అన్వేషించండి
AP IPS Officers Transfers: ఏపీలో 9 మంది ఐపీఎస్‌ల బదిలీ, విజయవాడ సీపీ ఎవరంటే?
IPS Officers Transfers in AP: విజయవాడ సీపీగా ఎస్వీ రాజశేఖర్ బాబును నియమిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
Source : Other
AP Latest News: ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఉన్నతాధికారుల బదిలీలు జరిగాయి. ఈసారి తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. చాలా మందికి కొత్త చోట పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ సీపీగా ఎస్వీ రాజశేఖర్ బాబును ప్రభుత్వం నియమించింది. మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- పీహెచ్‌డీ రామకృష్ణ - పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు
- మాదిరెడ్డి ప్రతాప్ - అగ్నిమాపక డీజీ
- అంజనా సిన్హా - ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు
- గోపీనాథ్ జెట్టి - గ్రే హౌండ్స్ ఐజీ
- కోయ ప్రవీణ్ - కర్నూలు రేంజ్ డీఐజీ
- సీహెచ్ శ్రీకాంత్ - శాంతి భద్రతల ఐజీ
- పీహెచ్‌డీ రామకృష్ణ - లాజిస్టిక్స్ ఐజీ
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి





















