News
News
X

HBD Nara Lokesh: నారా లోకేష్‌పై అంతులేని అభిమానం, యువనేతకు రైతు అదిరిపోయే గిఫ్ట్

Nara Lokesh Picture In Paddy Field: ఈ నెల 23వ తేదీన లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రంతో వరి పంట వేశారు అమరావతి ప్రాంతానికి చెందిన రైతు. లోకేష్ కు గిఫ్ట్ ఇస్తానన్నారు.

FOLLOW US: 
Share:

Nara Lokesh Picture In Paddy Field:  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ప్రేమతో అమరావతి ప్రాంత రైతు వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నెల 23వ తేదీన లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రంతో వరి పంట వేశారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెంకు చెందిన పులి మరియదాసు అలియాస్ చిన్నా రాజధాని ఉద్యమంలో క్రియాశీలకంగా ఉంటున్నారు. లోకేశ్ చేపట్టబోయే పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపాడు.

బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కూచిపూడి గ్రామ పరిధిలో ఎకరా పొలం కౌలుకు తీసుకున్నారు. అందులో 70 సెంట్లలో లోకేశ్ ముఖాకృతిలో వరి పండించారు. ఆదివారం పంటను కోసి ధాన్యాన్ని లోకేష్ కు పుట్టినరోజు కానుకగా ఇవ్వనున్నారు. లోకేశ్ చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలని తన పచ్చని పంట కాంక్షలు తెలియజేస్తున్నాని పులి చిన్నా వివరించారు. వినూత్న రీతిలో తన అబిమానాన్ని చాటుకున్న మరియదాసును టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రశంసలతో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా తమ అభిమాన నేత నారా లోకేష్ రూపంలో ఒక ఎకరంలో వరి పంటను పండించి ఆయన 40వ జన్మదినం సందర్భంగా వారికి బహుమతి అందిస్తున్నామని రైతు తన పొలంలో ఓ పోస్టర్ ఏర్పాటు చేశారు.

రైతు పులి చిన్నా ఏమన్నారంటే.. అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన వ్యక్తినని తెలిపారు. అమరావతి రైతు ఉద్యమంలో తాను క్రీయాశీలకంగా వ్యవహరించానని, ఆ సమయంలో తనపై దాడులు జరిగాయన్నారు. బాధితుల పక్షాన నిలుస్తూ లోకేష్ మాకు అండగా ఉంటామన్నారు. ఆయన ఇచ్చిన భరోసాతో తాను ధైర్యంగా ఉన్నానని చెప్పారు. తనపై దాడి జరిగిన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆసుపత్రికి వచ్చి పరామర్శించారని తెలిపారు. దేశానికి రైతు వెన్నెముక అని, నాలాంటి అన్నదాతకు అండగా నిలిచిన నారా లోకేష్‌కు పుట్టినరోజు కానుకగా ఒక ఎకరం పొలం ఆయన రూపాన్ని పొలి ఉండేలా వరిని పండించానన్నారు. ఇవి లోకేష్ కు పుట్టినరోజు కానుకగా అందిస్తామన్నారు. ఆయన చేపట్టనున్న పాదయాత్ర సజావుగా సాగాలని, లోకేష్ పచ్చగా ఉండాలని కోరుకుంటూ పండించిన ఈ ధాన్యాన్ని ఆయనకు అందజేస్తామని తెలిపారు.

లోకేష్ పాదయాత్రపై ఉత్కంఠ..
లోకేష్ పాదయాత్ర పై టీడీపీ నేతల్లో టెన్షన్ మెదలైంది. ఈనెల 27 నుంచి పాదయాత్రకు లోకేష్ రెడీ అవుతున్న తరుణంలో పోలీసులు అనుమతులు లభించలేదు .దీంతో ఆ పార్టి నేతలు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి రిమైండర్ పంపారు. యువగళం పాదయాత్ర కోసం అవసరం అయిన ముందస్తు అనుమతులు పై పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లభించలేదు. జనవరి 9వ తేదీన ఈ మెయిల్ ద్వారా, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లిఖిత పూర్వకంగా అనుమతులు కోసం లేఖ రాశారు. అంతే కాదు జనవరి పదో తేదీన లిఖిత పూర్వక లేఖ ను డీజీపీ కార్యాలయంలో కూడ సమర్పించారు. అయితే ఇందుకు సంబందించిన అనుమతులు పై టీడీపీ నేతలకు ఇంత వరకు ఎలాంటి రిప్లై రాలేదు. 

లోకేశ్ పాదయాత్రకు ఇంకా అనుమతి ఇవ్వకపోవటతోం మిగిలిన అంశాలపై కూడా ఆ పార్టీ నేతలు ఆలోచనలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర నిర్వహించేందుకు అవసరం అయిన అన్ని మార్గాలను  నేతలు అన్వేషిస్తున్నారు. ప్రభుత్వం అనుమతులు ఇవ్వని పక్షంలో తీసుకోవాల్సిన చర్యలు పై  చర్చిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారని గుర్తుచేస్తున్నారు.

Published at : 22 Jan 2023 08:54 PM (IST) Tags: Nara Lokesh farmer TDP Amaravati Lokesh Padayatra Happy Birthday Lokesh

సంబంధిత కథనాలు

విజయవాడలో గురువారం బుక్ ఫెస్టివల్ ప్రారంభం, 250 స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు

విజయవాడలో గురువారం బుక్ ఫెస్టివల్ ప్రారంభం, 250 స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు

Gudivada Politics : గుడివాడలో పోటీ చేస్తా - కొడాలి నానిని ఇంటికి పంపిస్తా !

Gudivada Politics : గుడివాడలో పోటీ చేస్తా - కొడాలి నానిని ఇంటికి పంపిస్తా !

VJA Durga Temple Politics : దేవాదాయ శాఖలో వెల్లంపల్లి జోక్యం చేసుకుంటున్నారా? వైఎస్ఆర్‌సీపీలో మరో వివాదం

VJA Durga Temple Politics : దేవాదాయ శాఖలో వెల్లంపల్లి జోక్యం చేసుకుంటున్నారా? వైఎస్ఆర్‌సీపీలో మరో వివాదం

AP Cabintet : ఏపీ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు - వాటన్నింటికీ గ్రీన్ సిగ్నల్

AP Cabintet :  ఏపీ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు - వాటన్నింటికీ గ్రీన్ సిగ్నల్

APFSL Recruitment: ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌‌లో ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు - పూర్తి వివరాలు ఇలా!

APFSL Recruitment: ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌‌లో ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు - పూర్తి వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్