AP Welfare Calendar 2023-24: ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ ఆవిష్కరించిన సీఎం జగన్ - ఏ నెలలో ఎవరికి లబ్ది వివరాలు
YS Jagan Releases Welfare Calendar For 2023-24: ఏపీ ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ 2023–24 ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.
AP Welfare Calendar For 2023-24: ఏపీ ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ 2023–24 ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అత్యధిక స్దాయిలో అమలు చేసిన ఘనత తమదేనని ఈ సందర్బంగా జగన్ అన్నారు.
క్యాలెండర్ రూట్ మ్యాప్ ఇదే...
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాది పొడవునా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తున్నామన్నది సంక్షేమ క్యాలెండర్ ద్వారా ముందుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడిస్తోంది. ముందుగా ప్రకటించిన విధంగా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా లబ్దిని అందంచటంలో సీఎం జగన్ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమాచారశాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
45 నెలల్లో 2 లక్షల కోట్లకు పైగా...
వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే సంక్షేమ పథకాల ద్వారా అందించిన లబ్ధి (డీబీటీ, నాన్ డీబీటీ) రూ. 2,96,148.09 కోట్లు అయింది. నెలల వారీగా ప్రభుత్వం అందజేయనున్న సంక్షేమ పథకాల వివరాలను సంక్షేమ క్యాలెండర్‌లో పొందుపరిచారు.
ఏ నెలలో ఏ పథకం అంటే....
- ఏప్రిల్ 2023 – జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ ఈబీసీ నేస్తం,
- మే 2023 – వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ (మొదటి విడత), వైఎస్సార్ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన (మొదటి విడత), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్ మత్స్యకార భరోసా..
- జూన్ 2023 – జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి..
- జులై 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా (రెండో త్రైమాసికం)..
- ఆగష్టు 2023 – జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహనమిత్ర.
- సెప్టెంబర్ 2023 – వైఎస్సార్ చేయూత...
- అక్టోబర్ 2023 – వైఎస్సార్ రైతుభరోసా – పీఎం కిసాన్ (రెండవ విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత)...
- నవంబర్ 2023 – వైఎస్సార్ సున్నావడ్డీ – పంట రుణాలు, వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా (మూడవ త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడవ విడత)...
- డిసెంబర్ 2023 – జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండవ విడత), జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి.
- జనవరి 2024 – వైఎస్సార్ రైతుభరోసా – పీఎం కిసాన్ (మూడవ విడత), వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు (రెండవ విడత), వైఎస్సార్ లా నేస్తం (రెండవ విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ. 3000).
- ఫిబ్రవరి 2024 – జగనన్న విద్యా దీవెన (నాల్గవ విడత), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా (నాల్గవ త్రైమాసికం), వైఎస్సార్ ఈబీసీ నేస్తం.
- మార్చి 2024 – జగనన్న వసతి దీవెన (రెండవ విడత), ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు అందించనున్నారు.
సంక్షేమంలో టాప్...
సంక్షేమ పథకాల అమలులో ఏపీ ప్రభుత్వం ప్రత్యేకత ను సాధించిందని మంత్రి వేణు అన్నారు. లబ్దిదారులకు నేరుగా పదకాలు అందించటం ద్వారా ప్రభుత్వం పై విశ్వాసం పెరిగిందని, అదే సమయంలో అవినీతికి తావులేకుండా ప్రజలకు అందాల్సిన అన్ని పదకాలు అందుతున్నాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విదంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఘనత జగన్ కు దక్కుతుందని, దేశంలోని అనేక రాష్ట్రాలు సైతం ఈ విధానంపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారని తెలిపారు.