News
News
వీడియోలు ఆటలు
X

అకాల వర్షాలతో జరిగిన పంటనష్టంపై సీఎం జగన్ సమీక్ష- రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోలుకు ఆదేశం

రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు సీఎం జగన్. పూర్తిస్థాయిలో జరగాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు అనంతర పరిస్థితులపై సీఎంఓ అధికారులతో సీఎం జగన్  సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. వర్షాల కారణంగా పంట నష్టం తదితర అంశాలపై ప్రాథమికంగా అందిన వివరాలను సీఎంకు వివరించారు. 

వివరాలు పరిశీలించిన జగన్... రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని ఆదేశించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాట రాకూడదన్నారు. వర్షాల వల్ల రైతులకు కలిగిన పంట సహా ఇతర నష్టాలకు గ్రామ సచివాలయాల స్థాయి నుంచే నిరంతరం వివరాలు తెప్పించుకోవాలని అధికారులకు సూచించారు. 

రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. ఇది పూర్తిస్థాయిలో జరగాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎన్యుమరేషన్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీకోసం పెట్టాలన్నారు సీఎం. ఎవరైనా మిగిలిపోయినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకు వచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. పంట నష్టపోయిన ఏ రైతుకు కూడా పరిహారం అందలేదనే మాట రాకూడదని పేర్కొన్నారు. 

రబీ సీజన్‌కు ధాన్యం కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని తెలిపారు సీఎం. పంట కొనుగోలు చేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదన్నారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు, ఫిర్యాదులు ఉంటే వాటిని చెప్పడానికి ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల ముఖంలో చిరునవ్వు కనిపించేలా అధికారులు చర్యలు ఉండాలని స్పష్టంచేశారు. 

Published at : 04 May 2023 12:41 PM (IST) Tags: ANDHRA PRADESH YSRCP CM Jagan Weather Update Unseasonal Rains

సంబంధిత కథనాలు

Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బండకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి

Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బండకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి

Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్

Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్

Top 10 Headlines Today: చెన్నై పాంచ్‌ పవర్‌, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ

Top 10 Headlines Today: చెన్నై పాంచ్‌ పవర్‌, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

టాప్ స్టోరీస్

AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

AP Cabinet Meeting :  ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

NBK 108 Movie Title : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ 'బ్రో' కాదు - బర్త్ డే గిఫ్ట్ రెడీ!

NBK 108 Movie Title : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ 'బ్రో' కాదు - బర్త్ డే గిఫ్ట్ రెడీ!

Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!

Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!