By: ABP Desam | Updated at : 17 May 2023 09:22 AM (IST)
జగన్‌తో పాపం పసివాడు సినిమా తీయొచ్చు- కానీ చిన్న మార్పు చేయాలంటున్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉదయాన్నే పొలిటికల్ ర్యాగింగ్ మొదలు పెట్టారు. అప్పుడెప్పుడో వచ్చిన పాపం పసివాడు పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేసి ఇలాంటి సినిమా ఏపీ సీఎంతో తీయాలని కామెంట్ చేశారు. ఆయన కూడా చాలా అమాయకుడని చెప్పుకొచ్చారు. అయితే ఆ పిల్లాడి చేతిలో ఉన్నది ఒక్క సూట్ కేసు మాత్రమేనని... అక్రమంగా సంపాదన కోసం మనీలాండరింగ్ సులభతరం చేసే మల్టిపుల్ సూట్‌కేస్ కంపెనీలనుజగన్ చేతిలో ఉంచాలని సూచించారు.
ఇంకా ఏమన్నారంటే... డియర్ ఏపీ సీఎం, మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లేదా కామ్రేడ్ తరిమెల నాగి రెడ్డి కాదు. అక్రమ సంపాదనతో ప్రజలపై హింస సాగిస్తున్న మీరు క్లాష్‌వార్ అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా హక్కు లేదని కటువుగా చెప్పారు. ఏదో ఒక రోజు రాయలసీమ మీ నుంచి, మీ గుంపు బారి నుంచి విముక్తమవుతుందని ఆశిస్తున్నాను అంటూ ముగించారు.
I hope someone makes this film with our AP CM. He’s too innocent & naive. Only a small change is needed here: instead of ‘suitcase’ in his hand , put multiple ‘suitcase companies’ which facilitated money laundering for his ill-gotten wealth. Dear AP CM , You are not Comrade… pic.twitter.com/9zOImRapAd
— Pawan Kalyan (@PawanKalyan) May 17, 2023
కింద పీఎస్ అని మరో నోట్ పెట్టారు. పైన చెప్పిన స్టోరీకి రాజస్థాన్ ఎడారి ఇసుక దిబ్బలు కావాలని, కానీ వైసీపీ APలోని నదీ తీరాల నుంచి దోచుకుంది, కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయిని చెబుతూ చివర్లో చీర్స్ అంటూ క్లోజ్ చేశారు.
Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు
ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్
Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్
Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి
Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!