అన్వేషించండి

Ambati Rambabu granted bail: లక్కీ డ్రా కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ - ఏ కేసులోనూ పీటీ వారెంట్ లేకపోతే విడుదల

Ambati Rambabu: అంబటి రాంబాబుకు లక్కీ డ్రా కేసులో బెయిల్ లభించింది. అయితే ఆయన విడుదలయ్యే వరకూ సస్పెన్స్ కొనసాగనుంది.

Ambati Rambabu granted bail in lucky draw case :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న కేసులో గుంటూరు కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అంబటిని విచారించేందుకు పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కూడా న్యాయమూర్తి తోసిపుచ్చారు.                      

జనవరి 31 నుంచి జైల్లో అంబటి రాంబాబు                

 అంబటి రాంబాబు జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తొలుత ఆయన అరెస్ట్ అయ్యారు. ఆ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న మరో కేసులో పీటీ వారెంట్‌పై ఆయనను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.తర్వాత ఆ కేసులోనూ బయిల్ వచ్చింది.                         

మరో కేసులో పీటీ వారెంట్ జారీ చేయకపోతే విడుదల                  

ఇప్పటికే చంద్రబాబును దూషించిన కేసు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసుల్లో అంబటికి బెయిల్ లభించింది. అయితే, సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా కేసులో పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉండటంతో ఆయన జైలులోనే కొనసాగాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ మూడో కేసులో కూడా బెయిల్ మంజూరు కావడంతో ఆయన విడుదలకు ఉన్న ప్రధాన చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.        

గురువారం ఉదయం విడుదలయ్యే అవకాశం                

ప్రస్తుతానికి అంబటిపై ఇతర పీటీ వారెంట్లు ఏవీ పెండింగ్‌లో లేవని సమాచారం. కోర్టు జారీ చేసిన బెయిల్ ఆర్డర్లు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు అందిన వెంటనే అధికారిక ప్రక్రియ పూర్తి చేసి ఆయనను విడుదల చేసే అవకాశం ఉంది. అన్నీ సవ్యంగా జరిగితే బుధవారం రాత్రికి లేదా గురువారం ఉదయానికి అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని ఆయన తరపు న్యాయవాదులు భావిస్తున్నారు. బెయిల్ వచ్చిందని తెలియగానే ఆయన ట్వీట్ చేశారు. కూటమిని కూల్చేవరకూ పోరాడతానన్నారు.                             

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్‌లో కీలక పరిణామం.. ఇంటర్‌ఛేంజ్‌లు కుదించడంతో తగ్గిన ప్రాజెక్టు వ్యయం
అమరావతి ఓఆర్ఆర్‌లో కీలక పరిణామం.. ఇంటర్‌ఛేంజ్‌లు కుదించడంతో తగ్గిన ప్రాజెక్టు వ్యయం
Jal Jeevan Mission 2.0: కడపలో జల్ జీవన్ మిషన్ 2.0 ప్రారంభించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. 3.27 కోట్ల మందికి ప్రయోజనం
కడపలో జల్ జీవన్ మిషన్ 2.0 ప్రారంభించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. 3.27 కోట్ల మందికి ప్రయోజనం
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget