News
News
వీడియోలు ఆటలు
X

ఎక్కువ ధర ఉందనే ఇతర రాష్ట్రాలకు మన ధాన్యం: పౌరసరఫరాల శాఖ కార్యదర్శి 

వేసవి కాలంలో వచ్చిన వర్షాలతో అటు రైతులు నష్టపోవటంతో పాటుగా, ఇటు రాజకీయాలు కూడా మొదలు కావటంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.

FOLLOW US: 
Share:

రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది. వర్షాలు తగ్గిన తర్వాత సర్వే చేస్తామని ఆయన అన్నారు. అనంతరం పంట నష్టంపై ఓ రిపోర్టు తయారు చేస్తామని తెలిపారు. 
ఆంధ్రప్రదేశ్‌లో వేసవి కాలంలో కురిసిన భారీ వర్షాలు కారణంగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. ఈ వ్యవహరంపై, రాజకీయ విమర్శలు, ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వేసవి కాలంలో గతంలో ఎన్నడూ లేని విదంగా వర్షాలు కురవటం, రైతులు తమ పంటను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పెట్టుబడులు నష్టపోయిన రైతులు, తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సీఎం జగన్ సమీక్ష...
రాష్ట్రంలో వర్షాలు అనంతర పరిస్థితులపై సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం, వర్షాల కారణంగా పంట నష్టం తదితర అంశాలపై ప్రాథమికంగా అందిన వివరాలను సీఎంకు  అధికారులు వివరించారు. రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని సీఎం ఆదేశించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాట రాకూడదన్న సీఎం, వర్షాల వల్ల రైతులకు కలిగిన పంట సహా ఇతర నష్టాలకు గ్రామ సచివాలయాల స్థాయి నుంచే నిరంతరం వివరాలు తెప్పించుకోవాలన్నారు. 

రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఇది పూర్తిస్థాయిలో జరగాలని సీఎం సూచించారు. ఎన్యుమరేషన్‌ ప్రక్రియ పూర్తైన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ కోసం పెట్టాలని అన్నారు. ఎవరైనా మిగిలిపోయినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకు వచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. పంట నష్టపోయిన ఏ రైతుకు కూడా పరిహారం అందలేదనే మాట రాకూడదన్న సీఎం, రబీ సీజన్‌కు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. 

పంట కొనుగోలు చేయడం లేదన్న మాట కూడా ఎక్కడా వినిపించకూడదని, రైతులకు ఏమైనా ఇబ్బందులు, ఫిర్యాదులు ఉంటే.. వాటిని నివేదించడానికి ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలని, రైతుల ముఖంలో చిరునవ్వు కనిపించేలా చర్యలు ఉండాలని సీఎం అన్నారు.  

రంగంలోకి దిగిన వ్యవసాయ శాఖ ...
వేసవి కాలంలో వచ్చిన వర్షాలతో అటు రైతులు నష్టపోవటంతో పాటుగా, ఇటు రాజకీయాలు కూడా మొదలు కావటంతో యంత్రాంగం రంగంలోకి దిగింది. రైతులకు కలిగిన నష్టంపై పూర్తి స్థాయిలో వివరాలను సేకరించి అందరికి న్యాయం చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది అన్నారు. సోషల్ ఆడిట్ కోసం  ఆర్బికెలో లిస్ట్ పెడతామని, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈనెల 8 వరకు వర్షాలు ఉంటాయని చెప్పారు. 

వర్షాలు తగ్గిన 15 రోజుల తర్వాత  మొత్తం నివేదిక వస్తుందని,  వ్యవసాయ నిపుణులు అందుబాటులో ఉండటం వలన, కచ్చితమైన రిపోర్ట్ వస్తుందని ద్వివేదీ వెల్లడించారు. అందరి అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్‌లో ఉన్నామని, వ్యవసాయ శాఖ సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ 155251కి  ఫోన్ చేయవచ్చని చెప్పారు. రైతులకు ప్రభుత్వ మద్దతు పూర్తి స్థాయిలో ఉందని వివరించారు.

ఎక్కడెక్కడ ఎంతెంత నష్టం అంటే...  

మార్చిలో వర్షానికి 1700 హెక్టార్లకుపైగా దెబ్బ తిన్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ హరి కిరణ్ వెల్లడించారు. వ్యవసాయ ఉద్యానవన పంటలు కలిపి 23 వేల ఎకరాలు దెబ్బ తిన్నాయని, ఏ సీజన్‌లో పంటలు దెబ్బతిన్న అదే సీజన్‌లో నష్ట పరిహారం ఇస్తున్నామని వివరించారు. మార్చిలో వచ్చిన వర్షాలు వల్ల వచ్చిన నష్టానికి జాబితా రెడీ అయ్యిందని చెప్పారు. సీఎం ఆదేశాలు మేరకు వచ్చే ఖరీఫ్‌లోపు పరిహారం అందిస్తామని, వరి మొక్క జొన్న బాగా దెబ్బతిన్నాయని తెలిపారు.

పక్క రాష్ట్రాల్లో అధిక ధరలు...
ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం ధరలను పోల్చితే, పక్క రాష్ట్రంలో అధిక ధరలు ఉన్నాయి. దీంతో చాలా మంది రైతులు ఆయా రాష్ట్రాలకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని పౌరసరఫరాల శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్ తెలిపారు. రబీ ధాన్యం గత నెల 1 నుంచి కొనుగోలు మొదలైందని, నాలుగు రోజుల్లోనే డబ్బులు రైతుల ఖాతాలో వేస్తున్నామన్నారు. ఏ రైతులు కూడా తక్కువ ధరకు ధాన్యం అమ్మే  పరిస్థితి ఉండకూడదన్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కొంత ఇబ్బంది  ఉందన్నారు. అధిక వేడి ఎండల వల్ల కూడా ఇబ్బందులు వచ్చాయని, జయ వెరైటీ రకం  ఎక్కువ వేశారని, 5 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ ప్యాడి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. మద్దతు ధర కన్నా ఎక్కువ ఇతర రాష్ట్రాల్లో  ఉండడం వల్ల కొంతమంది చెన్నై వెళుతున్నారని అన్నారు.

ప్రతి జిల్లా కలెక్టర్లకు  కోటి రూపాయల ఫండ్  ఇస్తున్నామని, ధాన్యం కొనుగోళ్లు కోసం, రవాణా ఖర్చుల కోసం కలెక్టర్లు ఫండ్ ఇస్తారని అన్నారు. మధ్యవర్తుల దళారుల ప్రచారం రైతులు  నమ్మద్దని, కొంతమంది మిల్లర్లు బాగ్ కి డబ్బులు  కట్  చేస్తున్నారన్న విషయం తమ వద్దకు వచ్చిందన్నారు. మిల్లర్లు  బ్యాగ్ కు  డబ్బు  కట్ చేస్తే పెనాల్టీ వేస్తామని హెచ్చరించారు. అవసరం అయితే బ్లాక్  లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు.

Published at : 05 May 2023 07:48 AM (IST) Tags: AP CMO AP Agriculture AP Rains Jagan

సంబంధిత కథనాలు

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ఎన్టీఆర్‌ హైస్కూల్‌లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!

ఎన్టీఆర్‌ హైస్కూల్‌లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!

యువగళంలో లోకేష్ కు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని డీజీపీకి వర్ల రామయ్య లేఖ

యువగళంలో లోకేష్ కు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని డీజీపీకి వర్ల రామయ్య లేఖ

Coromandel Express Accident: టెక్నాలజీని వినియోగించుకొని రైలు ప్రమాదాలు జరగకుండా చూడాలి - ఎంపీ రామ్మోహన్ నాయుడు

Coromandel Express Accident: టెక్నాలజీని వినియోగించుకొని రైలు ప్రమాదాలు జరగకుండా చూడాలి - ఎంపీ రామ్మోహన్ నాయుడు

ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ఏపీ మంత్రుల సమావేశం, కీలక అంశాలపై చర్చ

ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ఏపీ మంత్రుల సమావేశం, కీలక అంశాలపై చర్చ

టాప్ స్టోరీస్

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Guduvada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Guduvada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!

Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!