అన్వేషించండి

Andhra Pradesh News: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం - కాకినాడ సెజ్ భూములు రైతులకే రిజిస్ట్రేషన్

Kakinada SEZ lands: కాకినాడ సెజ్ భూముల్ని తిరిగి రైతులకే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రూపాయి కూడా తీసుకోకుండా వారికే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలు దారీ చేశారు.

AP government decides to return Kakinada SEZ lands to farmers:   ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం   కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) కోసం రైతులు ఇచ్చిన భూములను తిరిగి ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన 2,180 ఎకరాల భూములను తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసి అందించాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలు వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని 1,551 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
  
కాకినాడ SEZ 2000ల మధ్యలో ప్రారంభమైంది. అప్పటి ప్రభుత్వం రిలయన్స్, ఇతర కంపెనీలతో కలిసి SEZ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. దీని కోసం ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని రైతుల నుంచి 10,000 ఎకరాలకు పైగా భూములు సేకరించారు. కానీ ప్రాజెక్ట్ ముందుకు సాగకపోవడంతో, రైతులు తమ భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. 2021లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం 2,180 ఎకరాలు తిరిగి ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ, అమలు కాలేదు. రైతులు అనేకసార్లు ఆందోళనలు, ప్రదర్శనలు చేశారు. 2018లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తర్ఫున రైతులతో మాట్లాడి, భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.  

 
2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మేనిఫెస్టోలో కాకినాడ SEZ భూముల సమస్య పరిష్కారం ఒక ముఖ్య హామీ. పవన్ కల్యాణ్ ప్రచార సభల్లో "రైతులు ఇచ్చిన భూములు తిరిగి ఇవ్వాలి. SEZ అభివృద్ధి చేస్తాం, కానీ రైతులు బాధపడకూడదు" అని ప్రకటించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా, భూములను రిజిస్టర్ చేసి అందించాలని స్పష్టం చేశారు.
    
ఈ 2,180 ఎకరాలు ప్రధానంగా వ్యవసాయ భూములు. రైతులు తమ భూములు తిరిగి పొందడంతో వ్యవసాయం మళ్లీ ప్రారంభించవచ్చు. మొత్తం SEZ ప్రాజెక్ట్ 10,000 ఎకరాలు, కానీ ఈ భూములు తిరిగి ఇవ్వడంతో ప్రాజెక్ట్ పరిధి తగ్గుతుంది. ప్రభుత్వం మిగిలిన భూములతో SEZను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది.   రెవెన్యూ శాఖ అధికారులు త్వరలో రైతులతో సమావేశమై, భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. రైతులు తమ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు.   

టాప్ హెడ్ లైన్స్

Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. నిందితులకు 14 రోజుల రిమాండ్
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. నిందితులకు 14 రోజుల రిమాండ్
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget