అన్వేషించండి

Andhra Pradesh: నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు, అభివృద్ధి ప్రణాళికలపై సీఎం దిశానిర్దేశం

Chandra Babu: చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదోపిడీ వెలికితీతపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

Chandra Babu: కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu)...ప్రభుత్వ ప్రాధాన్యాలు వివరించనున్నారు. ఇప్పటికే అధికారుల బదిలీలు పూర్తిస్థాయిలో చేపట్టిన సీఎం...రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను వారి ముందు ఉంచనున్నారు

నేడు కలెక్టర్ల సదస్సు
వైసీపీ(YCP) హయాంలో జరిగిన అక్రమాలు, సహజ వనరుల దోపిడీపై ప్రత్యేకంగా దృష్టిసారించిన కూటమి ప్రభుత్వం వాటిని వెలికితీసి చట్టపరంగానే వారిపై చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే నేడు కలెక్టర్ల సదస్సులోనూ నాటి ప్రభుత్వ హయాంలో జరిగిన భూదోపిడీపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, YSR, అన్నమయ్య, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగినట్లు గుర్తించారు. రెవెన్యూ సిబ్బంది ద్వారా వీటిల్లో జరిగిన అక్రమాలు బయటకు తీయాలని సీఎం చంద్రబాబు నేడు జరగనున్న కలెక్టర్ల సదస్సులో దిశానిర్దేశం చేయనున్నారు.  అలాగే వ్యవసాయ భూముల కన్వర్షన్ బాధ్యతలు సైతం కలెక్టర్లకు అప్పగించనున్నారు. అలాగే మదనపల్లె సబ్‌కలెక్టర్ దహానం కేసు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్లాలంటే ముందుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని అప్పుడే పెట్టుబడిదారులు పరుగులు తీస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, జాతీయ రహదారులు, రైల్వేప్రాజెక్టులు, పరిశ్రమలకు అవసరమైన భూసేకరణ త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్లకు నిర్దేశించనున్నారు.

గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. అక్కడి ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకు సమగ్ర సర్వే చేపట్టనుంది. ఆయా ప్రాంతాల్లో ఆధార్(Aadhar), రేషన్ కార్డు(Ration Card)లు,ఇల్లు, తాగునీటి వసతులు, రహదారులు సహా అన్ని అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ఈనెల 7 నుంచి 20 వరకు సర్వే నిర్వహించనున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది.

మహిళలకు చేయూత
మహిళా సంఘాలను ఆర్థికంగా ఆదుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ...డ్వాక్రాసంఘాలకు ఈ-సైకిళ్లు అందించాలని నిర్ణయించింది.ముందుగా కుప్పం నియోజకవర్గంలో 300 మంది మహిళలకు 45 వేలు విలువ చేసే సైకిల్‌ను 9వేలకే అందిస్తున్నారు. 

సాగునీటి ప్రాజెక్ట్‌లపై దృష్టి
సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం...భారీ ప్రాజెక్ట్‌లే గాక చిన్నతరహా ప్రాజెక్ట్‌లు, ఎత్తిపోతల మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్లకు సూచించనుంది. అలాగే ఏడున్నర లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు చేయాలని యోచిస్తోంది. డిజిటల్ విధానంలో పౌరసేవలు అందించేందుకు పీపీపీ విధానంలో ప్రత్యేక ప్రాజెక్ట్ తీసుకురానుంది. గత ఐదేళ్లలో పాడైపోయిన రహదారుల మరమ్మతులు సైతం వెంటనే చేపట్టాలని సీఎం కలెక్టర్‌ను ఆదేశించనున్నారు. రాజధాని ప్రాంతాలంలో ఇంకా సేకరించాల్సిన భూమిపైనా కలెక్టర్ల సదస్సులో చర్చించనున్నారు.

సచివాలయంలో సదస్సు
గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నివాసం వద్ద ఉన్న ప్రజావేదికలోనే కలెక్టర్ల సదస్సు జరిగేది. కానీ జగన్ వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతో ఇప్పుడు సచివాలయంలోనే కలెక్టర్లతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం పదిగంటలకు సదస్సు ప్రారంభం కానుంది. చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రసంగించనున్నారు. అనంతరం విజన్ ఆంధ్ర-2047పై ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం వివిధ శాఖలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం మరికొన్ని శాఖలపై చర్చిస్తారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhoodan Land Scam In Rangareddy: భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Meenu Song Promo : వెంకీ మామ బర్త్ డే స్పెషల్ 'మీనూ' సాంగ్ ప్రోమో వచ్చేసింది... స్వీట్ సర్ప్రైజ్​తో బర్త్ డే విషెస్
వెంకీ మామ బర్త్ డే స్పెషల్ 'మీనూ' సాంగ్ ప్రోమో వచ్చేసింది... స్వీట్ సర్ప్రైజ్​తో బర్త్ డే విషెస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhoodan Land Scam In Rangareddy: భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Meenu Song Promo : వెంకీ మామ బర్త్ డే స్పెషల్ 'మీనూ' సాంగ్ ప్రోమో వచ్చేసింది... స్వీట్ సర్ప్రైజ్​తో బర్త్ డే విషెస్
వెంకీ మామ బర్త్ డే స్పెషల్ 'మీనూ' సాంగ్ ప్రోమో వచ్చేసింది... స్వీట్ సర్ప్రైజ్​తో బర్త్ డే విషెస్
Bomb threats to RBI: ముంబైలోని ఆర్బీఐ ఆఫీస్‌కి బాంబు బెదిరింపు- జర్మనీ భాషలో ఈమెయిల్ చేసిన ఆగంతకులు
ముంబైలోని ఆర్బీఐ ఆఫీస్‌కి బాంబు బెదిరింపు- జర్మనీ భాషలో ఈమెయిల్ చేసిన ఆగంతకులు
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Telangana Crime News: నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
Embed widget