అన్వేషించండి

Amaravati Real Estate : ఏపీ రాజధానిలో రియల్ ఎస్టేట్ భూమ్ - నెలలో రెట్టింపయిన ధరలు !

Andhra Pradesh : అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంటోంది. ధరలు నెలలోనే రెట్టింపు అయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు.

Amaravati real estate business is booming :  ఏపీలో ప్రభుత్వం మారడంతో అనుకున్నట్లుగానే  అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతిని దారిలో పెట్టాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. అది అయిపోగానే.. గతంలో నిర్మాణలు మధ్యలో ఆగిపోయిన భవనాల పటిష్టతపై నివేదికలు తెప్పించుకుని.. వాటి నిర్మాణాలను పునంప్రారంభించనున్నారు. అంటే ఇంకా నిర్మాణాలు ప్రారంభం కాలేదు. కానీ పట్టాలెక్కడం ఖాయమన్న నమ్మకంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది . కొనుగోలుదారులు .. అమ్మకం దారులు ఎక్కువగా ఉండటంతో రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. 

రాజధాని గ్రామాల్లో క్రయవిక్రయాలు                            

రాజధాని గ్రామాల్లో భూముల అమ్మకాలు కకొనుగోలు ఊపందుకుంటోంది.  జూన్‌ మొదటి వారం నుంచి క్రయవిక్రయాలు పెరగడంతో దరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు రాక ముందు  మెట్ట ప్రాంతంలో  గజం రూ.20 వేలు నుంచి 25 వేలు వరకు అమ్మకాలు జరిగాయి.  ఇప్పుడు రూ.35 నుంచి రూ.40 వేలకు పెరిగింది.  మాగాణి భూముల్లో పోయిన సంసంవత్సరం గజం రూ.30 వేల నుంచి రూ.35 వేలు ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.50 వేల నుంచి రూ.60 వేలకు చేరుకుంది. ఈ స్థాయిలో ధర పెరగడంతో ఇంత కాలం వేచి చూసిన వాళ్లు అమ్ముకుంటున్నారు. రిజిస్ట్రేషన్లు కూడా భారీగా  పెరుగుతున్నాయి.  తుళ్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో గత నెలలో 280 రిజిస్ట్రేషన్లు జరిగాయ. కానీ  గత  పది రోజుల్లోనే 108 రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా తెలుస్తోంది. 

ఇంకా కొంత మందికి  అందాల్సిన  రిటర్నబుల్ ప్లాట్లు                 
 
 2015లో   భూసమీకరణ ద్వారా రైతుల నుంచి 34,772 ఎకరాలను తీసుకుంది.   రైతులకు అభివృద్ధి చేసిన రిటర్నబుల్‌ ప్లాట్లు ఇస్తామని ప్రకటించింది. మూడేళ్లలో రిటర్నబుల్‌ ప్లాట్లు ఇస్తామని సిఆర్‌డిఎ చట్టంలో పేర్కొంది. టీడీపీ ప్రభుత్వం కొంత మందికి ఇచ్చింది. వైసీపీ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఐదేళ్లుగా ప్రక్రియ ముందుకు సాగలేదు. జగన్ మూడు రాజధానుల విధానం  ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ పడిపోయిదంి.   భూముల క్రయవిక్రయాలు తగ్గిపోయాయి.  టీడీపీ రావడంతో అమరావతికి కొత్త కళ సంతరించుకుంటుందని భావించి పలువురు రియల్టర్లు, ధనికులు, వ్యాపారవేత్తలు రాజధానిలో భూముల కొనుగోలు చేస్తున్నారు. 

మంచి ధర వస్తూండటంతో అమ్ముకుంటున్నరైతులు

భూములిచ్చిన రైతులు తమ ప్లాట్లను విక్రయించుకుంటున్నారు.  మెట్ట ప్రాంతంలో ఎకరా భూమి ఇచ్చిన రైతుకు వెయ్యి గజాలు నివాస స్థలం,  , 200 గజాలు కమర్షియల్‌ స్థలం ఇస్తున్నారు.  రీబు భూమి ఇచ్చిన రైతులకు 1200 గజాలు  నివాస స్థలం  ‌, 250 గజాలు కమర్షియల్‌ ల్యాండ్‌ కేటాయిస్తూ ప్రభుత్వం సంబంధిత పత్రాలను రిజిస్ట్రేషన్‌ చేసింది. మొత్తం 54 వేల ప్లాట్లు రైతులకు రిటర్నబుల్‌గా ఇచ్చింది. ప్రస్తుతం రైతులు వీటిని విక్రయిస్తున్నారు. రాజధాని సమీపంలోని పెదకూరపాడు, సత్తెనపల్లి, క్రోసూరు, అచ్చంపేట, తాడికొండ, మంగళగిరి, పెదకాకాని తదితర మండలాల్లో కూడా గత రెండు నెలల కాలంలో పొలాలకు, స్థలాలకు 50 నుంచి వంద శాతం వరకు ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Rohit Engagement: చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
Tadipatri News: 15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
Oviya Video Leaked Online: తమిళ నటి ప్రైవేట్ వీడియో లీక్! ఎంజాయ్ చేయండంటూ షాకిచ్చిన ఓవియా 
తమిళ నటి ప్రైవేట్ వీడియో లీక్! ఎంజాయ్ చేయండంటూ షాకిచ్చిన ఓవియా 
Telangana Crop Loan Waiver: రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్, రుణమాఫీపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం
తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్, రుణమాఫీపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Baba Siddique: సల్మాన్‌ ఖాన్‌కు ఫ్రెండ్ అయితే చంపేస్తారా?Baba Siddique: కత్రినా కోసం సల్మాన్-షారూఖ్ వార్! ఐదేళ్ల గడవకు ఫుల్‌స్టాప్ ఈయన వల్లేInd vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samsonవిజువల్ వండర్‌గా విశ్వంభర, టీజర్‌లో ఇవి గమనించారా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Rohit Engagement: చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
Tadipatri News: 15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
Oviya Video Leaked Online: తమిళ నటి ప్రైవేట్ వీడియో లీక్! ఎంజాయ్ చేయండంటూ షాకిచ్చిన ఓవియా 
తమిళ నటి ప్రైవేట్ వీడియో లీక్! ఎంజాయ్ చేయండంటూ షాకిచ్చిన ఓవియా 
Telangana Crop Loan Waiver: రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్, రుణమాఫీపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం
తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్, రుణమాఫీపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం
Baba Siddique Death: ఎవరీ బాబా సిద్ధిఖీ - మర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఎందుకు వెళ్లారు? బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు?
ఎవరీ బాబా సిద్ధిఖీ - మర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఎందుకు వెళ్లారు? బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు?
Attack on TDP Office: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ
Home Loan: కో-అప్లికెంట్‌తో కలిసి హోమ్‌ లోన్‌ తీసుకుంటున్నారా?, ముందు లాభనష్టాల గురించి తెలుసుకోండి
కో-అప్లికెంట్‌తో కలిసి హోమ్‌ లోన్‌ తీసుకుంటున్నారా?, లాభనష్టాల గురించి తెలుసుకోండి
Viral News: డ్రైవర్ లేకుండా వెళ్తున్న కారులో మంటలు, షాకింగ్ వీడియో వైరల్
డ్రైవర్ లేకుండా వెళ్తున్న కారులో మంటలు, షాకింగ్ వీడియో వైరల్
Embed widget