By: ABP Desam | Updated at : 14 Dec 2022 11:55 PM (IST)
కన్నా లక్ష్మీనారాయణ, నాదెండ్ల మనోహర్
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ రాష్ట్ర బీజేపీకి షాక్ తగలనుందా..? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ కొన్ని రోజులగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి రావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నాను నాదెండ్ల మనోహర్ జనసేనలోకి ఆహ్వానించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొంతకాలం నుంచి సోము వీర్రాజు నాయకత్వంపై కన్నా లక్ష్మీ నారాయణ అసంతృప్తిగా ఉన్నారని పార్టీ శ్రేణుల తీరుతో అర్థమవుతోంది. జనసేన రోడ్ మ్యాప్ విషయంలో సోము వీర్రాజు తీరును ఖండించారు. ఏపీలో పార్టీ వ్యవహారాలపై ఢిల్లీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం వైఫల్యం చెందిందని ఇటీవల కన్నా వ్యాఖ్యానించడం తెలసిందే. ఈ తరుణంలో ఇద్దరు నేతల భేటీపై రెండు పార్టీల్లోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
గత కొంతకాలం నుంచి తమ పార్టీపై అసంతృప్తితో ఉన్న బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణను జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్లతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గుంటూరులోని కన్నా ఇంటికి వెళ్లిన నాదెండ్ల దాదాపు 40 నిమిషాలకు పైగా భేటీ అయి పలు అంశాలు చర్చించుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, సమకాలీన అంశాలపై చర్చించుకున్నారు. తమ భేటీ తరువాత నాదెండ్ల మనోహర్ సైతం ఈ విషయాన్ని చెప్పారు. అయితే వీరి భేటీకి ముందు బీజేపీ, జనసేన నేతలు కొంత సమయం చర్చలు జరిపారు. కన్నా, నాదెండ్ల భేటీ విషయం బయటకు రాగానే, పార్టీ మారతారని బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడిపై జోరుగా ప్రచారం జరిగింది. చిన్న విషయం అయితే కన్నా అభిమానులు సైతం పెద్ద ఎత్తున ఆయన ఇంటికి ఎందుకు వచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీలతో పొత్తుల సమీకరణాలపై నడుస్తూనే పార్టీని బలోపేతం చేసుకునే దిశగా జనసేన అడుగులు వేస్తోంది.
నాదెండ్ల ఏమన్నారంటే..
కన్నాతో భేటీ అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేశారని అన్నారు. వైఎస్సార్ సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేస్తామన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు రావాలని ఆకాంక్షించారు. ఏమైనా అప్‌డేట్ ఉంటే త్వరలో చెబుతామన్నారు. జిల్లాల్లో ఇంకా ఏ నేతలైనా జనసేన కలవనుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు.
గత కొన్ని నెలల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతులను ఆదుకోవడం గురించి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు విడతల వారిగా జనసేన పార్టీ రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తోంది. ఇటీవల ఇప్పటం గ్రామస్తులకు అండగా నిలిచి కొన్ని కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున జనసేన అందించింది. తాజాగా కన్నాతో నాదెండ్ల భేటీ కావడంతో పార్టీ మారేందుకు ఆహ్వానించారని చర్చ జరుగుతోంది. అయితే ఈ పార్టీలు ఒకేగూటి పక్షులని అలాంటప్పుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి జనసేనలో చేరడం వల్ల ప్రయోజనం ఏంటనే దానిపై వైసీపీ నేతలు సైతం చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
Inter Exams: ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్, 21 నుంచి టెన్త్ పరీక్షలు - షెడ్యూలుపై త్వరలో స్పష్టత
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి
Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్ క్లోజ్
APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
/body>