News
News
X

ఈ నెల 14 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు- 2లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం!

ఈ నెల 14 నుంచి ఏపీ  అసెంబ్లీ  సమావేశాలు నిర్వహించనున్నారు. 17 న బడ్జెట్  ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 

FOLLOW US: 
Share:

ఈనెల 14వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. సమావేశాల్లో భాగంగా 17వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న వేళ ఇప్పుడు ప్రవేశ పెట్టే బడ్జెట్టే ఈ ప్రభుత్వానికి ఆఖరి పూర్తి స్థాయి బడ్జెట్‌ కానుంది. అందుకే ఈ ఏడాది 2లక్షల 60వేల కోట్లతో బడ్జెట్‌ను రూపకల్పన చేయబోతున్నారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. 

భారీ అంచనాలతో ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆంధ్రప్రదేశ ప్రభుత్వం కీలక రంగాలపై మెయిన్‌గా ఫోకస్ చేయనుంది. సంక్షేమంతోపాటు వ్యవసాయం, విద్యా,వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని సమాచారం. ఎన్నికల ముందు  ప్రవేశ పెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావటంతో ప్రతి అంశాన్ని కీలకంగా సునిశితంగా పరిశీలిస్తున్నారు. 
బడ్జెట్‌ మొత్తం ఒక ఎత్తైతే.. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ కీలక ఇష్యూస్‌పై ప్రకటన చేయబోతున్నారట. నాలుగేళ్ళ పాలన, మూడు రాజధానులు, సంక్షేమం,  వైజాగ్ గ్లోబల్ సమిట్ ఇలా ఒక్కో అంశంపై మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. 

గవర్నర్ ప్రసంగం...

అసెంబ్లీ సమాశాలను పురస్కరించుకొని ఉభయ సభలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్‌ ప్రసంగించనున్నారు. 14వ తేదీన గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లి సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశం పై ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటారు. మరో వైపున ఈ నెల 27వ తేదీ వరకు అసెంబ్లి సమావేశాలను నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అంటున్నారు.

రాజధాని అంశమే కీలకం

విశాఖ కేంద్రంగా రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే క్లారిటి ఇచ్చారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో మాట్లాడిన సీఎం జగన్ విశాఖపట్టణం కేంద్రంగా రాజధాని అని అక్కడికే తాను కూడా షిప్టు అవుతన్నట్టు తేల్చేశారు. కోర్టులో కేసులు నడుస్తున్న టైంలో ఎప్పుడు విశాఖ వెళ్తారనే విషయంలో చాలా ఊహాగానాలు నడుసస్తున్నాయి. సీఎం విశాఖకు షిఫ్టింగ్‌పై కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే క్లారిటి ఉంటుందని అంటున్నారు. 

తెలుగు సంవత్సరాది ఉగాది తర్వాత సీఎం వారానికి మూడు రోజులు వైజాగ్‌లో ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. అయితే సీఎం సింగల్‌గా వైజాగ్ వెళితే పరిస్థితి ఏ రకంగా ఉంటుందనే అంశంతోపాటు, మిగిలిన  శాఖల  షిఫ్టింగ్‌ విషయం కూడా సభలో ప్రస్తావనకు రానుంది. మరోవైపు రాజధాని అంశం ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. దీంతో సుప్రీం నిర్ణయం కూడా కీలకంకానుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి..

సిద్దం అవుతున్న ప్రతిపక్షం....

బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ కూడా కీలక అంశాలకు సంబంధించిన చర్చ లెవనెత్తే పరిస్థితి కనిపిస్తోంది. పెరిగిన ధరలు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇతర అంశాల పై టీడీపీ చర్చకు పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి వాడి వేడిగానే ఈసారి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండనున్నాయని భావిస్తున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు, ఎమ్మెల్సీ హోదాలో నారా లోకేష్ ఇద్దరూ సభకు దూరంగా ఉండబోతున్నారు. గతంలో అసెంబ్లి వేదికగా సవాల్ చేసిన చంద్రబాబు,సమావేశాలకు దూరంగా ఉంటుండగా,ఎమ్మెల్సీ గడువు ముగియటంతో నారా లోకేష్ కూడ ఈసారి మండలి సమావేశాలకు రావటం లేదు. మరోవైపున లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రలో బిజిగా ఉన్నారు. దీంతో టీడీపీ నేతలు ఈసారి బడ్జెట్ సమావేశాల్లో తమ వాదనను పూర్తిగా వినిపించేందుకు అన్ని శక్తులను సమీకరిస్తున్నారు.

Published at : 11 Mar 2023 02:25 PM (IST) Tags: BJP YSRCP AP Asembly ap assembly budget sessions TDP AP Updates AP Assembly Budget Sessions 2023 Budget Sessions 2023

సంబంధిత కథనాలు

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Four MLAS : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు - ఆధారాలెలా ?

Four MLAS :  ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు - ఆధారాలెలా ?

మత మార్పిడి రిజర్వేషన్ల తీర్మానం ఉపసంహరించకపోతే ఉద్యమం తప్పదు: సోము వీర్రాజు

మత మార్పిడి రిజర్వేషన్ల తీర్మానం ఉపసంహరించకపోతే ఉద్యమం తప్పదు: సోము వీర్రాజు

AP Power Tariff : ఏపీ వాసులకు గుడ్ న్యూస్, ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల మోత లేదోయ్

AP Power Tariff : ఏపీ వాసులకు గుడ్ న్యూస్, ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల మోత లేదోయ్

ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు- మాజీ ఎంపీ హర్షకుమార్

ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు- మాజీ ఎంపీ హర్షకుమార్

టాప్ స్టోరీస్

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?

Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?