CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్ డీల్
ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటనలో కీలక ఒప్పందాలు కుదురుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో టెక్‌మహీంద్రతో కీలక డీల్ కుదిరింది.
విశాఖపట్నాన్ని మేజర్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. ప్రస్తుతం దావోస్‌లో పర్యటిస్తున్న జగన్... వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం సదస్సులో కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు.
రెండో రోజు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నానితో భేటీ అయిన జగన్... రాష్ట్రంలో పెట్టబడులు పెట్టాలని రిక్వస్ట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు వివరించారు.
సీఎంతో భేటీ అనంతరం మాట్లాడిన సీపీ గుర్నాని.. పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్‌తో మంచి సమావేశం జరిగిందన్నారు. విశాఖపట్నాన్ని మేజర్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పంతో ఉన్నారని వివరించారు..
టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ బైట్.#APatWEF22 #AndhraPradesh #CMYSJaganInDavos pic.twitter.com/zv8F17pB8l
— YSR Congress Party (@YSRCParty) May 23, 2022
నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని సీఎం జగన్ కోరినట్టు సీపీ గుర్నాని వివరించారు. ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా విశాఖపట్నాన్ని తీర్చిద్దాలని శ్రమిస్తున్నట్టు తెలిపారు. ఈ కల సాకారానికి ఏపీతో కలిసి రావాలని ఆహ్వానించారన్నారు.
సీపీ గుర్నాని , టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ:
— YSR Congress Party (@YSRCParty) May 23, 2022
ముఖ్యమంత్రిగారితో మంచి సమావేశం జరిగింది.
విశాఖపట్నాన్ని మేజర్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పంతో ఉన్నారు.
నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. 1/2 pic.twitter.com/bUUuHbHEnP
ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి మేరకు ఆంధ్రావర్శిటీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు సీపీ గుర్నాని ప్రకటించారు. నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తామన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంలెటిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా విశాఖపట్నాన్ని తీర్చిద్దాలని ఆయన సంకల్పంతో ఉన్నారు.
— YSR Congress Party (@YSRCParty) May 23, 2022
ఈ కల సాకారానికి ఏపీతో కలిసి రావాలని ఆహ్వానించారు. నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తాం. 2/2
జపాన్ రవాణా సంస్థ మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ సీఈఓ తకేషి హషిమొటోతో సీఎం జగన్ భేటీ కానున్నారు. హీరోమోటార్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎండీ పవన్ ముంజల్‌తో సమావేశం కానున్నారు. ఐబీఎం ఛైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణతోనూ సీఎం డిస్కషన్ చేయనున్నారు.