అన్వేషించండి

Ambati Rayudu : మంచి పనులు చేస్తే బురద చల్లుతారు - వాలంటీర్లు ధైర్యంగా ముందుకెళ్లాలని అంబటి రాయుడు సలహా !

వాలంటీర్ల వ్యవస్థ అద్భుతమని అంబటి రాయుడు అంటున్నారు. ఆరోపణల్ని పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకెళ్లాలన్నారు.

 

 

Ambati Rayudu :   ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల అంశంపై జరుగుతున్న వివాదంలో  మాజీ క్రికెటర్, త్వరలో రాజకీయ ప్రవేశం చేయబోతున్న అంబటి రాయుడు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ వ్యవస్థ  అద్భుతంగా పనిచేస్తుందన్నారు.  వాలంటరీ వ్యవస్థ మన రాష్ట్రానికి ఫ్లాగ్ షిప్ లాంటిదన్నారు.  దేశంలో 70 సంవత్సరాల నుంచి జరగనది మన రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతోందని ప్రశంసించారు.  ప్రతి మనిషికి ఏది అందాలో అది వాలంటరీ ద్వారా అందుతుందని చెప్పారు.  వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు ఒక గొప్ప ఆలోచన అని..  వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందని ప్రకటించారు. గుంటూరులో ఆయన వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. 

వాలంటీర్ల వ్యవస్థ గొప్పదన్న అంబటి రాయుడు 

ప్రజలకు మంచిగా సేవలందించే వాలంటరీ వ్యవస్థ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదని...  కరోనా సమయంలో వాలంటీర్లు తమ ప్రాణాన్ని ఫలంగా పెట్టి అందరికీ సేవలందించారని ప్రశంసించారు.  జీవితాంతం ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలని సలహా ఇచ్చారు.  వాలంటరీ వ్యవస్థ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువేనని మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారన్నారు.  వాటిని మనం పట్టించుకోకూడదు .. వాలంటీర్లు అందరూ ధైర్యంతో ముందుకు వెళ్లాలని సలహా ఇచ్చారు. 

కీలకమైన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న పవన్ కల్యాణ్ 

ఏపీలో ఒంటరి మహిళల సమాచారం...  సంఘ విద్రోహ శక్తులకు చేర వేస్తున్నారని.. పవన్ కల్యాణ్ ఆరోపించడంతో వివాదం ప్రారంభమయింది.  వాలంటీర్లు సేకరించే అతి సున్నితమైన సమచారాన్ని ప్రభుత్వంలో పని చేసే కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు.  అందర్నీ అనట్లేదు కానీ కొందరు వ్యక్తులు ఆడపిల్లలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.   కేంద్రంలోని చాలా పెద్ద స్థాయి నిఘా సంస్థల్లో పని చేసే వ్యక్తులు కూడా రాష్ట్రంలో ఆడపిల్లల అదృశ్యాలకి కొందరు రాజకీయ నాయకులకు సంబంధం ఉంది అని చెప్పారని అంటున్నారు.  అందుకే వాలంటీర్లకు సమాచారం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సున్నితమైన సమాచారాన్ని ఇవ్వకండని ప్రజలకు పిలుపునచ్చారు.  ఈ విషయం చెప్పినందుకు నువ్వు నా మీద ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సవాల్ చేశారు. 
 
ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు సమాచారం ఎలా తీసుకుంటారు ? 

వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ప్రజల సమాచారం ఎలా తీసుకుంటారని పవన్ కల్యాణ్ ప్రశఅనిస్తున్నారు.  ఒక MRO తప్పు చేస్తే పై అధికారికి కంప్లైంట్ చేయచ్చు మరి వాలంటీర్లు తప్పు చేస్తే ఎవరికి చెప్పాలి?  వాలంటీర్లకు ప్రజల డబ్బుతో జీతాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్క వాలంటీర్ సమాచారం ఎస్పీ, కలెక్టర్ ఆఫీసుల్లో పెట్టండి. కంప్లైంట్ల కోసం వాట్సాప్ గ్రూప్, టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి. "హిట్లర్ నిఘా వ్యవస్థ లాగా జగన్ వాలంటీర్ వ్యవస్థ మారుతుంది జాగ్రత్త" అని  హెచ్చరిస్తున్నారు.   ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా సమాంతరంగా ఇంకో వ్యవస్థను నడపడం కేవలం ప్రజలను కంట్రోల్ చేయడానికే వాలంటీర్లు సేకరించే సమాచారంతో రాష్ట్రంలో ఏ మూలన వైసీపీ వ్యతిరేకులు ఉన్నారో జగన్ గమనిస్తున్నాడు. జర్మనీలో హిట్లర్ ఇలానే చేసేవారంటన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Embed widget