Jagananna Ku Chebudam Toll Free Number: జగనన్నకు చెబుదాం - ఏపీలో మీ సమస్యకు పరిష్కారం ఎలా జరుగుతుందంటే!
Jagananna Ku Chebudam Toll Free Number: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం (మే 09 )నుంచి ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది.
Jagananna Ku Chebudam Toll Free Number: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రెడీ అయ్యింది. మంగళవారం నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు క్రమం తప్పకుండా అప్‌డేట్స్ అందించటం ఈ కార్యక్రమం స్పెషాలిటీగా చెబుతున్నారు.
నేటి నుండి జగనన్నకు చెబుదాం..
మంగళవారం (మే 09 )నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. ఇది మరో ప్రతిష్టాత్మక కార్యక్రంగా ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీని కోసం 1902 అనే హెల్ప్‌లైన్ నంబర్‌ను పెడుతున్నారు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే సీఎం జగన్ అధికారులతో సమీక్షలు చేశారు. జగనన్నకు చెబుదాం పేరులో ముఖ్యమంత్రి జగన్ పేరును కలపి నిర్వహించే కార్యక్రమం ద్వారా సీరియస్ నెస్ ను పెంచేందుకు ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంటనేది ఇప్పటికే జిల్లా స్థాయిలోని అధికారులకు కూడా స్పష్టమయిన ఆదేశాలు ఇచ్చారు.
స్పందనకు అప్ డేట్....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే స్పందన కార్యక్రమాన్నినిర్వహిస్తుంది. ప్రతి సొమవారం అన్ని శాఖలకు చెందిన అధికారులు స్పందనలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నారు. స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని అమలులోకి తీసుకువస్తున్నారు. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం ప్రధాన టార్గెట్ గా చెబుతున్నారు. వ్యక్తిగత గ్రీవెన్సెస్‌ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తే.. దాన్ని అత్యంత నాణ్యతతో పరిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్ యూనిట్లు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్ చేసే విధంగా ఆదేశాలు కూడా ఇచ్చారు. గ్రీవెన్స్ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం ప్రధాన లక్ష్యం కావాలని ఇప్పటికే జిల్లాలోని అధికారులకు క్లారిటీ ఇచ్చారు.
రంగంలోకి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ లు..
ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే ఈ కార్యక్రమం పూర్తి సక్సెస్ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల(పీఎంయూ)ను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుందని,హెల్ప్‌లైన్ ద్వారా వచ్చే గ్రీవెన్స్,ను నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాల్సి ఉంటుంది. గ్రీవెన్స్ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయంగా సీఎం ఇప్పటికే అదికారులకు స్పష్టంగా తెలియ చేశారు. వ్యక్తిగత, కుటుంబం స్థాయిలో గ్రీవెన్సెస్ ఉంటుందని, రిజ్టసర్ అయిన గ్రీవెన్సెస్ ఫాలో అప్ చేయడం, ప్రభుత్వ సేవలు, పథకాలపై విచారణ చేసి,ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను నేరుగా చేరవేయడం జగనన్నకు చెబుదాం ప్రధాన లక్ష్యంగా ఇప్పటికే సంకేతాలు పంపారు. ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్ అయి ఉండటం ఇందులో స్పెషాలిటి, ప్రజల గ్రీవెన్స్‌స్‌ను సలహాలను నేరుగా తెలియచేసే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి , సీఎంఓ కార్యాలయం ఈ గ్రీవెన్స్‌స్‌ను నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా నిత్యం మానిటరిగ్ చేయనున్నారు. ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు క్రమం తప్పకుండా అప్‌డేట్స్‌ఇవ్వటంతో పాటుగా, ఇదే హెల్ప్‌లైన్ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకోనున్నారు.
1902 హెల్ప్ లైన్...
గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్ గురించి అవగాహన కల్పిస్తారు. ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకునేలా వారిని మరింతగా ప్రోత్సహించటం ద్వారా జగనన్నకు చెబుదాం కార్యక్రమం లో వాలంటీర్లను సైతం భాగస్వాములు చేయనున్నారు. సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి సీనియర్ ఐఏఎస్ అధికారులు జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా నియమించారు. క్రమం తప్పకుండా ఆయా జిల్లాలను సందర్శించి, ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను సందర్శించి పర్యవేక్షిస్తారు. కలెక్టర్లతో కలిపి జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును పర్యవేక్షించేలా ప్లాన్ చేశారు.
ప్రతి జిల్లాకు రూ. 3 కోట్ల నిధులు..
జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం సందర్బంగా ప్రతి జిల్లాకు ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు నిదులు కూడ విడుదల చేసింది. ప్రజలకు నాణ్యంగా సేవలను అందించేందుకు , అవసరమైన చోట.. ఈ డబ్బును ఖర్చు చేయవచ్చని జిల్లాకు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, మానిటరింగ్ యూనిట్లు గ్రీవెన్స్‌తో పాటు గ్రామస్ధాయిలో అన్ని అంశాలపైనా దృష్టి పెట్టి, వేగవంతంగా గ్రీవెన్స్‌స్ పరిష్కారంలో డెలివరీ మెకానిజం తీసుకురావాలని సర్కార్ భావిస్తోంది.
'స్పందన' వేదికల పునరుద్ధరణ
1 స్పందన కాల్ సెంటర్ → జగనన్నకు చెబుదాం కాల్ సెంటర్
2 స్పందన వెబ్సైట్ → జగనన్నకు చెబుదాం వెబ్సైట్ (www.jkc.ap.gov.in)
3 స్పందన సోమవారం (కలెక్టరేట్ ) → జగనన్నకు చెబుదాం సోమవారం (కలెక్టరేట్ )
4 స్పందన సచివాలయం-డెస్క్ → జగనన్నకు చెబుదాం సచివాలయం-డెస్క్
5 స్పందన మొబైల్ అప్లికేషన్ → జగనన్నకు చెబుదాం మొబైల్ అప్లికేషన్
మీ సమస్యకు పరిష్కారం ఎలా జరుగుతుందంటే..
1. మీ సమస్యను చెప్పేందుకు 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి
2. కాల్ సెంటర్ ప్రతినిధితో మీ సమస్యను చెప్పండి
3. మీ ఫిర్యాదును నమోదు చేసుకుని YSR (యువర్ సర్వీస్ రిక్వెస్ట్) ఐడీని కేటాయిస్తారు.
4. ఎప్పటికప్పుడు మీ అర్జీ స్టేటస్ గురించి ఎస్‌ఎంఎస్ ద్వారా మీకు అప్‌డేట్ అందుతుంది.
5. సమస్య పరిష్కారం తర్వాత ప్రభుత్వ సేవలపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి.
అవగాహన
ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలు తెలుసుకునేందుకు వీలు కల్పించడంతో పాటు వారి నుండి ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారం అందించడం
ఫిర్యాదు స్టేటస్
ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్ ద్వారా పౌరులు ఎప్పటికప్పుడు తమ ఫిర్యాదుల స్ధితిని, వాటి పరిష్కారం గురించి తెలుసుకునే సౌకర్యం
పరిష్కారం
అనేక సమస్యలకు అత్యున్నత స్ధాయిలో పరిష్కారం, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్‌లతో పాటు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది.