అన్వేషించండి

Andhra Pradesh రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కట్టుబడి ఉంది: బీజేపీ ఎంపీలు

Union Budget 2024 | కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధులు ఇస్తామన్న ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేలిపోయిందని ఎంపీలు పురందేశ్వరి, సీఎం రమేష్ పేర్కొన్నారు.

Center funds to Amaravati in Budget 2024 | న్యూఢిల్లీ/అమరావతి: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 4 ప్రధాన రంగాలపై దృష్టి కేంద్రీకరించారని, పేదలు, యువత, మహిళలు, రైతులకు పెద్దపీట వేశామని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్డీఏ విధానాలు ప్రజలు మెచ్చి వరుసగా మూడోసారి అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ అనంతరం ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ.. తాజా కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు కేటాయించారు. మూడు రాజధానులు అని చెప్పి ఇప్పటికే అమరావతిని నిర్వీర్యం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇతర సంస్థల నుంచి వనరులను తీసుకొచ్చేలా గ్యారంటీ ఇస్తామని చెప్పింది. 

రాజధాని అమరావతి అభివృద్ధి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అని స్పష్టమవుతుంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కట్టుబడి ఉంది. ఏ రాష్ట్రం ఆర్థికంగా ముందుకెళ్లాలన్నా మౌలిక వసతులు కీలకంగా మారతాయి. గత ఐదేళ్లుగా రోడ్లను ఎలా విస్మరించారో ఏపీ ప్రజలకు తెలుసు. నేడు మౌలిక వసతుల కల్పన, పునర్నిర్మాణంపై ఫోకస్ చేశాం. కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్‌కు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాం. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్‌కు కేంద్రం పూర్తి సహాయం అందిస్తుంది. దాంతో రాయలసీమ అభివృద్ధి వేగవంతం కానుంది. 

రాయలసీమ జిల్లాలు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు

తూర్పు రాష్ట్రాల అభివృద్ధి కోసం పూర్వోదయ పేరుతో ప్రత్యేక దృష్టి పెట్టాం. వెనుకబడిన 7 పాత జిల్లాలతో పాటు కొత్తగా ప్రకాశం జిల్లాను అందులో చేర్చాం. రాయలసీమ జిల్లాలు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా కొత్తగా చేరింది. వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి ఇప్పుడు ఆక్సిజన్ దొరికిందని సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు వస్తాయి. గత రాష్ట్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ కోసం నీళ్లు నిలిచే భూమిని ప్రతిపాదించింది. తగిన స్థలం ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పింది. త్వరలో రైల్వే జోన్ విషయం పరిష్కారం అవుతుంది. వైసీపీ పాలనలో ఏపీకి ఎంత ఇచ్చినా ప్రజల వరకు అది చేరలేదు’ అని రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. 

ఏపీలో వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎలాంటి అరాచక పాలన జరిగిందో అందరూ చూశారని.. సొంత డ్రైవర్ ను చంపి ఇంటికి పార్శిల్ చేసిన ఘటనలు జరిగాయన్నారు. మాస్కులు, కరోనా కిట్లు అడిగిన డా. సుధాకర్ ఘటన జనం మర్చిపోలేదు, ఇతర పార్టీల నేతల నామినేషన్ పేపర్లను లాక్కున్న ఘటనలు చాలా ఉన్నాయని ఆరోపించారు. 

గత ఐదేళ్లలో ఏం జరిగిందో చూశారు 
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై స్పందించారు. ‘గతంలో ఎంపీలు అందరినీ గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి నిధులు తీసుకొస్తామన్నారు. గత ఐదేళ్లలో ఏం జరిగిందో అందరూ చూశారు. అందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ కాంబినేషన్‌కు 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో ఘన విజయం అందిచారు. రాజధాని అమరావతికి మిగిలిన 6 నెలల కాలానికే రూ. 15 వేల కోట్ల ఆర్థిక సహాయం అందిస్తోంది కేంద్రం. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందన్న ఉద్దేశంతో కేంద్రం ఇంత పెద్ద మొత్తంలో సహాయం చేసింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ కారిడార్, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్, ఓర్వకల్లులో మరొక ఇండస్ట్రియల్ నోడ్ వస్తుందని’ సీఎం రమేశ్ చెప్పుకొచ్చారు.

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి భారీ ప్రయోజనాలు 

ఈ బడ్జెట్‌లో అనేక రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు వస్తున్నాయి. మొత్తంగా రూ. 1 లక్ష కోట్లకు పైగా ఏపీకి బడ్జెట్ ద్వారా ప్రయోజనాలున్నాయి. అందుకే కేంద్ర బడ్జెట్ అవగానే ప్రధాని మోదీని కలిసి ధన్యవాదాలు తెలిపాం. ఏపీ రాజధాని అమరావతికి సాయం రుణం రూపంలో కాదు, పూర్తిగా కేంద్రం అందించే ఆర్థిక సహాయమే అని చెప్పారు. కేంద్ర బడ్జెట్ ను జగన్మోహన్ రెడ్డి స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా చెప్పాలన్నారు. అనాకపల్లి పక్కన నక్కపల్లిలో 400 ఎకరాలు ఏపీఐఐసీ తో ఉన్నా అభివృద్ధి జరగలేదు. ఇటీవల రూ. 1,800 కోట్లు పెట్టి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తోంది. పరిశ్రమలు వచ్చేలా అన్ని సదుపాయాలు కేంద్రం కల్పిస్తుంది. చోడవరం, మాడుగులలో 5,000 ఎకరాలు చూస్తే పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారని సీఎం రమేష్ వివరించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget