Chandrababu: సచివాలయం తాకట్టు ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ! - చంద్రబాబు
Chandrababu Naidu: ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
![Chandrababu: సచివాలయం తాకట్టు ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ! - చంద్రబాబు Chandrababu naidu slams YS Jagan mohan reddy over Secretariat collateral news Chandrababu: సచివాలయం తాకట్టు ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ! - చంద్రబాబు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/03/fe745dcd85c4a1fd1340cfe36510b51c1709444848524234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chandrababu Naidu on YS Jagan: ఏపీ సచివాలయం తాకట్టు పెట్టారంటూ వస్తున్న వార్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రూ. 370 కోట్ల కోసం సచివాలయాన్ని ఓ బ్యాంకుకు తాకట్టు పెట్టారని ఓ ప్రధాన పత్రికలో కథనం ప్రచురితం అయింది. దీనిపై చంద్రబాబు స్పందించారు. జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని అన్నారు. రాష్ట్ర సచివాలయం తాకట్టు పెట్టడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికి ఎంత అవమానకరం.. ఎంత బాధాకరం.. ఎంత సిగ్గు చేటు అని అన్నారు.
ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? అని ప్రశ్నించారు. రూ.370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు. నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని అన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
‘‘రాష్ట్రానికి ఎంత అవమానకరం...ఎంత బాధాకరం...ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ! ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా? నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు....తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. నువ్వు నాశనం చేసింది సమున్నతమైన ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్‌ని! ప్రజలారా...అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి!’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
రాష్ట్రానికి ఎంత అవమానకరం...ఎంత బాధాకరం...ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ! ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ… pic.twitter.com/tUNaoecZKR
— N Chandrababu Naidu (@ncbn) March 3, 2024
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)