AP High Court: వ్యభిచారం కూపం నుంచి చిన్నారిని రక్షించిన అధికారి- హైకోర్టు ప్రశంసలు
AP High Court: పన్నెండేళ్ల ప్రాయంలోని పాపను వ్యభిచారం కూపంలోకి దింపి.. పదే పదే అమ్మాయిపై అత్యాచారం చేశారు. ఎలాగోలా తప్పించుకున్న ఆ బాలికకు అండగా నిలబడి ఓ పోలీసులు అధికారిణి 80 మందిని అరెస్ట్ చేసింది.
AP High Court: పన్నెండేళ్ల వయసులోనే పలువురి మాటలు మోసపోయిందో చిన్నారి. తనకు తెలియుకండానే దుర్మార్గుల చేతిలో పడి వ్యభిచారం కూపంలో కూరుకుపోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు మారుతూ.. చివరకు పోలీసుల చెంతకు చేరింది. అండగా నిలబడ్డ ఓ పోలీసు అధికారిణి పది నెలల పాటు శ్రమించి 80 మందిని నిందితులుగా తేల్చారు. అంతేనా మొత్తం 79 మందిని అరెస్ట్ చేశారు. ఒక్కొక్కరికి 90 రోజుల నుంచి 120 రోజుల పాటు రిమాండ్ విధించేలా చర్యలు తీసుకొని.. సుమారు 500 పేజీల ఛార్జీ షీట్ దాఖలు చేశారు. నిందితులందరికీ శిక్ష పడేలా అన్ని ఆధారాలు సిద్ధం చేశారు. చిన్నారి రక్షించడమే కాకుండా పక్కా ఆధారాలతో నిందితులను పట్టుకున్న ఆ పోలీసు అధికారిణి పని తీరును ఏపీ హైకోర్టు గుర్తించి ప్రశంసించింది.
అసలేం జరిగిందంటే?
గుంటూరు జిల్లా మేడికండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గతి ఏడాది 12 ఏళ్ల బాలికను అపహరించి వ్యభిచార కూపంలోకి దించారు కొందరు దుర్మార్ఘులు. బాలిక తల్లికి కరోనా వచ్చి ఆస్పత్రిలో ఉండగా... తండ్రితో స్వర్ణ అనే మహిళ పరిచయం చేసుకొని బాలికను తనతో పంపిస్తే ఆమె బాగోగులు చూసుకుంటానని మాయ మాటలు చెప్పింది. నమ్మిన తండ్రి పన్నెండేళ్ల బాలికను పంపాడు. అక్కడి నుంచి తీసుకెళ్లిన ఆమె పాపను మరో వ్యక్తికి అమ్మేసిందామె. ఇలా బాలికను ఒకరి తర్వాత మరొకరు విక్రయిస్తూ.. చేతులు మార్చారు. వ్యభిచార కూపంలోకి దింపారు.
తెలంగాణ, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, వైజాగ్, కాకినాడ, నెల్లూరు, తణుకు, రాజమండ్రి ప్రాంతాల్లో సుమారు 47 మంది వ్యభిచార గృహాల నిర్వాహకుల చేతుల్లో ఆ పాప నలిగిపోయింది. చివరకు రాజస్థాన్ - పాకిస్థాన్ బార్డర్ లో ఉన్న ఒక వ్యక్తి వద్ద నుంచి తప్పించుకుంది. ఆఖరుకు మేడికొండూరు చేరి పోలీసులను ఆశ్రయించింది.
ఆ చిన్నారి తనను తీసుకెళ్లినా ప్రాంతాల గురించి వివరించినా అప్పటి స్టేషన్ అధికారులు స్పందించలేదు. దీంతో ఈ కేసును అప్పటి వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ, ప్రస్తుత గుంటూరు జిల్లా ఏఎస్పీ కె. సుప్రజకు ఉన్నతాధికారులు విచారణ బాధ్యత అప్పగించారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె చిన్నారితో ప్రత్యేకంగా మాట్లాడారు. కేసు మూలాల్లోకి వెళ్లారు. బాలిక చెప్పిన ప్రాంతాలన్నింటిలోనూ నిఘా ఏర్పాటు చేసి, నిర్వాహకులను పట్టుకున్నారు. దాదాపు 10 నెలలపాటు శ్రమించి 80 మందిని నిందితులుగా తేల్చారు. ఇప్పటికే 79 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు మాత్రం లండన్ లో ఉండటంతో పోలీసులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. అతను ఎప్పుడు ఇండియాకి వచ్చినా అరెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అంత కాలం శ్రమించి నిందితులను పట్టుకోవడం.. ఆ అమ్మాయికి జరిగినట్లు మరెవరికీ జరగకుండా చేసిన ఏఎస్పీ సుప్రజను హైకోర్టు అభినందించింది. డీఎస్పీ నుంచి ఏఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించడం చాలా గొప్ప విషయం అని పేర్కొంది. అంతే కాకుండా ఈ కేసును ముందు ముందు కూడా ఆమే విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.