Amaravati Land Pooling: అమరావతి మలివిడత భూసేకరణకు నిబంధనలు విడుదల, పరిహారం పూర్తి వివరాలు
అమరావతి మలివిడత భూసేకరణకు సంబంధించి పురపాలక శాఖ నిబంధనలు విడుదల చేసింది. ఎవరికి ఎంతమేర పరిహారం అందనుందో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Amaravati land pooling scheme 2025 guidelines | ఏపీ రాజధాని అమరావతి కోసం కొత్తగా చేపట్టనున్న భూ సమీకరణకు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు విడుదల చేసింది. రాజధాని అభివృద్ధికి సీఆర్డిఏ పరిధిలో చేయనున్న భూ సమీకరణకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత భూ సమీకరణ (రూపకల్పన, అమలు) నిబంధనలు 2025 గెజిట్లో నిబంధనలను నోటిఫై చేస్తూ ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ జిఓ నంబర్ 118 జారీ చేశారు. రాజధాని అమరావతి పరిధిలోని 217 చదరపు కిలోమీటర్లు మినహా సి ఆర్ డి ఏ మొత్తం ప్రాంతానికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. 2014లో అమరావతికి ప్రకటించిన నిబంధనలను దాదాపుగా తాజా భూసేకరణకు వర్తింపజేస్తున్నారు.
ల్యాండ్ పూలింగ్ పథకం
విమానాశ్రయాలు, ఓడరేవులు, అన్ని ఇతర అవసరమైన ప్రాజెక్టుల వంటి అవసరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించడానికి, భూమి సేకరణ విధానం స్వచ్ఛంద పథకంగా రూపొందించారు. ఇది భూ యజమానులు, రాష్ట్రం/అధికార సంస్థ మధ్య పరస్పర ఏకాభిప్రాయం ఆధారంగా ఉంటుంది. ఇది భూమి సేకరణకు ఒక ప్రత్యేకమైన పద్ధతి ‘ల్యాండ్ పూలింగ్ పథకం’ అమలు చేస్తారు.
ల్యాండ్ పూలింగ్ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ రూపొందించిన పథకం, భూసేకరణ, పునరావాసం, పునరావాసంలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం, 2013లోని సెక్షన్ 107 & 108 కింద అనుమతి కారణంగా. ల్యాండ్ పూలింగ్ పథకంలో పాల్గొనే భూ యజమానులు అప్పగించిన కారణంగా, AP CRDA చట్టం, 2014లోని సెక్షన్ 48(1) కింద రాష్ట్రం/అధికారికి ప్రాతినిధ్యం వహించే కాంపిటెంట్ అథారిటీ ఇచ్చిన అంగీకారంతో అందించిన భూమిలోని టైటిల్ రాష్ట్రం/అధికారానికి అనుకూలంగా బదిలీ కానుంది.
AP CRDA చట్టం, 2014లోని సెక్షన్ 43(4)(a) కింద అంగీకరించిన అభివృద్ధి పథకం ప్రకారం, పునర్నిర్మించిన ప్లాట్‌ను అదే ప్రాంతంలో లేదా ఏదైనా ఇతర సమీపంలో భూమి యజమానికి అనుకూలంగా కేటాయించనున్నారు. చట్టంలోని సెక్షన్ 43(5) & (6) ప్రకారం ల్యాండ్ పూలింగ్ పథకం కోసం ఏదైనా ప్రాంతం ఉద్దేశ్యాన్ని ప్రభుత్వమే గుర్తించి తెలియజేస్తే, అథారిటీ ఆమోదం అవసరం లేదు.
కమిషనర్ ల్యాండ్ పూలింగ్ పథకాన్ని కొనసాగించడానికి అథారిటీని గుర్తించి ఆమోదం పొందిన తర్వాత, కమిషనర్/ అధికారి చట్టంలోని సెక్షన్ 55(4) కింద తన ఉద్దేశ్యాన్ని ప్రకటించడానికి నోటిఫికేషన్ Iలో సూచించిన ఫార్మాట్‌లో సెక్షన్ 55(5) కింద అభ్యంతరాలను ఆహ్వానించారు.
- పురపాలక శాఖ పట్టా భూములు మెట్ట భూములైతే అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో ఎకరానికి 1000 గజాల నివాస స్థలంతో పాటు 250 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు.
- జామ, నిమ్మ, సపోటా వంటి పండ్ల తోటలున్న భూములకు లక్ష రూపాయలు చొప్పున కేవలం ఒక్కసారి పరిహారం చెల్లిస్తారు.
- జరీబు భూములు ఇచ్చే వారికి ఎకరానికి 1000 చదరపు గజాల నివాసం స్థలంతో పాటు 450 చదరపు గజాల కమర్షియల్ ప్లాట్ స్థలం
ఎసైన్డ్ భూములకు, శివాయ్ జమేదార్స్, అభ్యంతరం లేని, అభ్యంతరం ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేస్తున్న వారికి కేటగిరీల వారీగా వేర్వేరు ప్యాకేజీలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
- ఒకవేళ పట్టా భూములు 1954 కి ముందు, ఆ తర్వాత ఎసైన్ చేసిన భూములు, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితుల భూములకు మాత్రమే కౌలు చెల్లిస్తారు. మిగతా కేటగిరీల భూములకు ఎలాంటి కౌలు చెల్లించరు.
- మెట్ట భూములకు తొలి ఏడాదికి ఎకరానికి రూ.30 వేలు, జరీబు భూములకు రూ.50 వేల చొప్పున కౌలు చెల్లిస్తారు. రెండో ఏడాది నుంచి ముందు ఏడాది ఇచ్చిన దాంట్లో ఏటా 10 శాతం అధికంగా చెల్లిస్తారు.
అనధికార లేఅవుట్లలోని స్థలాలకు పరిహారం
అనధికారిక లేఅవుట్లలోని స్థలాలకు 65 శాతం పరిహారం గానీ, గరిష్టంగా 500 చదరపు గజాల భూమి గానీ పరిహారంగా ఇస్తారు. సీఆర్‌డీఏ/డీటీసీపీ లేదా వీజీటీఎం-ఉడా అనుమతితో వేసిన లేఅవుట్లతో పాటు గ్రామకంఠం, అగ్రహారం, అబాది, విలేజ్ సైట్‌లను తాజా భూ సేకరణ నుంచి మినహాయిస్తారు. బలహీనవర్గాల కోసం ఇళ్లు నిర్మించిన కాలనీలను, విస్తరించిన గ్రామ కంఠాలను మినహాయిస్తారు. అయితే భూసమీకరణ నిర్ణయం ప్రకటించే నాటికి ఉన్నవాటినే పరిగణనలోకి తీసుకుంటారు.
భూములు తీసుకునే గ్రామాల్లోని వ్యవసాయ కూలీలు, భూమి లేని నిరుపేదలకు నెలకు రూ.5 వేల చొప్పున 10 సంవత్సరాల పాటు పింఛను ఇస్తారు.






















