Guntur: ఎన్నికల బెట్టింగ్‌లో వింత, ప్రత్యర్థులదే గెలుపని అభ్యర్థులు బెట్టింగ్‌లు! కారణం తెలిస్తే షాక్!
AP Latest News: బెట్టింగ్ ఘనాపాఠిలు సొంత సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. అభ్యర్థులు కొందరు తన ప్రత్యర్థి విజయం సాధిస్తాడు అంటూ పందాలు కట్టడం హాట్ టాపిక్ గా మారింది.
Guntur News: పోలింగ్ ముగిసిన పది రోజులు దాటింది. అప్పటి నుంచే గ్యాంబ్లర్ల సందడి మొదలైంది... ఫలానా పార్టీ అధికారంలో వస్తుందని ఒకరు సమస్యే లేదు రాదు అని మరొకరు పందాలు కాస్తున్నారు. బెట్టింగ్ బోర్డ్ కూడా రెడీ అయిందట...కొన్ని ప్రాంతాలలో కూటమి బ్యాచ్ కు పందాలు అందటం లేదని ఆవేదన చెందుతున్నారట....కాయకు కాయ లేదట కోసు పందాలైతేనే ఫ్యాన్ బ్యాచ్ సంశయిస్తూనే బెట్టింగ్ చేస్తోందట...ఇప్పటికే బెట్టింగ్ ఘనాపాఠీలు సొంత సర్వేలు కూడా చేయించారట..అభ్యర్థులు కొందరు తన ప్రత్యర్థి విజయం సాధిస్తాడు అంటూ పందాలు కట్టడం హాట్ టాపిక్ గా మారింది.
పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పందెం రాయుళ్ళు గ్యాబ్లీంగ్ కు తెర తీశారు... ఏ పార్టీ అదికారంలోకి వస్తుంది, ఎవరు గెలుస్తారు అన్న పందేల నుంచి ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీ సాధిస్తారు...ఎన్నికల రౌండ్స్ లెక్కింపులో ఎవరు ఆధిక్యం ప్రదర్శిస్తారు? ఇలా అన్ని రకాల పందాలకు సిద్దమయ్యారు...దేశ వ్యాప్తంగా ఏపీలో జరిగిన ఎలక్షన్స్ పై ఆసక్తి ఉంది...గెలుపు, ಓటములు ఉత్కంఠంగా ఉండటంతో పందాలు పెద్ద ఎత్తున జరుగే అవకాశం ఉన్నట్లు బెట్టింగ్ మాఫియా గుర్తించింది...అందుకు అనుగుణంగా ఏపీ ఎలక్షన్ గ్యాబ్లింగ్ బోర్డ్ ను తయారు చేసిందట.. ఈ బోర్డులో వివిధ నియోజకవర్గాలలో ఉన్న అభ్యర్థులపై పందాలకు సంబంధించి రేట్స్ ఫిక్స్ చేశారట..నెక్ టూ నెక్ ఫైట్ ఉన్న చోట బారుకు బారు ఫిక్స్ చేయగా..అభ్యర్థి వీక్ అయితే రూపాయికి రెండు రూపాయలు ఫిక్స్ చేశారట...
అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది..ఎంత మెజారిటీతో వస్తుంది...అధికారంలోకి వచ్చే పార్టీ 110 స్థానాల మార్క్ సాదిస్తుందా లాంటి పందాలతో పాటు..పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ లోకేష్ లాంటి నాయకులకైతే వారికి వచ్చే మెజార్టీ పైనే పందాలు నడుస్తున్నాయి.. బెట్టింగ్ బోర్డ్ ద్వారా పందాలు నగదు రూపంలోనే జరుగు తాయి...ఇక స్థానికంగా ఉన్న పందెగాళ్ళు పొలాలు, స్థలాలు, ఇళ్ళు కూడా పందాలు కాయడం ఆందోళన కలిగిస్తోంది...
నెలరోజుల ముందు నుంచే బెట్టింగ్ మాఫియా సొంత సర్వే చేయించుకుందట...రాజకీయ నాయకులు, పార్టీలు చేయించుకున్న సర్వేలను పరిగణలోనికి తీసుకోలేదట..ఇదే బాటలో కోట్లలో బెట్టింగ్ చేసే వ్యక్తులు సొంత సర్వేలు నమ్ముకున్నారట...ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసుకొని అన్ని వర్గాల ప్రజల నుంచి శాంపిల్స్ తీసుకోని మరి నిర్థిష్టంగా అంచనాకు వచ్చారట..బెట్టింగ్ లో కూడా అసలు సిసలైన ప్రొఫిషనలిజమ్ చూపారు...
ప్రత్యర్థి గెలుస్తాడని అభ్యర్థులు బెట్టింగ్.. ఇదో వింత లాజిక్
కొంత మంది పోటీ చేసిన అభ్యర్థులైతే అశ్చర్యకరంగా ప్రత్యర్థి విజయం సాధిస్తాడని పందేలు కాయడం అశ్ఛర్యాన్ని కలిగిస్తోంది... ఈ తరహా బెట్టింగ్ కు ఎందుకు పాల్పడ్డారని సన్నిహితులు అడగగా వారు ఇచ్చిన ఆన్సర్ మైడ్ బ్లాక్ చేసిందట..ఎలక్షన్ లో కనీసం 30 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి...గెలిస్తే ఓకే పెట్టిన ఖర్చులు రాబట్టుకోవచ్చు...మరి ಓడి పోతే కొంత వరకు అయిన బైట పడేందుకు ప్రత్యర్థిపై బెట్టింగ్ చేస్తున్నాం అని చెప్పారట ఆ నాయకుడు...ఇలాంటి నాయకులు అనేక మంది ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది...
మొత్తానికి ఆర్థిక పరిస్థితి, తారతమ్యాలతో సంబంధం లేకుండా పెద్ద సంఖ్యలో బెట్టింగ్ కు పాల్పడుతున్నారు...ఆశతో ఒకరు, పరువు పైరుతో మరొకరు, ప్రొఫినలిజమ్ గా మరి కొందరు బెట్టింగ్ మహమ్మారికి బలికానున్నారు..రాష్ట్ర వ్యప్తంగా వేల కోట్ల రూపాయల పందాలు జోరుగా సాగుతున్నాయని టాక్...ఎన్నికల రిజల్ట్ కు మరో 12 రోజుల సమయం ఉండటంతో బెట్టింగ్ పీక్స్ కు వెళుతోందని అంచనా...మద్యవర్తులకు మాత్రం షరామాములుగా 2 నుంచి 5 శాతం వరకు కమీషన్ మాత్రం గిట్టుబాటు అవుతోంది.
- రవిక్రిష్ణ సొంటెం