AP Bjp Amaravati Tour : అమరావతిలో పర్యటించనున్న ఏపీ బీజేపీ నేతలు - కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇస్తారా ?
శనివారం అమరావతిలో పర్యటించాలని ఏపీ బీజేపీ నేతలు నిర్ణయించారు. జీవీఎల్ నేతృత్వంలోని బృందం నిర్మాణాలను పరిశీలించనుంది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు అమరావతి నిర్మాణాలను పరిశీలించాలని నిర్ణయించారు. శనివరం ఎంపీ జీవీఎల్ నరసింహారావు నేతృత్వంలో బృందం పర్యటించనుంది. వారు రైతులతో సమావేశమై వివరాలు తెలుసుకుంటారు. తర్వాత గత ప్రభుత్వ హయాంలో నిర్మాణమైన వాటిని ప్రత్యక్షంగా చూస్తారు. అమరావతికి భారతీయ జనతా పార్టీకి కూడా ప్రత్యక్ష మద్దతు ప్రకటించింది. అమరావతిలోనే రాజధాని ఉండాలని స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నేతలు ప్రత్యక్ష పర్యటనకు వస్తూండటంతో రాజధాని రైతుల్లోనూ సానుకూలత వ్యక్తమవుతోంది.
జీవీఎల్ నరసింహారావు గతంలో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసినప్పుడు సానుకూలంగా స్పందించారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్రానికి సంబంధం లేదన్నారు. అయితే రాజధాని అనేది అమరావతిలోనే ఉండాలనేది తమ పార్టీ విధానమని చెబుతూ వచ్చారు. అయితే అమరావతి రైతులు మాత్రం బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని విమర్శించేవారు. సాక్షాత్తూ ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతి నిర్ణయం అయిపోయిందని .. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చే విధానం ఎక్కడ ఉందని.. కేంద్రం ఎందుకు అడ్డుకోదని ప్రశ్నించేవారు.
దత్తపుత్రుడు ఆ మాట అనగలడా? కొడుక్కి ఇలా ట్రైనింగ్ ఇస్తున్న తండ్రిని ఎక్కడా చూడలేదు: జగన్
అనేక వివాదాలు.. ఉద్యమాలు.. ఆందోళనల తర్వాత అమరావతి రైతులు ఎట్టకేలకు న్యాయపోరాటంలో విజయం సాధించారు. అమరావతిని నిర్మించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ ప్రకారం ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్మాణాలు ప్రారంభించింది. అయితే మళ్లీ మాస్టర్ ప్లాన్‌లోని ఇన్నర్ రింగ్‌రోడ్‌లో అక్రమాలంటూ కొత్తగా కేసులు నమోదు చేసి అందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు నారాయణ వంటి వారిని నిందితులుగా చేర్చారు. ఇది కూడా అమరావతిపై కుట్ర కోణంలోనే చేశారని అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి అనంతపురంలో జేసీX పల్లె- టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
మరో వైపు అమరావతి రైతులు .. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గత ప్రభుత్వం రాజధానిలో కేటాయించిన భూములు తీసుకున్నాయి కానీ నిర్మాణాలు ప్రారంభించలేదని.. తక్షణం వాటిని ప్రారంభించాలని కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఆ మేరకు రైతులు వినతి పత్రాలు సమర్పించి వచ్చారు. జీవీఎల్ నరసింహారావు నేతృత్వంలో వస్తున్న బీజేపీ బృందం.. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలపై ఏమైనా గుడ్ న్యూస్ రైతులకు చెబుతుందన్న ఆసక్తి ఏర్పడింది. బీజేపీ మిత్రపక్షం జనసేన ఈ పర్యటనలో పాల్గొంటుందో లేదో స్పష్టత లేదు.