Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !
#JanaVaaniJanaSenaBharosa: ఇతర పార్టీలకు భిన్నంగా పవన్ నూతన ఒరవడితో ప్రజల్లోకి వెళ్ళేందుకు "జనవాణి - జనసేన భరోసా’’ కార్యక్రమానికి పవన్ శ్రీకారం చుట్టగా సీఎం జగన్ పైనే తొలి ఫిర్యాదు అందింది.
#JanaVaaniJanaSenaBharosa: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన "జనవాణి - జనసేన భరోసా’’ కార్యక్రమానికి సామాన్య ప్రజానీకం నుంచి విశేష స్పందన లభించింది. ఇతర పార్టీలకు భిన్నంగా పవన్ నూతన ఒరవడితో ప్రజల్లోకి వెళ్ళేందుకు, ఈ కార్యక్రమాన్ని పవన్ తలపెట్టారు. విజయవాడలో ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రారంభించారు. బందరు రోడ్డులోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో పవన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు వర్గాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను పవన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు తరలి వచ్చారు. వీరిలో వికలాంగులతో పాటుగా, ఇతర ఆరోగ్య సమస్యలతో అవస్దలు పడుతున్న వారు కూడా ఉన్నారు. ఆర్దికంగా ఇబ్బందులు పడుతున్నవారు, ఉపాధి అవకాశాలు లేని వారు కూడా పవన్‌కు తమ మేర వినిపించేందుకు వచ్చారు.
తొలి సమస్య ఇదే...
ప్రధానంగా అధికార పార్టీకి చెందిన నాయకులు పెడుతున్న, ఇబ్బందులు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నష్టపోయిన బాధితులు పవన్ ను ఆశ్రయించారు. "జనవాణి - జనసేన భరోసా ప్రారంబించిన తరువాత పవన్ కళ్యాణ్‌కు తొలి సమస్య సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటిని కేంద్రంగా చేసుకొని రావటం విశేషం. సీఎం జగన్ నివాసం పరిసరాల్లో ఇళ్ల తొలగింపు వలన నష్టపోయిన బాధితులు పవన్‌ను కలిశారు. తాడేపల్లికి చెందిన మాజీ వాలంటీర్ ఇంటిని కూల్చేసి, ఒకరిని హత్యచేసి పోస్ట్ మార్టం కూడా నిర్వహించకుండా అధికారులు చేసిన దాడి గురించి బాధిత కుటుంబం ఫొటోలతో సహ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు వివరించారు.
మొదటి అర్జీ - తాడేపల్లికి చెందిన మాజీ వాలంటీర్ ఇళ్లు కూల్చేసి, ఆ ఇంటి బిడ్డని చంపేసి పోస్ట్ మార్టం కూడా నిర్వహించని వైనం.
— JanaSena Party (@JanaSenaParty) July 3, 2022
జనసేన దీనిని వ్యక్తిగతంగా తీసుకుంటుంది.. #JanaVaaniJanaSenaBharosa pic.twitter.com/EkTt5DuStG
ఎమ్మెల్యే 150 కోట్లు ఖర్చు చేస్తున్నారు...
కనిగిరి పిసి పల్లి మండలంలో ఫ్లోరైడ్ బాధితులు కూడా పవన్‌ను కలసి ఫిర్యాదు చేశారు. స్దానికులు కాళ్లు, చేతులు వంకర్లు పోయి జీవించటం దారుణమని పవన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రలోని ఉద్దానం తరువాత ఈ సమస్య తన దృష్టికి వచ్చిందన్నారు. డయాలిసిస్ పేషెంట్లకు కనీసం మందులు కొనలేని పరిస్దిలో ఉన్నారని పవన్ అన్నారు. మానవ హక్కులను కూడా ప్రభుత్వం పరిరక్షించటం లేదన్నారు. కనీసం కలుషితం లేని నీటిని ప్రభుత్వం ఇవ్వలేని స్దితిలో ఉందన్నారు. ప్రకాశం జిల్లాలో 150కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్యేగా గెలుస్తున్న పరిస్దితుల్లో ఫ్లోరైడ్ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని ఏపీ ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు.
తిరువూరు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య కారణంగా, కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న సరే ఎవరూ అపట్టించుకోవడం లేదంటూ @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకొచ్చిన భాదితులు. 1/4#JanaVaaniJanaSenaBharosa pic.twitter.com/bKDEVWZxuv
— JanaSena Shatagni (@JSPShatagniTeam) July 3, 2022
అధికారంలోకి రాకముందు సీఎం జగన్ పాదయాత్ర చేసి విద్యార్దులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు తమకు ఆర్థిక సహయం ఇవ్వటం లేదని విద్యార్దులు పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంలో పార్టీ ఇప్పటికే పోరాటం చేస్తుందని బాధితులకు అండగా ఉంటామని పవన్ హామి ఇచ్చారు. వసతి దీవెన కూడా తమకు అందటం లేదని విద్యార్దులు పలువురు పవన్ కు వినతి పత్రం అందించారు.
Also Read: Seediri Appalaraju: ఏపీ మంత్రి అప్పలరాజు రూటే సపరేటు - మీరు మారిపోయారు సార్ అంటున్న మద్దతుదారులు