అన్వేషించండి

CM Jagan Review: ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట రావాలి - తుపానుపై రివ్యూలో సీఎం జగన్

AP Flood Affected Areas: ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

CM Jagan Review on Flood Areas: వరద బాధితుల స్థానంలో మనం ఉంటే ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో అలాంటి సాయాన్నే బాధితులకు అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్బంగా తుపాను వల్ల కలిగిన నష్టం, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై జగన్‌ అధికారులకు కీలక సూచనలు చేశారు. 

ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుపాను వల్ల భారీ వర్షాలు పడ్డాయి. అధికారులంతా మీమీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. బాధితులపట్ల సానుభూతితో వ్యవహరించండి. బాధితుల స్థానంలో మనం ఉంటే.. ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో.. ఆ తరహా సహాయం వారికి అందించాలి. రూ.10లు ఎక్కువైనా పర్వాలేదు, వారికి మంచి సహాయం అందాలి. ఇంత కష్టంలో కూడా బాగా చూసుకున్నారనే మాట రావాలి. పరిహారం అందించడం పట్ల సానుభూతితో ఉండండి. దెబ్బతిన్న ఇళ్ల విషయంలో కాని, క్యాంపులనుంచి ప్రజలను తిరిగి వెళ్తున్న సందర్బంలోకాని వారికి ఇవ్వాల్సిన సహాయం వారికి ఇవ్వాలి. రేషన్‌ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదు.

పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలి. అన్నిరకాల మానవ వనరులను దీనిపై పెట్టండి. ధ్యాసంతా ఇప్పుడు దీనిపై పెట్టాలి. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. వారు అధైర్యపడాల్సిన పనిలేదు. ప్రతి రైతునూ ఆదుకుంటుంది. పంటల రక్షణ, తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్నిరకాలుగా తోడుగా ఉంటుంది.  

యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలి. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోండి. దీన్నికూడా ప్రాధాన్యంగా తీసుకోండి. వర్షాలు తగ్గుముఖంపట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టండి. అధికారులంతా బాగానే పనిచేస్తున్నారు. చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్‌ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తాం. విధినిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వాలంటీర్ల దగ్గరనుంచి పైస్థాయి ఉద్యోగుల వరకూ ఈ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’ అని సీఎం జగన్ సూచనలు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Embed widget