ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి- త్వరలో సీఎంఓ లోకి శ్రీలక్ష్మీ
AP New CS: అనుకున్నట్టే అయింది. ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి రానున్నారు. అర్థరాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి.
![ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి- త్వరలో సీఎంఓ లోకి శ్రీలక్ష్మీ Jawahar Reddy as AP's new CS - senior IAS Officer Srilakshmi into CMO soon ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి- త్వరలో సీఎంఓ లోకి శ్రీలక్ష్మీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/28/1e679dbcaf9414f1ea87a1cb0770d00f1669598116835215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP New CS: తీవ్ర చర్చలు, సమాలోచనల తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈనెల 30తో ఇప్పుడు ఉన్న సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలం ముగుస్తుంది. ఆయన ప్లేస్‌లో జవహర్ రెడ్డిని నియమిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఆయన 30న బాధ్యతలు స్వీకరించునున్నారు.
ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా ఉన్న సమీర్ శర్మ ప్లేస్ ఎవర్ని తీసుకురావాలన్న డిస్కషన్ ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున జరుగింది. వచ్చేది ఎన్నికల సంవత్సరాలు కాబట్టి ఆ దిశగానే నియామకం ఉంటుందన్న టాక్ నడించింది. ఈ పదవికి చాలా మంది ఐఏఎస్‌లు పోటీ పడ్డారు. ఎంత మంది పోటీలో ఉన్నప్పటికీ సీఎంకి స్పెషల్ సెక్రెటరీగా ఉన్న జవహర్‌రెడ్డి వైపు జగన్ మొగ్గు చూపారు.
జవహర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 2024 జూన్ వరకు సర్వీస్‌లో ఉంటారు. అంటే ఏడాదిన్నర పాటు సేవలు అందించనున్నారు. కరెక్ట్‌గా ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత రిటైర్ అవుతారు. అందుకే ఆయన నియామకానికి సీఎం మొగ్గు చూపారని టాక్ వినిపిస్తోంది.
సీఎస్ పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డిపై ఎప్పటి నుంచో జగన్‌కు ప్రత్యేక ఇంట్రస్ట్ ఉందనే మాట వినిపిస్తోంది. ఆయన ఇప్పటి వరకు వివిధ జిల్లాల కలెక్టర్‌గా చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. ఆరోగ్య శాఖ కార్యదర్శిగా, టీటీడీ ఈవోగా సేవలు అందించారు. ఇప్పటి వరకు సీఎంకు స్పెషల్ సెక్రెటరీగా ఉన్నారు.
. సీనియర్లు చాలా మంది ఉన్నప్పటికీ జగన్ మాత్రం జవహర్‌నే సీఎస్‌గా నియమించారు. 1987వ బ్యాచ్ నీరభ్ కుమార్ ప్రసాద్, 1988 బ్యాచ్ కు చెందిన పూనం మాలకొండయ్య, 1989 బ్యాచ్ కు చెందిన కరికాల్ వలెవన్ సీఎస్ రేస్‌లోకి వచ్చారు. కానీ వివిధ కాారణాలతో వారిని పరిగణలోకి తీసుకోలేదని సమాచారం.
సీఎస్ గా పదవీ విరమణ అనంతరం సమీర్ శర్మను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ గా నియమించనున్నట్లు తెలిసింది. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్, ఎక్స్ లెన్స్ అండ్ గవర్నెన్స్ (ఐఎల్ఈ అండ్ జీ) వైస్ ఛైర్మన్ పోస్టులోనూ ఆయనను ఇంఛార్జీగా నియమించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఒక్క ఎల్వీ సుబ్రహ్మణ్యం తప్ప జగన్ ప్రభుత్వ హయాంలో పని చేసిన సీఎస్‌లందరూ రిటైర్‌మెంట్ తర్వాత ఏదో ఒక పదవిలో నియమితులయ్యారు.
ఇప్పటి వరకు నలుగురు ఐఏఎస్‌లు సీఎస్‌లుగా పని చేశారు. మొదట ఎల్వీ సుబ్రహ్మణ్యం తర్వాత నీలంసహ్నీ, అదిత్యనాథ్ దాస్, ఇప్పుడు సమీర్ శర్మ. అందరు కూడా సీఎంకు అత్యంత సన్నిహింతగా మెలిగారు. ఎల్వీ సుబ్రహ్మణానికి డిమాష్ వస్తే మిగతావాళ్లకు మాత్రం రిటైర్ అయిన తర్వాత వేర్వేరు శాఖల్లో పోస్టింగ్స్ ఇచ్చారు. నీలం సాహ్నిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గానూ, ఆదిత్య నాథ్ దాస్ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగాను నియమించారు.
అలానే ఇప్పుడు రిటైర్ కాబోతున్న సమీర్ శర్మకు కూడాా కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారని సమాచారం. ఆయన 2021 అక్టోబర్ 10వ తేదీన సీఎస్ గా ఛార్జ్ తీసుకున్నారు. ఆయన 2021 నవంబర్ 30వ తేదీన రిటైర్ కావాల్సి ఉన్నప్పటికీ రెండు సార్లు పొడగించారు. మొదట ఆరు నెలల పాటు పొడగించారు. రెండోసారి మరో ఆరు నెలలు పొడగించారు. అంటే ఏడాది పాటు ఆయన పొడిగింపును పొందారు. ఈ మధ్యకాలంలో సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ రివ్యూ మీటింగ్‌లోనే మాట్లాడుతూ కుప్పకూలిపోయారు. ఆయన గుండెకు ఆరేషన్ కూడా జరిగింది.
ఇప్పుడు సీఎంవోలోకి సీనియర్ అధికారి శ్రీలక్ష్మి తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఆమెను కూడా ఓ దశలో సీఎస్‌గా తీసుకోవాలన్న చర్చ వచ్చింది. కానీ అది వీలుపడలేదు. అందుకే ఇప్పుడు సీఎంవోలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలవడనున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)