Kodali Nani: ఆ మీడియా మా సభలకు రావొద్దు, వస్తే మావాళ్లు కీళ్లు విరిచేస్తారు - కొడాలి నాని సంచలనం
Kodali Nani Comments: గుడివాడలో వైసీపీ అభ్యర్థిగా మండలి హనుమంతరావును వైఎస్ జగన్ ఖరారు చేశారంటూ ఫ్లెక్సీలు వెలిసిన సంగతి తెలిసిందే. దీనిపై కొడాలి నాని స్పందించారు.
Kodali Nani Comments on Chandrababu: వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లైతే.. చెప్పేవాడు చంద్రబాబు అవుతారని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకూ అభ్యర్థుల్ని, ఇంఛార్జ్ లను ఏడు విడతల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. అభ్యర్థుల్ని మార్చేచోటే మార్పులు చేర్పులు చేస్తున్నారని అన్నారు. వైసీపీలో సీట్ల మార్పులు జగన్ మోహన్ రెడ్డి చేస్తారని.. చంద్రబాబు అనుకూల మీడియా కాదని అన్నారు. ఓ మీడియా సంస్థ యజమాని నరేంద్ర మోదీకి కూడా గుడివాడలో టిక్కెట్టివ్వగలడని కొడాలి నాని ఎగతాళి చేశారు. గుడివాడలో వైసీపీ అభ్యర్థిగా మండలి హనుమంతరావును వైఎస్ జగన్ ఖరారు చేశారంటూ ఫ్లెక్సీలు వెలిసిన సంగతి తెలిసిందే. దీనిపై కొడాలి నాని స్పందించారు.
‘‘నన్ను ఓడించాలంటే చంద్రబాబును తెచ్చి గుడివాడలో పోటీ చేయమనండి. గుడివాడలో నేను పోటీచేయాలో లేదో జగన్ మోహన్ రెడ్డి చెబుతారు. ఎల్లో మీడియా వారు పోటీచేస్తారని నేను కూడా ఫ్లెక్సీలు పెట్టిస్తా నిజమైపోతుందా? గన్నవరంలో వంశీని, గుడివాడలో నన్ను మారుస్తామని జగన్ మోహన్ రెడ్డి చెప్పారా? పక్కలేస్తే సీట్లివ్వడం, డబ్బులకు అమ్ముకోవడం వైసీపీలో ఉండదు. వంద కోట్లుంటే చంద్రబాబు టీడీపీలో టిక్కెట్లిస్తాడు. మా మైలవరం అభ్యర్ధికి ఎకరం పొలం తప్ప ఏమీ లేదు. వైసీపీలో ఒకడు ట్రై చేస్తేనో బ్రోకర్ గాడు చెబితేనే టిక్కెట్లు రావు. సామాజిక సమీకరణాల ప్రకారమే ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు.
చంద్రబాబుకు దమ్ముంటే.. మగాడైతే బీసీలకు ఎక్కువ సీట్లివ్వాలి. సీట్లు మారుస్తాడా లేదా..అనేది మాకు జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం. మధ్యలో తెలుగుదేశం బ్రోకర్లకు పనేంటి. జగన్ మోహన్ రెడ్డిని ఎదుక్కోలేక పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి. ఎందరు కలిసొచ్చినా జగన్ మోహన్ రెడ్డిని ఎదిరించలేరు. జగన్ సింగిల్ గా వస్తానని చెబుతున్నాడు. మీరెందుకు ఒకరి సంక మరొకరు ఎక్కుతున్నారు. చంద్రబాబు పర్మినెంట్ గా మాజీగానే ఉంటాడు. ఈ రాష్ట్రానికి పర్మినెంట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఆ ఫోటోగ్రాఫర్ కు అక్కడ పనేంటి?
పది లక్షల మంది జనం వచ్చిన చోట ఆంధ్రజ్యోతి పేపర్ ఫోటో గ్రాఫర్ కు పనేంటి? మేం ఆ పేపర్‌ను, టీవీని బ్యాన్ చేశాం. ఎవరు రమ్మన్నారు? ఇంకొన్ని మీడియా సంస్థల వారు కూడా మా సభలకు మీ లోగోలు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మా సభలకు వస్తే మా కార్యకర్తలు మీ కాలుకు కాలు.. కీలుకు కీలు పీకి అవతల పారేస్తారు’’ అని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.