - అంబటి రాంబాబు

Ambati Rambabu: మళ్ళీ అంటాను, అది వొళ్ళుబలిసినోళ్ల పాదయాత్ర - అంబటి రాంబాబు

Rains In AP Telangana: మరో 4 రోజులపాటు అక్కడ కుండపోత, పిడుగులు పడే ఛాన్స్ - IMD ఎల్లో అలర్ట్

Rains In AP Telangana: మరో 4 రోజులపాటు అక్కడ కుండపోత, పిడుగులు పడే ఛాన్స్ - IMD ఎల్లో అలర్ట్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

జగన్ పచ్చి బ్రాందీ తయారు చేయిస్తున్నారు- అధికారులు, లీడర్లు వంద కోట్లు సంపాదించారు: సోము వీర్రాజు

జగన్ పచ్చి బ్రాందీ తయారు చేయిస్తున్నారు- అధికారులు, లీడర్లు వంద కోట్లు సంపాదించారు: సోము వీర్రాజు

టాప్ స్టోరీస్

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Anchor Sreemukhi: డాన్స్ ఐకాన్ కోసం ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయిన శ్రీముఖి

Anchor Sreemukhi:  డాన్స్ ఐకాన్ కోసం ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయిన శ్రీముఖి

Lottery : లక్కీ బర్త్ డే, పుట్టిన రోజు డేట్‌తో 200 లాటరీ టికెట్లు కొన్నాడు, ఏకంగా జాక్‌పాట్ కొట్టేశాడు!

Lottery : లక్కీ బర్త్ డే, పుట్టిన రోజు డేట్‌తో 200 లాటరీ టికెట్లు కొన్నాడు, ఏకంగా జాక్‌పాట్ కొట్టేశాడు!

Honor New Launch: కొత్త ట్యాబ్లెట్‌తో రానున్న హానర్ - భారీ డిస్‌ప్లే, బ్యాటరీతో!

Honor New Launch: కొత్త ట్యాబ్లెట్‌తో రానున్న హానర్ - భారీ డిస్‌ప్లే, బ్యాటరీతో!