Amaravati Convention Centers: అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటు, ఉత్తర్వులు జారీ
Andhra pradesh News | ఏపీ రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Convention Centers In Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇనిచ్చింది. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు సంస్థలకు గతంలోనే 10 ఎకరాలు కేటాయించింది. వీటిల్లో జివి ఎస్టేట్స్, మాలక్ష్మి ఇన్ఫ్రా సంస్థ మందడంలో, ఓంశ్రీ భావనసాయి అసోసియేట్స్ తుళ్లూరులో, వరుణ్ హాస్పిటాలిటీ లింగాయపాలెంలో కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయి.
ఎవరికి, ఎక్కడ స్థలం కేటాయింపులు
జీవీ ఎస్టేట్స్‌కు మందడంలో సర్వే నెంబరు 195లో 1.60 సెంట్లు, 198లో 90 సెంట్లు పార్సిల్ నెంబరు ఒకటిలో ఇచ్చారు. మాలక్ష్మి ఇన్ఫ్రాకు సర్వే నెంబరు 223లో సెంటు, 236లో 2.49 సెంట్లు కేటాయించారు. ఓంశ్రీ భావనసాయి అసోసియేట్స్కు తుళ్లూరులో సర్వే నెంబరు 188లో సెంటు, 186లో 2.49 సెంట్లు పార్సిల్ నెంబరు మూడులో ఇచ్చారు. వరుణ్ నోవాటెల్కు లింగాయపాలెంలోని సర్వే నెంబరు 58లో 26 సెంట్లు, 156లో 1.84 సెంట్లు కేటాయించారు. ఈ నెల 8న జరిగిన సిఆర్డిఎ అథారిటీ 53వ సమావేశంలో 589 తీర్మానం కింద ఈ కేటాయించారు.
రాజ్‌భవన్ నిర్మాణానికి రూ.212 కోట్లు
ఏపీ ప్రభుత్వ రాజధాని కోర్ ఏరియాలో రాజ్ భవన్ నిర్మాణానికి రూ.212.22 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిఆర్డిఎ 53వ సమావేశంలో 593వ తీర్మానం కింద ఈ కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. ఇందులో గవర్నర్ మాన్షన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీసు, రెండు గెస్ట్ హౌస్లు నిర్మించనున్నారు. దీంతోపాటు అధికారుల, సీనియర్, జూనియర్ స్టాఫ్ కోసం భవనాలు నిర్మించనున్నారు. దీనికి వెంటనే టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు.






















