News
News
వీడియోలు ఆటలు
X

సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసిన అమరావతి రైతులు- 14న విచారించనున్న ధర్మాసనం

ఆర్‌-5 జోన్ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిన వేళ ఆర్‌-5 జోన్ వ్యవహారంపై అమరావతి రైతులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను ఈనెల 14న విచారణ చేపట్టనున్నట్టు ధర్మాసనం చెప్పింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతానిక చెందిన పేదలకైనా రాజధానిలోని 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేస్తూ ఆర్‌-5 జోన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 

పిటిషన్ కొట్టేసిన హైకోర్టు 
ఆమరావతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్-5 జోన్ చట్ట విరుద్దమంటూ అమరావతి రైతులు ముందుగా  హైకోర్టులో పిటిషన్ వేశారు. జోన్-5 ఏర్పాటుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. అమరావతి భూములు రాజధాని అవసరాలకు కాకుండా ఇతరులకు కేటాయించకూడదని గతంలో త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అందుకే స్టే ఇవ్వాలని రిక్వస్ట్ చేశారు.  మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం, సీఆర్‌డీఏకు నోటీసులు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులపై వాదనలు వినేందుకు ఈనెల 19కి కేసు విచారణను వాయిదా వేసింది.

రాజధాని వెలుపల ఉన్న పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 1134 ఎకరాలను కేటాయిస్తూ జారీ చేసింది. రాజధాని భూములను వేరే అవసరాలకు ఉపయోగించకూడదని గతంలో త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయాన్ని వాదనల్లో  పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు దేవదత్త కామత్, ఆంజనేయులు, ఉన్నం మురళిధర్ చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి వివరించారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని అక్కడికి వెళ్ల వచ్చుగా అని ధర్మాసనం సూచించింది. అదే సమయంలో ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటామని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే అభివృద్ది కార్యక్రమాలు అడ్డుకోవడం లేదని రాజధాని భూములు విషయంలో మాత్రమే తాము వాదనలు వినిపిస్తున్నామని న్యాయవాదులు చెప్పారు. 

రాజధాని భూములపై థర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం న్యాయసమ్మతం కాదని పిటిషనర్ తరపు న్యాయవాదులు తెలిపారు. ఈ క్రమంలో మధ్యంతర ఉత్తర్వులపై ఈనెల 19న విచారణ చేపడుతామని ఏపీ హైకోర్టు పేర్కొంది. రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సీఆర్డీఏ వైఖరిపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీకి వెళ్లే కరకట్ట పక్కన సీఆర్డిఏకు వ్యతిరేకంగా రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ పొలాలపై తమకే హక్కు లేకుండా చేస్తున్న సీఆర్డీఏ సంస్థ వైఖరిని ఖండిస్తున్నామని ఉండవల్లి రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ తీరును వ్యతిరేకిస్తూ ఉండవల్లి రైతులు ఆందోళనకు కూడా చేశారు. రహదారి విస్తీర్ణం పేరుతో పరిహారంతో సంబంధం లేకుండా మీ పొలాలని మేము తీసుకున్నాం అని సీఆర్డీఏ అధికారులు రైతులకి నోటీసులు ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

మీ పొలాలకు మీకు సంబంధం లేదంటూ నోటీసులు ఇవ్వటం దుర్మార్గమైన చర్య అని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. VRO రాణి ఇప్పటికే పలువురు రైతులకు ఫోన్లు చేసి మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి మీ కులం ఏమిటి అని పదే పదే ప్రశ్నిస్తున్నారని వాపోయారు. రహదారికి మేము వ్యతిరేకం కాదని, పరిహారం చెల్లిస్తే మేము ఎలాంటి అడ్డంకులు తెలపామని రైతులు మరోసారి స్పష్టం చేశారు. భూములను ప్రభుత్వం అమ్మాలంటే ఒక న్యాయం, రైతు దగ్గర తీసుకోవాలంటే మరో న్యాయమా అని ఉండవల్లి రైతులు ప్రశ్నిస్తున్నారు. 

Published at : 06 Apr 2023 11:58 AM (IST) Tags: Supreme Court AP High Court Amaravati CRDA Residential Plots in Amaravati R-5 Zone

సంబంధిత కథనాలు

AP News: సంచలనం - ఆస్తులను వెల్లడించిన ఏపీ సమాచార చీఫ్ కమిషనర్ మహబూబ్ బాషా

AP News: సంచలనం - ఆస్తులను వెల్లడించిన ఏపీ సమాచార చీఫ్ కమిషనర్ మహబూబ్ బాషా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

టాప్ స్టోరీస్

Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ

Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి