Kodali Nani Comments: ముందు మీ కొంప కాలకుండా చూసుకోండి - కొడాలి నాని ఎద్దేవా
Kodali Nani: చంద్రబాబు రా.. కదలిరా అంటూ కదిలి వెళుతూ ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను తిడుతున్నారని కొడాలి నాని అన్నారు.
Kodali Nani Comments on Chandrababu: తాను తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబుకు మతిభ్రమించి.. తమ పార్టీలో జరుగుతున్న సీట్ల వ్యవహారంపై మాట్లాడుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. రా.. కదలిరా అంటూ కదిలి వెళుతున్న చంద్రబాబు ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను తిడుతున్నారని అన్నారు. 2019లో చంద్రబాబు పార్టీ తలుపులు పీకి హైదరాబాద్ పార్సిల్ చేశారని.. ఇప్పుడు ఆయన చేసేదేముంటుందని ఎద్దేవా చేశారు.
‘‘సీఎం జగన్ 175 ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించే దిశగా చర్యలు చేపట్టారు. పీకేసిన ఐదారుగురు మాత్రమే చంద్రబాబు తీసిన తలుపుల లోపలికి వెళుతున్నారు. రేపు టీడీపీ జనసేన సంకీర్ణంలో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటిస్తే, సీట్లు రాని అభ్యర్థులు ఆ పార్టీలనే తగల బెడతారు. ముందు తలుపులు తీసి పక్కవారిని ఆహ్వానించడం మాని, తమ పార్టీ కొంప కాలకుండా చూసుకోవాలి. 600 వాగ్దానాలు చేసి మోసం చేసిన చంద్రబాబు క్రెడిబిలిటీ లేని నాయకుడు. చంద్రబాబుకు ఈసారి ప్రతిపక్ష హోదా రావడం కూడా కష్టమే’’ అని కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు.